Astrology Remedies : శనివారం వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం నవగ్రహ మంటపంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తుంటారు. నవగ్రహాలను దర్శనం చేసుకుని దీపారాధన చేసి నువ్వుల నూనెతో ఆ శనీశ్వరుని అభిషేకించి నువ్వులను నివేదనగా సమర్పించి నల్లని వస్త్రాన్ని అర్చన మూర్తికి అలంకారంగా అలంకరించి నమస్కరిస్తుంటారు. ఇలా చేయడం ద్వారా శని పీడ తొలగిపోతుందని భావిస్తుంటారు. వృశ్చిక రాశి ఆరు రాశులకు శని గ్రహం ఉండటం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. మిథున రాశి వారికి శని గ్రహ సంచారం ఉన్న కారణం చేత ఇబ్బందులు ఎదురవుతాయి. పుణ్యబలం తగ్గుతుంది. వృషభ రాశి వారికి దశమంలో శని గ్రహ సంచారం ఉండటం వల్ల ఉద్యోగంలో పనిచేసేటటువంటి చోట కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అధికంగా లభిస్తాయి. కానీ, ఆర్థిక లాభాలు ఉండవు.
మేషరాశి వారికి 11వ ఇంట శని ఉండటం చేత లాభాలు విపరీతంగా లభిస్తాయి. ఇతర రాశుల వారికి కూడా శని సంచారం కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడుతాయి. శనివారం రోజున ఊదా రంగు, నీలం రంగులో ఉండే దుస్తులను ధరించడంతో పాటు ‘రవిపుత్రం, యమాగ్రజం, ఛాయామార్ తాండ సంభూతం’ ఇలా శని గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకంతో 9 సార్లు నవగ్రహ మంటపం చుట్టూరా ప్రదక్షిణలు చేస్తూ 19 సార్లు చదవాలి. శని గ్రహానికి సంబంధించి జీవితంలో అంతర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఈ శ్లోకాన్ని 19 వేల సార్లు జపం చేయాలి. లేదంటే కనీసం 19 సార్లైనా జపం చేయాలి.
నీలం రంగులో ఉండే దుస్తులను దానం ఇవ్వడం చేయాలి. చెక్క పూసలతో తులసి మాలగా జపమాలను సేకరించి శని గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని నామాన్ని జపం చేయాలి. తద్వారా అనేక దోషాలను నివారణ చేసుకోవచ్చునని శాస్త్రాల్లో ఉంది. కొబ్బరి నీటితో శని గ్రహానికి అభిషేకం చేసినా, కుమారస్వామి ఆరాధన ఏది చేసిన దేహంలో ఉండేటటువంటి నవగ్రహ శక్తులు అనుకూలతను పొందవచ్చు. శనివారం నాడు శనీశ్వరగా సంబంధించిన దోషాలు తొలగించుకోవడం కోసం దీపారాధన చేయాలి. సంకల్పం కలవారు ఈ వ్రతాన్ని నియమ పూర్వకంగా 19 శనివారాలు పూర్తి చేయాలి. శని గ్రహానికి సంబంధించిన ఏ విధమైన సేవలు చేస్తున్న 19 సంఖ్యతో ముడి పెట్టుకుని చేయాలి.
Astrology Remedies : శని దోషాలు తొలగిపోవాలంటే ఇలా చేయాల్సిందే..
19 పిడికిలితో నువ్వులు, 19 పిడికిలి గోధుమలు, 19 పిడికిలి జొన్నలు తీసుకుని దానం చేయాలి. 19 అన్న సంఖ్యలో శనిచ్ఛ రాయనమః అంటూ స్మరిస్తూ శనివారం నాడు అధిక శిరావణ మాసంలో ఆచరించినట్లయితే శనిగ్ర సంబంధిత సమస్త దోషాలు తొలగిపోతాయి. అధిక శ్రావణమాసం నియమాలకు సంబంధించిన దాన విశేషాలలో కృష్ణపక్షంలో శనివారం నాడు నల్లని వస్త్రంలో కానీ నీలం రంగు వస్త్రంలో కానీ, పావు కిలో అరకిలో నువ్వులను రాసిగా పోసి.. నాలుగు వైపులా ఆ వస్త్రాన్ని ముడివేసి, పసుపు కుంకుమ అక్షయ పూజించి రెండు తమలపాకులు నల్లని రెండు వక్కలు ఆ తమలపాకుల పైన ఉంచి దక్షిణగా ఆలయంలో ఉండే అర్చక స్వాముల వారికి దానంగా అందించాలి. ఇలా దానం ఇవ్వడం ద్వారా శని గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి.
Read Also : Guruvinda Ginja Benefits : అష్ట దరిద్రులు కూడా కుబేరులు చేసే అద్భుతమైన పరిహారం!