Horoscope 2023 : నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో తెలుసుకుందాం. మీనరాశి మీన రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాసఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి నవంబర్ నెలలో చేస్తున్న వృత్తివ్యాపారాలలో కష్టంతో మాత్రమే విజయం కనిపిస్తోంది వేచి చూసేటటువంటి ధోరణి అలవాటు చేసుకోవాలి ఉద్యోగారంగంలో ఉంటే సహనంతో కష్టపడి ఉద్యోగం చేయాలి. వ్యాపార రంగంలో ఉంటే పోటీ తట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అద్భుత ఫలితాలు కనిపించవు కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే మీన రాశి వారికి నవంబర్ నెలలో కనిపిస్తుంది. ఆరోగ్యానికి అప్పుడప్పుడు చిన్నచిన్న ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వేలకు ఆహారాన్ని సేకరించాలి. సరైన సమయానికి నిద్రించాలి యోగా ప్రాణాయామం వంటివి తప్పనిసరిగా పాటించాలి అకాల భోజనాన్ని విడిచి పెట్టాలి. శారీరక శ్రమ కూడా తగ్గింపజేసుకొనే ప్రయత్నం చేయాలి ఒక్కొక్కసారి కుటుంబంలో అశాంతి వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది అటువంటిప్పుడు స్నేహపూర్వకంగా ప్రేమ పూర్వకంగా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఆ శాంతి వాతావరణ నుంచి బయటపడతారు మనో దుఃఖాన్ని మాత్రం దగ్గరకు రానీయకండి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మాత్రం చురుకుగా పాల్గొంటూ ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భగవంతుడి అనుగ్రహం వల్ల చాలా వరకు ప్రశాంతత పొందుతూ ఉంటారు అయితే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి స్త్రీలు గాని మీనరాశి పురుషులు గాని ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సంతానం వల్ల కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి సంఘంలో కూడా మీ మీద ఏడుపు పెరుగుతుంది కావాలని మీ మీద వ్యతిరేకత పెంచే వాళ్ళు పెరుగుతారు కాబట్టి సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు చిరునవ్వుతో ఉండండి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అవసరానికి మాట్లాడే ప్రయత్నం చేయండి అప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదు. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండండి చిన్న చిన్న విషయాలకే జీవిత భాగస్వామి నవంబర్ నెలలో మెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో వేచి చూసేటటువంటి ధోరణి అలవాటు చేసుకోవాలి ప్రతి విషయంలో ఆలోచించి అడుగులు వేయాలి సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి.
ఈ ప్రత్యేకమైనటువంటి విధివిధానాలు పాటిస్తే నవంబర్ నెలలో వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకోవచ్చు పూర్తిగా అనుకూల ఫలితాలు అంది పుచ్చుకోవచ్చు ఈ నెలలో మీ కలిసి వచ్చేటటువంటి తేదీలు 7 9 10 18 23 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి నవంబర్ నెల మీనరాశి వాళ్లకు తేదీలు 2 4 12 14 21 25 29 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి అలాగే మీన రాశికి ఏలినాటి శని దోషం ఉంది ఈ ఏలినాటి శని దోషాన్ని అధిగమించాలంటే వీలైనప్పుడల్లా నవంబర్ నెలలో శివాలయానికి ఆంజనేయస్వామి ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తూ ఉండండి అలాగే శివాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేయండి ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో గాని నల్ల నువ్వులు కలిపిన పాలతో గాని అభిషేకం చేసుకుంటూ ఉండండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకోండి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి అలాగే కాలభైరవాష్టకాన్ని చదువుకోండి ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకోవటం ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని రోజు వీలైనంత సార్లు జపించుకోవడం ద్వారా మీన రాశి వాళ్లు నవంబర్ నెలలో వచ్చే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు తొలగింప చేసుకుని నెల మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు..
Read Also : Zodiac Signs : ఈ రాశుల వారు జీవితంలో లక్ష్యాలపై గురి ఎక్కువగా పెడతారు.. ఇందులో మీ రాశి ఉందా?




