Tholi Ekadasi 2023 : ఆషాడమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. హిందువుల జరుపుకునే మొట్టమొదటి పండుగ సంవత్సరంలో ఉండే 24 ఏకాదశుల్లో ఈ ఆషాడ శుక్ల ఏకాదశి మొదటిది. అందుకే దీనిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఆషాడ శుక్ల ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారట. అలా స్వామి వారు నిద్రించే రోజు దీనిని శయన ఏకాదశి అని తొలి ఏకాదశి అని పిలుస్తారు. అంతేకాకుండా ఏకాదశిని పద్మ ఏకాదశి అని దేవసేన ఏకాదశి అని పేలాల పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఇంత విశేషమైన ఈ తొలి ఏకాదశి పర్వదినం 2023లో ఎప్పుడూ ఏ తేదీన వచ్చింది.
అలాగే ఏకాదశి తిథి ఇప్పటినుంచి ఇప్పటివరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి తిథి చూసుకున్నట్లయితే.. జూన్ 28వ తేదీ బుధవారం రాత్రి 10 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై.. జూన్ 29వ తేదీ గురువారం రాత్రి 10:43 నిమిషాల వరకు ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం.. ఏ పండుగనైనా సరే సూర్యోదయంతో ఈ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ పండుగను మనం పరిగణిస్తాం. మనకు జూన్ 29వ తేదీ గురువారం సూర్యోదయంతో ఏకాదశి తిధి ఉంది. జూన్ 29వ తేదీ గురువారం రోజునే తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటాం. ఈరోజు నిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు 4 నెలల పాటు నిర్జించి ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటారట. ఈ 4 నెలలని చాతుర్మాసంగా వ్యవహరిస్తారు.
Tholi Ekadasi 2023 : తొలి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది? ఏ నియమాలు పాటించాలి?
ఈరోజు నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామి వారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణ గాధ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు పూజలు వ్రతాలు ఆచరించాలని నిర్దేశించారు. అసలు ఏకాదశి అంటే ఏంటి.. ఈ తితికి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

కృతయుగంలో మరాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీమహావిష్ణువు అతనితో వీళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసున్ని అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణు ప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటుందంట. అప్పటినుంచి ఈ తిధి ఏకాదశి స్థితిగా వ్యవహారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీష్యుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. మరి ఈ ఏకాదశి నాడు ఏం చేయాలి? ఏకాదశినాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి.
రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతం చదువుకోవడం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మరునాడు అంటే ద్వాదశి రోజున దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్ష విరమించాలి ఈరోజున ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మరి ఈరోజున విష్ణుమూర్తికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటే విష్ణుమూర్తికి తప్పనిసరిగా పేలాల పిండిని సమర్పించాలి. ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈరోజు దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచి పెడతారు. తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ఎందుకు తినాలి అనేది తెలియాలంటే ఈ కింది వార్త లింక్ చదవండి..
Read Also : Tholi Ekadasi : ఆషాడంలో తొలిఏకాదశి రోజున పేలాల పిండి ఎందుకు తింటారో తెలుసా..? ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?