Ravi Chettu Deepam : సిరి సంపదలతో తులతూగాలంటే ఇలా చెయ్యండి.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా.. ఎంత కష్టపడినా మీరు చేసిన దానికి ఫలితం కనిపించట్లేదా..? చాలామంది ఆర్థికపరంగా ఏది కలిసి రావడం లేదని మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అలాంటి వారు నమ్మకంతో ఈ పరిహారాన్ని చేేసుకుంటే భగవంతుడి అనుగ్రహంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. ఇప్పటివరకూ రానీ డబ్బులు చేతికి వస్తాయి. ఏదో ఒక రూపంలో డబ్బులు అందుతాయి. ఈ రెమిడీకి అంత మహిమ ఉంది. అసలు ఈ రెమిడీ ఏంటి? ఎలా ఆచారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవతా వృక్షాల్లో రావి చెట్టు ఎంతో శక్తివంతమైనది. ఈ రావిచెట్టుకు శనివారం లేదా బుధవారం రోజున సూర్యాస్తమయం తర్వాత అంటే.. చంద్రుడు వచ్చేముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యి, బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలు, ఒత్తులు, మట్టి ప్రమిదలను ఏడు తీసుకొని గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఉత్తర భాగంలో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. ఉత్తరం వైపు కూర్చుని తూర్పు ముఖంగా ఉండాలి. లేదా పడమర వైపైన తూర్పు ముఖంగా కూర్చోవాలి. కొన్ని నీళ్లు చల్లుకుని బియ్యం పిండితో పద్మం ముగ్గు వేసుకోవాలి.
ఇప్పుడు ఏడు ప్రమిదలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ప్రమిదలో పోసి రెండు ఒత్తులు ఒక వత్తిగా చేసి అగరబత్తులతో వెలిగించుకోవాలి. ఎప్పుడూ కూడా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఈ విషయంలో చాలామంది పొరపాటుగా చేస్తుంటారు. ఆ తర్వాత ప్రమిదలకు పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. దృఢ సంకల్పనతో మీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకోవాలి.

ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఈ మంత్రాన్ని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ జపించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. 5 లేదా 11 సార్లు ప్రదక్షణ చేయాలి. దీపం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఇలా చేస్తే.. మీ సమస్యలన్నీంటికి మంచి మార్గం కనిపిస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రెమిడీని చేయాలనుకునే వారు నమ్మకంతో, భక్తిశ్రద్ధలతో చేసుకోవాలి. రావి చెట్టు వేప చెట్టును లక్ష్మీనారాయణగా కొలుస్తూ ఉంటారు. ఆర్థిక, సంతానం, పితృ దోషాలు, ఆరోగ్యం, గ్రహదోషాలు, వివాహయోగం అన్ని సమస్యలకు ఈ పరిహారాన్ని చేస్తే మంచి ఫలితాలు వస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
మరో అద్భుతమైన రెమిడీ కూడా ఉంది. ఆసక్తి ఉన్న వాళ్లు ఈ రెమిడీ కూడా చేసుకోవచ్చు. గుడిలో ఉన్న రావి, వేప చెట్టుకి తెల్లటి దారం తీసుకొని పసుపు రాస్తూ 3, 11, 21 లైన్లో చొప్పున రావి, వేప చెట్టుకు చుట్టి మన మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోవాలి. శ్రీరామ జయరామ జయ జయ రామ, ఓం నమో నారాయణాయ మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ తాడును చుట్టి ముడి కట్టాలి. రావి ఆకుపై మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి. రావి, వేప చెట్టుకు పూజలు, నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు మీరు మనస్సులో కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పనిసరిగా ఆచరించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. కుటుంబంతో సుఖశాంతులతో జీవించండి.
Read Also : Peepul Tree : ఇంట్లో రావి చెట్టును అస్సలు పెంచకూడదట.. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!