Horoscope 2023 : నవంబర్ నెలలో మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మార్స ఫలితాలు పరిశీలిస్తే ఈ నవంబర్ నెలలో జన్మరాశిలో గ్రహాల సంచారం ఉంది కాబట్టి ఈ జన్మ రాశిలో గ్రహాల సంచారం అనేది శరీరం మీద దెబ్బతీస్తుంది స్వల్పంగా ఆరోగ్య భంగములు చోటుచేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేలకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం యోగ ప్రాణాయామం లాంటివి చేయడం ద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అధిగమించవచ్చు అలాగే మానసికంగా కూడా స్థిమితం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మనశ్శాంతిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
ఎంతటి వారైనా సరే నవంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటారు ఆ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే ఆ కోపం వల్ల చాలా ఇబ్బందులు నవంబర్ నెలలో కనిపిస్తాయి అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవటం వల్ల కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆప్త మిత్రులను దగ్గర వాళ్ళని కూడా ఒక్కొక్కసారి విసుక్కుంటూ ఉంటారు దానివల్ల వాళ్ళ మనసు బాధపడే అవకాశం ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అలాగే సంతానం మీద కూడా ఆవేశపూరితంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి కానీ వ్యాపార వ్యవహారాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి ఉద్యోగ వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తే ఉద్యోగ రంగంలో అభివృద్ధి సాధిస్తారు వ్యాపార పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారం మూడు పువ్వు ల ఆరు కాయలుగా విరాజల్లుతుంది ధనపరంగా లోటే ఉండదు ధనం అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఏదో ఒక విధంగా డబ్బులు ఎప్పుడు చేతిలో ఉంటూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

అనేక మార్గాల్లో ఆదాయం రావడం వల్ల ధనపరమైన వ్యవహారాల్లో ప్రశాంతంగా ఉంటారు అయినప్పటికీ కూడా ఆరోగ్య వ్యవహారాల పరంగా కోపం పరంగా మాత్రమే ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ రెండు వ్యవహారాల్లో తగిన సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అలాగే ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు కూడా ఈ నవంబర్ నెలలో ఎదురవుతూ ఉంటాయి. ఈ అనుకొని సమస్యల వల్ల మనశ్శాంతి అనేది తగ్గుతూ ఉంటుంది అలాంటప్పుడే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీ తెలివితేటలతో అనుకొని సమస్యలు పరిష్కరించి ముందడుగు వేయాలి. అప్పుడు అంతిమంగా మీకు విజయం లభిస్తుంది మనశ్శాంతి ఏర్పడుతుంది అలాగే మీకు బాగా కావలసిన వాళ్లే నమ్మించి మోసం చేసే అవకాశం నవంబర్ నెలలో కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరినైతే బాగా నమ్మారు ఎవరైతే మీకు బాగా కావాల్సిన వాళ్ళు అలాంటి వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి వాళ్ళు చేసే చర్యలన్నీ జాగ్రత్తగా నవంబర్ నెలలో దగ్గరుండి పర్యవేక్షించుకునే ప్రయత్నం చేయటం మంచిది.
అలాగే మీకు బాగా దగ్గరి వాళ్ళే మీరు నమ్మినవాళ్లే మీకు నష్టాలు కలిగించాలని నవంబర్ నెలలో చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా చాలా వరకు సమస్యలు అధిగమించవచ్చు ఏది ఏమైనా కూడా నవంబర్ నెల మొత్తం కూడా ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా వృశ్చిక రాశి వాళ్ళు అడుగులు వేయాలి. అప్పుడు ఎదుటి వాళ్ళ మోసపోకుండా జాగ్రత్తగా ప్రయోజనాలు పొందవచ్చు నవంబర్ నెల మొత్తం కూడా కలిసి రావాలంటే అనుకూల తేదీలు 7 9 14 25 26 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే నవంబర్ నెలలో ప్రతికూల తేదీలు 2 4 12 16 21 23 30 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి వృశ్చిక రాశికి ప్రధానంగా అర్ధాష్టమ శని దోషం పనిచేస్తుంది.
కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవటానికి ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో గానీ నల్ల నువ్వులు కలిపి నీళ్లతో గాని అభిషేకం చేసుకోవటం శివాలయానికి వెళ్లి ప్రదోషకాలంలో శివ దర్శనం చేసుకొని శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం శివాలయంలో ప్రదక్షిణలు చేయడం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు శివ పంచాక్షరి స్తోత్రం గాని శివతాండవ స్తోత్రం కానీ ప్రదోషకాలంలో చదువుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21సార్లు చదువుకోవాలి ఇలా శివారాధన చేయడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింప చేసుకోవడంతో పాటు గురు బలాన్ని కూడా పెంపొందింప చేసుకొని నవంబర్ నెల మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింప చేసుకోవచ్చు .
Read Also : Astrology Remedies : శనివారం నాడు ఈ రాశుల వారు ఇలా పూజిస్తే సకల శని దోషాలు తొలగిపోతాయి..!




