Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ అన్నంలోకి భలే రుచిగా ఉంటుందండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపించేస్తాను రండి ఈ ముద్దకూర కోసం ఫస్ట్ నేను ఈ సైజులో ఉన్నవి మూడు తోటకూర కట్టలు తీసుకున్నానండి నేను తీసుకున్నది కొయ్య తోటి కోరండి దీంట్లో పెరుగు తోటకూర అని కూడా దొరుకుతుంది మీకు ఆ తోటకూర నైనా మీరు వాడుకోవచ్చు అలాగే తోటకూర లేతగా ఉన్న తీసుకోండి తొందరగా మగ్గిపోతుంది మీకు రుచి కూడా బాగుంటుంది లేతగా ఉంటే ఇప్పుడు ఈ తోట కూరని ఇలా తుంచుకోండి కాడ మీకు మరి ముదురుగా ఉంది అనుకోండి.

ఆ ఆడ వరకు తీసేసి లేతగా ఉన్న కాడల వరకు వేసుకోండి ఈ తోటకూరలు ఇలా తుంచుకున్న తర్వాత శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడిగేయండి కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చాకు తోటి సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలా తోటకూర మొత్తాన్ని సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్ లో వేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ సైజులో ఉన్నది ఒక దోసకాయ తీసుకోండి ఒక 300 గ్రాములు దాకా ఉండండి దోసకాయ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి తోటకూర తక్కువ ఉండాలి దోసకాయ ఎక్కువ ఉండాలి అప్పుడే మీకు కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ దోసకాయకి పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి ఈ దోసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ దోసకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు దోసకాయ ఒక చిన్న ముక్క కట్ చేసుకుని టేస్ట్ చేయండి.

ఎందుకంటే ఒకసారి మనకి చేదు ఉంటుందండి చేదు ఉంది అంటే మనకి కూర అంతా పాడైపోతుంది చేదు అయిపోతుంది అందుకని మీరు కట్ చేసుకునే ముందే కొద్దిగా టేస్ట్ చేసుకుని చేదుంటే ఆ దోసకాయ కూరకి పనికిరాదు చేదు లేకపోతే చక్కగా కోరి చేసుకోవచ్చు ఇది దోసకాయ బానే ఉందండి నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఈ విత్తనాలతో సహా వేసుకుంటున్నాను నేను మీకు ఈ లోపల ఉన్న విత్తనాలు నచ్చలేదు అనుకోండి విత్తనాలు తీసేసి పై పార్ట్ వరకు సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా ఒక బౌల్ లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి.

Dosakaya Thotakura Curry in telugu
Dosakaya Thotakura Curry in telugu

ఆవాలు, జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేశాను ఈ ఆవాలు చిటపటలాడినదాక వేగం ఇవ్వండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేయండి దీంట్లోనే ఒక రెండు ఎండు మిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోండి ఇవన్నీ కొద్దిగా వేగనివ్వండి ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఇలా కలుపుకుంటూ వేయించండి ముందుగానే ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడి ఎగుతాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి.

Dosakaya Thotakura Curry :

 

ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకొనే దోసకాయ ముక్కల్ని వేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా అన్నీ ఒకటేసారి వేసి బాగా కలిపి మగ్గించేసుకున్నారు అనుకోండి మీకు దోసకాయ ముక్కలు మగ్గేలోపు ఈ తోటకూర టమాట ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయండి ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ నీలో ఫ్లేమ్ లో పెట్టి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి నీళ్లు ఏమి యాడ్ చేయొద్దండి మనకి దోసకాయలో నుంచి కొద్దిగా నీళ్లు ఊరతాయి ఆ నీళ్లతోనే బాగా మగ్గించేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను ఒక పది నిమిషాలు పైనే సిమ్లో పెట్టి మగ్గించేసానండి దోసకాయ కూర చూడండి బాగా ఉడికి పోయింది.

మెత్తగా మగ్గిపోయింది ఒకటి మొక్క నుంచి చూపిస్తాను చూడండి మీకు ఈజీగా కట్ అయిపోతుంది కదా బాగా ఉడికిందండి దోసకాయ ముక్కలు కూడా ఇప్పుడు గరిట తోటి నేనిక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనండి ఇలా అనడం వల్ల ఆకుకూర అనేది మీకు మెత్తగా నలిగిపోయినట్లు అయిపోయి కూర అనేది మీకు చిక్కగా అంటే గుజ్జు లాగా వస్తుంది రైస్ లో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి కలిపేసిన తర్వాత ఫ్లే మ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి జస్ట్ ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చేయండి ఎందుకంటే కారం ధనియాల పొడి వేసాం కదా ఒక నిమిషం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసేస్తే మనకి కూర రెడీ అయి ఉంటుందండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే. ఈ కూర రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి.

Read Also : Mamidikaya Drumstick Egg Curry : మామిడికాయ, కోడిగుడ్డు, ములక్కాయ కూర.. ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.. అంత టేస్టీగా ఉంటుంది!

Leave a Comment