Badrinath Temple : మన హైదరాబాద్లో బద్రీనాథ్ నుంచి ఈ ఆలయానికి అఖండ దీపాన్ని తీసుకొచ్చారు ఈ ఆలయంలో చేసే ప్రత్యేక పూజలు ఏంటి ఏ టైంలో వెళ్తే మీకు మంచి దర్శనం జరుగుతుంది ఎలా వెళ్లాలి టెంపుల్ కి వెళ్లే ముందు ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ క్షేత్రం గొప్పతనం గురించి మీకు ఒక 15 సెకండ్ల క్లుప్తంగా చెబుతాను చార్ధామ్ యాత్ర గురించి మీరు వినే ఉంటారు చాలామంది యాత్రకు వెళ్ళు ఉంటారు కూడా చారదామంటే నాలుగు దామాలో అని అర్థం భారతదేశానికి నాలుగు దిక్కుల్లో ఈ క్షేత్రాలు ఉన్నాయి. దేశానికి పశ్చిమంలో ద్వారక తూర్పులో పూరి జగన్నాథ స్వామి ఉత్తరాదిన బద్రీనాథ్ అలాగే దక్షిణంలో రామేశ్వరం ఉన్నాయి ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటే మోక్షాన్ని పొందుతారని నమ్మకం బద్రీనాథ్ విష్ణు నివాసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు సంచరించిన తపస్సు చేసిన పవిత్ర పుణ్యక్షేత్రం విష్ణు ఏ క్షేత్రాన్ని విడిచిన బద్రీనాథ్ను విడవడని పురాణాలు చెబుతున్నాయి బద్రీనాథ్కు భూలోక వైకుంఠం గాను దివ్య భూమి గాను భక్తులను నమ్ముతారు అంతటి మహా క్షేత్రాన్ని పోలివున్న ఆలయాన్ని హైదరాబాద్లో నిర్మించారు ఆ అద్భుత ఆలయాన్ని హైదరాబాద్ కి సుమారుగా 50 కిలోమీటర్లు దూరంలో నిర్మించారు బద్రీనాథ్ స్వామి ఆలయం ఈ ఆలయం చూడడానికి నిర్మాణ శైలి పూర్తిగా ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం లానే ఉంటుంది
అసలు ఈ ఆలయం ఇక్కడ ఎందుకు నిర్మించాలని మీకు సందేహం వచ్చి ఉంటుంది ఎన్నో దశాబ్దాల క్రితం ఉత్తరాఖండ్ నుంచి తమ వ్యాపార ఉద్యోగరీత్యా ఎన్నో కుటుంబాలు హైదరాబాదులో స్థిరపడ్డాయి వారిలో కొంతమంది ఉత్తరాఖండ్ కళ్యాణ్ గారి సంస్థాన్ సొసై టీని స్థాపించారు తమ ఇష్టాదయమైన బద్రీనాథ్ 2011లో మేడ్చల్ లో ఈ స్థలాన్ని కొని సుమారుగా 13 ఏళ్లకు వివిధ దశలు పూర్తిచేసుకుని 2023 నాటికి మన ముందు ఇలా కనిపిస్తుంది ఈ విష్ణు క్షేత్రం ముందు ఈ టెంపుల్ గురించి మీకు చెప్పి ఈ ఆలయానికి ఈజీ పద్ధతిలో ఎలా రావాలనేది మీకు వీడియో చివర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆలయాన్ని మీరు మొట్టమొదటిసారి చూడగానే మీకు బద్రీనాథ్ ఆలయం గుర్తు రాక మానదు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఉత్తరాఖండ్లోనే ఉన్న ఆలయంలోనే అనిపిస్తుంది పూజా విధానం అలంకరణ అంతా కూడా బద్రీనాథ్ క్షేత్రాన్ని పోలి ఉంటుంది ఇక చాలా ముఖ్యమైన గర్భాలయంలో ఉన్న శ్రీమహావిష్ణువు దర్శనం బద్రీనాథ్ క్షేత్రం శ్రీమహావిష్ణువు భూమిపై కాలువ మోపిన పుణ్యభూమి దర్శించుకునేటప్పుడు బద్రీనాథ్లో మనం ఉన్న దివ్య అనుభూతి మీ అందరికీ కలుగుతుంది ఇక్కడ స్వామివారితో పాటు బదిరి క్షేత్రంలో ఉన్నట్టే వివిధ దేవతల విగ్రహ మూర్తులు పూజలు అందుకుంటున్నాయి తో పాటు స్వామివారి పాదాల చెంత ఉత్సవ మూర్తిని మీరు చూడొచ్చు అలాగే గర్భాలయంలో గణపతి కుబేరుడు ఉద్యమ మహారాజ్ మహాలక్ష్మి దేవి అమ్మవారు నరనారాయణులు అలాగే ప్రధాన విగ్రహానికి ఎదురుగా గరుత్మంతుల వారు నారదుడు విగ్రహాలు మీరు చూడొచ్చు ఈ గర్భాలయంలో మీరు ఒక అద్భుతాన్ని దర్శించుకోవచ్చు

ఈ దీపాన్ని దర్శించుకోవడానికి చాలామంది బదరీ క్షేత్రానికి వెళ్తారు ఈ ఆలయంలో కూడా సాక్షాత్తు శ్రీమహావిష్ణువు సంచరించిన భూలోక వైకుంఠమైన బదిలీ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన దీపాన్ని మీరు దర్శించుకోవచ్చు 13 మంది బృందంగా వెళ్లి రోడ్డు మార్గంలో ఉత్తరాఖండ్ నుంచి ఇక్కడకు 2000 పైన కిలోమీటర్లు ప్రయాణించి ఈ దీపాన్ని తీసుకొచ్చారు ఈ దీపం 365 రోజులు వెలుగుతూనే ఉంటుంది బదిలీ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన దీపం కాబట్టి ఈ దీపాన్ని నమస్కరి ంచుకోవడం శ్రేయస్కారం వారిని ఎంతసేపైనా దర్శించుకోవచ్చు దర్శనం అయితే పూర్తిగా ఉచితం స్వామివారి దర్శనం అనంతరం బయటకు వెళ్లే మార్గంలో వెనుకవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం అయిన తర్వాత మీరు ఆలయంలో కూర్చోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది
