Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, కొన్నిచిట్కాలు పాటిస్తే సుమారు 14 ఏళ్ల వరకు లైఫ్ స్పాన్ పెరుగుతుందని నిపుణులు తమ పరిశోధనల ద్వారా తేల్చారు. 45 నుంచి 79 సంవత్సరాల మధ్య వ్యక్తులు 20,244 మందిపై నిపుణులు పరిశోధనలు చేయగా ఈ విషయం వెల్లడైంది. వీరంతా ఎక్కువ కాలం జీవించడానికి బలమైన ఆహారం, వ్యాయామం, ప్రోటీన్ ఫుడ్ , పండ్లు, కూరగాయాలు వంటి ఆహారం తీసుకోవడమే కారణమని తేల్చారు.
మద్యపానం, ధూమపానం హానికరం..

తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే వారు 90 ఏళ్లు దాటి బతకలేరని స్పష్టంచేశారు. ప్రతీయేటా సుమారు 88వేల మంది అమెరికన్లు మద్యం సేవించడం వలన కలిగే వ్యాధుల బారిన పడి మరణిస్తున్నట్టు తెలిసింది. పొగాకు, గుట్కావంటివి తినడం వలన కూడా క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలి త్వరగానే చనిపోయే ప్రమాదం ఉందట..
ధూమపానం వలన దీర్ఘకాలిక వ్యాధులు బాధిస్తాయని నిపుణుల అధ్యయనంలో తేలింది. మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి రోగాలు రావడంతో ఆయుష్సు తగ్గుతుందని నిపుణులు హెచ్చరించారు. 40 ఏళ్ల లోపు వారు ధూమపానానికి దూరంగా ఉంటే తమ జీవితకాలాన్ని 90ఏళ్లకు పెంచుకోవచ్చును. ఎవరైనా సంతోషకరమైన జీవితం గడిపినా వారి జీవితకాలం పెరుగుతుందట.. అందుకు వారి లైఫ్‌లో ఒత్తిడి లేకుండా చూసుకోవాలని.. అందరితో కలిసిమెలిసి ఉండాలి.
బాధను షేర్ చేసుకోవాలి. డిప్రెషన్ దరిచేరకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. మాంసాహారం బదులు శాఖహారమే ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తే వందేళ్లు బతికే అవకాశం ఉంటుందని తెలిసింది. అదేవిధంగా తరచూ వ్యాయామం, రన్నింగ్ చేయాలి. యోగా లాంటివి చేస్తే ఇంకా మంచిది. ప్రతీరోజు 8 గంటలు నిద్రపోవాలి. ఉదయం త్వరగా నిద్రలేవాలి. సమయానుగుణంగా పనులు చేసే వ్యక్తులు చాలా కాలం బతికే అవకాశం ఉంటుంది.





