Varahi Devi Pooja Vidhanam in telugu : వారాహి అంటే.. భూదేవి. హిరణ్యక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్లినప్పుడు శ్రీ మహా విష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. రాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కనిపిస్తుంది. బారాహే అమ్మవారు అంటే.. ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మి స్వరూపం శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ద్రవ అనే నామం కనిపిస్తుంది. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. పంచమి, సమయ సంకేత, దండనాథా, వారాహీ, సంకేతా, పోత్రిణి, శివా, మహాసేన, వార్తాళి, అరిఘ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే 12 నామాలుగా పిలుస్తారు. ఈ 12 నామాలను ప్రతిరోజూ 11 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
వారాహి దేవి అమ్మవారి పూజా విధానం… ఎన్ని పూజలు పరిహారాలు చేసిన మీ కోరిక తీరడం లేదు అనుకునేవారు”3 అక్షరాల బీజ మంత్రాన్ని అనుకోని చూడండి పది నిమిషాల్లో తీరుతుంది లక్ష్మీ స్వరూపమైన వారాహి దేవి పై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించండి.. ఐమ్ క్లీమ్ సౌ (im kleem sow) అనే మంత్రాన్ని 11 సార్లు, 21సార్లు.. ఎన్నిసార్లైనా జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలిగిపోతుంది.
అమ్మవారికి శుక్రవారం అష్టమి తిధి కలిసి వచ్చిన రోజు 6గంటల నుంచి 10 గంటలు లోపు దీపం, ధూపం నైవేద్యం భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకొని 3 లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని 26 సార్లు అనుకోండి. మీరు ఏమి కోరుకుంటే వెంటనే తీరుతుంది..ఓం జగదాంభికేయన మః (om jagadhambhikeyana maha) ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ల కోరికలు నెరవేరుతాయి..
Varahi Devi Pooja Vidhanam : వారాహి దేవి 12 నామాలను పఠిస్తే.. లక్ష్మీ కటాక్షమే..
నర దిష్టి, చెడు దిష్టి, ఎదుటివారి శాపం వంటి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిధి పంచమి నాడు అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు.. శుక్ర గోరల్లో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు.. ఈ పరిహారం చేసినట్లయితే వెంటనే మీ సమస్యలు తీరుతాయి. తెల్ల ఆవాలు ఒక చిన్న ఏ రంగు క్లాత్ అయినా తీసుకొని ఆవాలు వేసుకొని మూట కట్టుకోవాలి ఇప్పుడు ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆవాల మూట అందులో పెట్టి మంచి నూనెతో దీపరాధన చేయాలి.
ఈ దీపరాధన ఇంటి బయట లేదా టెర్రస్ మీద చేసుకోవాలి. దీపం వెలిగే అంతసేపు అక్కడ కూర్చొని నీకు ఏ సంకల్పం అయితే ఉందో అది నెరవేరాలని కోరుకోవాలి. అన్ని కష్టాల నుండి విముక్తి పొందడానికి ఈ పరిహారం చేసుకోండి. ఆ తర్వాత ఆ ప్రమిదను పూజ మందిరంలో వాడకూడదు పరిహారాలు చేసేటప్పుడు అప్పుడు వాడుకోవచ్చు. తెల్ల ఆవాలను సాంబ్రాణి లో వేసి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది. పెద్ద పెద్ద యాగాలలో తెల్ల ఆవాలను వేస్తారు ఆ ఫలితం వస్తుంది.