ఇక ఆలయానికి కుడివైపున గణపతి శివపార్వతుల చిన్న ఆలయం ఉంటుంది ఒకవేళ స్టార్ట్ చేస్తే నేను కమిటీ వారిని అడిగి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక మీరు ఈ టెంపుల్ కి రావడానికి బెస్ట్ టైం ఏంటి అని ఆలోచిస్తుంటే ఈ టెంపుల్ టైమింగ్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మీరు ఉదయాన్నే 9 లోపు వస్తే ఇక్కడ మీకు దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా జరుగుతుంది 11 12 గంటలు అయ్యేసరికి రద్దీ చాలా పెరుగుతుంది ప్రత్యేక దర్శనం టికెట్లు విఐపి దర్శనాలు ఇక్కడ ఉండవు. ఎలాంటి వారైనా లైన్లో నిలబడాల్సిందే రద్దీ ఎక్కువ ఉంటే మీకు దర్శనానికి గంట పట్టిన ఆశీర్వాదకరలేదు అలాగే సాయంత్రం అయితే నాలుగు ఐదు గంటల మధ్య అయితే రెస్ట్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది సో ఈ టైమింగ్స్ లో ప్లాన్ చేసుకుంటే మీకు కంఫర్టబుల్గా దర్శనమవుతుంది ఇక ఇక్కడికి ఎలా రావాలని మీలో చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది ఈ ఆలయం హైదరాబాదులో కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ నుంచి ఎంత దూరంలో ఉందో మీకు స్క్రీన్ పైన చూడొచ్చు.
ఈ ఆలయం మేడ్చల్ నుంచి పది కిలోమీటర్లు దూరంలో ఉంది హైవే నుంచి లోపలికి ఐదు కిలోమీటర్లు ఉండటం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రస్తుతానికి లేదనే చెప్పాలి నాకైతే ఇక్కడ ఆటో స్టాండ్స్ లాంటివి కూడా ఏమీ కనిపించలేదు సో ఇక్కడికి రావడానికి మీరు టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ తో ప్లాన్ చేసుకోండి మీరు కారులో వెళ్లేలా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఓఆర్ మార్గంలో వెళ్ళండి ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర దిగాలి అక్కడి నుంచి టెంపుల్ కి పన్నెండు కిలోమీటర్లు దూరం. పార్కింగ్ అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు చుట్టూ ఓపెన్ ప్లేస్ కాబట్టి సుమారుగా 200300 కార్లు వచ్చినా పార్క్ చేసే స్థలం ఇక్కడ ఉంది ఓన్ వెహికల్స్ లేని వారికి ఒక బెస్ట్ ఆప్షన్ ఉందండి అది ఏంటో మీకు చెప్తాను మేడ్చల్ వరకు సిటీ బస్ లేదా ట్రైన్ లో వచ్చి అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరమే కాబట్టి మీరు ఆటో హైడ్ చేసుకుని రావచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు స్వామివారికి తులసిమాల పూలు లాంటివి సమర్పించాలి అనుకుంటే అవి బయట తీసుకుని మీరు ఆలయానికి రండి ఆలయ ప్రాంగణంలో చిన్న షాప్స్ మాత్రమే ఉన్నాయి సో అదండీ దక్షిణ కే బద్రీనాథ్ ఆలయం విశేషాలు 2000 కిలోమీటర్లు దూరంలో ఉన్న బదిలీ క్షేత్రానికి వెళ్లడానికి మనకి రకరకాల కారణాలు పనులు వల్ల సాధ్యపడదు అలాంటి మహిమగల క్షేత్రం నమూనా ఆలయం ఇక్కడ మీరు దర్శించుకోండి అలాగే నిత్యం మన గురించి ఆలోచిస్తూ మనం బాగుండాలని ఆ శ్రీమహా విష్ణువుని కొలిచే పెద్ద వాళ్ళు మన అందరి ఇళ్లల్లో ఉంటారు వారి ఆరోగ్య కారణాలు లేదా ఇతర సమస్యల వల్ల బద్రీనాథ్ లాంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్లలేకపోవచ్చు ఇక్కడికి వారిని తీసుకువచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇలా మీరు చేస్తే వారి ఆనందానికి మీరు కారకలవుతారు…….




