Tholi Ekadasi : తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తినడంలో అసలు అంతరార్థం ఏంటి? ఆశాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనిని సైనా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ నాలుగు నెలలు శ్రీమన్నారాయణనుడు సయనిస్తారని, లోక కళ్యాణార్ధము ఋషులు, స్వామీజీలు చాతుర్మోస దీక్షను ప్రారంభిస్తారని చెప్తారు. ఈ రోజున అన్ని దేవాలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు. పేలాలను బెల్లపు పొడి, యాలకుల పొడిని వేసి దంచి ఈ పేలాల పొడిని తయారు చేస్తారు. కనుక సహజంగా ఏర్పడే శారీరక రుగ్మతలను ఈ పేలల పిండి తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
ఈరోజు పేలాల పిండిని మన పితృదేవతలను స్మరించుకుంటూ తీసుకోవడం వల్ల వారు సంతుష్టలై మనని కాపాడుతారని పెద్దలు చెప్తారు. అన్ని ఏకాదశిలోకి తొలి ఏకాదశి ఉత్తమ ఉత్తమమైనదిగా చెబుతారు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కూడా. స్వామి అలంకార ప్రియుడు కనుక మహా విష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి ‘శాంతాకారం భుజగశయనం పద్మనాభం‘ అంటూ మహావిష్ణువుని పూజిస్తారు. ఈ ఏకాదశి తొలి ఏకాదశి ఆషాడమాసాన వస్తుంది. అందుకే ఈ ఏకాదశి అంతటి ప్రత్యేకత ఉంది.
ఈరోజు క్షీరాబ్ధిలో మహావిష్ణువు సయనిస్తాడు. ఈ ఏకాదశిని సైనికాదశి అని పిలుస్తారు. స్వామి యోగనిద్దాం ఉపక్రమిస్తాడని జనులందరూ జనార్ధన్ కోసం కటికోపాశం చేస్తారు. అందుకే ఈ ఏకాదశిని నిర్జలయికాదశిని అని కూడా అంటారు. అలానే హరి దగ్గరే వాసం చేస్తారని హరివాసరం అని సైనైకాదశిని కూడా పిలుస్తారు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు నేటి నుంచి దక్షిణం వైపుకు వాలినట్టుగా కనిపిస్తాడు. అందుకే, ప్రత్యక్ష నారాయణగా తలచే సూర్యుడు నేటి నుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి సైనికాదర్శిని పిలవడానికి కారణంగా చెప్తారు. సైనేకాదశి ఉపవాస వివరాలను భవిష్యత్తుల పురాణం చెప్తోంది.
Tholi Ekadasi : తొలిఏకాదశి రోజున పేలాల పిండి తినకపోతే ఏమౌతుందో తెలుసా?
ఏకాదశి వ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం కూడా చెప్తుంది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్నదానానికి అనంత కోటి పుణ్యఫలాలు వస్తాయని చెప్తారు. శ్రీకృష్ణ అవతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకొని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో శ్రీమహావిష్ణువును సోపాయ మానంగా అలంకరించి 11 వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలని చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేస్తుంటారు. శ్రీవారికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు.
ప్రతి వైష్ణవాలయంలోనూ స్వామికి పవళింపు సేవొత్సవం కూడా జరుపుతారు. గోముఖ భాగమందు వేదాలు, కొమ్ములందు హరిహరులు నేత్రాలతో సూర్యచంద్రులు జిహ్వనందు సరస్వతి పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి, అరుపులో ప్రజాపతి ఇలా గోదేహిమంత సర్వదేవతలు సర్వ తీర్థాలు, సర్వ దేవత నివాస స్థానమైన గోవులను కూడా ఈ ఏకాదశి రోజున పూజిస్తారు. అధర్వణ వేదం బ్రహ్మాండా పద్మపురాణం మహాభారతం కూడా గో విశిష్టతను తెలుపుతాయి. గోశాలలను శుభ్రం చేసి ముత్యాలముగ్గులు తీర్చి మధ్యలో 33 పద్మాల ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోత్తంగా పూజ చేస్తారు. పద్మానికి ఒక అప్పడం చొప్పున వాయినాలు, దక్షిణ తాంబూలాలను అర్పిస్తారు. మహావిష్ణువు అత్యంత ప్రేమ పాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గు వేసి దీపం వెలిగించి వివిధ రకాల పండ్లను నివేదిస్తారు.
ఏకాదశి వ్రతాన్ని రుక్మంగదుడు అంబరీష్యుడు కూడా పాటించారు. వాళ్లు పాటించడమే కాదు.. వారి రాజ్యాల్లోని జనులందరి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశి వ్రతం చేసేవారికి ఎల్లప్పుడు మహావిష్ణువు తోడు నీడగా ఉంటాడు. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని చెబుతారు. పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలను జరుపుతారు. బంధుమిత్రులందరూ కలిసి సాయంత్రం పూట సామూహిక విష్ణు సహస్రనామావళిని పాటిస్తారు. హరి భజన చేస్తారు.
చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు నుంచే ఉంటుందని బ్రహ్మ వైవర్తన పురాణం వివరిస్తుంది. ఈ రోజున పిప్పళ్ళ వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం కూడా మంచిదని చెప్తున్నారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు.. నిమ్మ పండు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరకు గడ్డలు వర్తించాలని అంటారు. శ్రీమహావిష్ణువు 4 నెలల పాటు క్షీరసముద్రంలో శేష శయనంపై పవిస్తాడని ఎతులు, సన్యాసులు, శ్రీమహావిష్ణువు కీర్తించడంలో తమ జీవిత కాలాన్ని వెచ్చిస్తుంటారు. దేశసంచాలైన యువతను ఈ నాలుగు నెలలు ఒక్కచోటనే ఉండి విష్ణు కీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు..