Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ వేడి వేడి అన్నంలోనే కాదండి ఏ టిఫిన్ లో అయినా చాలా బాగుంటుంది అండ్ పెరుగన్నంలో కూడా నంచుకుని తినే అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు… ఉల్లిపాయ 3, ఎండు మిరపకాయలు(10,12), ధనియాలు 1 స్పూన్, మెంతులు 1/4 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినప గుళ్ళు (పెసరపప్పు)3 స్పూన్లు, టొమాటోలు, పచ్చిమిర్చి, నువ్వులు 1 స్పూన్, వెల్లుల్లి, అల్లం, చింతపండు, కరివేపాకు..

తయారీ విధానం… ముందుగా ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని ధనియాలు ఇంకా ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో ఇది కాస్త క్రిస్పీగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా మినప గుళ్ళు వేసుకోండి ఇలా మినప్పప్పు బదులు మీరు కావాలంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇవి కూడా కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి .

ఇలా ఇవన్నీ ట్రై అయిపోయిన తర్వాత ఇందులో 10 నుండి 12 దాకా ఎండు మిరపకాయలు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ చట్నీ చేసుకోండి లేదా మీకు నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు చేసుకున్న సరే చాలా బాగుంటుంది టొమాటోలు, పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ అవసరం లేదు కేవలం ఇంట్లో ఎప్పుడు ఉండే ఉల్లిపాయలు ఎండు మిరపకాయలతో చట్నీ చేసుకోవచ్చు చూశారు కదా

onion chutney in telugu
onion chutney in telugu

ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త ఇలా సాఫ్ట్ గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు కొన్ని వెల్లుల్లి రెక్కలు ఇంకా ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త సాఫ్ట్ గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది . ఇక ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకోండి ఈ వేడికి చింతపండు సాఫ్ట్ గా అయిపోతుంది పచ్చడి గ్రాండ్ చేసుకునే లోపు నేనైతే చింతపండు గుజ్జు ఉంది నా దగ్గర నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను ఆ చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను

చింతపండు అందుకనే ఇలా డైరెక్ట్ గా వేయలేదు. సో ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలు అన్నింటిని మిక్సీ జార్ లోకి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. తర్వాత నేను ఇందులో చింతపండు ఆడ్ చేసుకోలేదు కాబట్టి చింతపండు గుజ్జు వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకున్నాను ఇక మొత్తాన్ని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా ఇలా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది

ఇంకా ఇందులో వాటర్ లాంటివి ఏమీ ఆడ్ చేయనవసరం లేదు ఇందులో ఉన్న ప్రేమతోనే పచ్చడి అయితే గ్రైండ్ అయిపోతుంది చూశారు కదా ఫైనల్ గా మనకి ఉల్లిపాయ ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా దోశ చపాతీలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి కారంగా తినాలనిపిస్తే ఈ చట్నీ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఈ చట్నీ…

Read Also : Munagaku Kobbari Pachadi : మునగాకు కొబ్బరి పచ్చడి.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు.. అంత టేస్టీగా ఉంటుంది.. కంటిచూపుకు మంచిది!

Leave a Comment