Ashada Masam 2023 Telugu : ఆషాడ మాసం ఎప్పుడు వస్తుంది. అలాగే, ఆషాడ ప్రారంభ ముగింపు తేదీలు ఏంటి? ఈ మాసం ప్రత్యేకత, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, శుభకార్యాలు ఎందుకు జరుపుకోరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మాసంలో చంద్రుడు పూర్వాషాడ లేదా ఉత్తరాషాఢ నక్షత్రానికి సమీపంలో ఉండడం వల్ల ఈ మాసానికి ఆషాడ మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు జరుపుకోరు. కాబట్టి, ఈ ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. కానీ, ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాడ సుంద ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథిని తొలి ఏకాదశి అని కూడా అంటారు.
ఇకనుంచి ఇక ప్రతి వారానికి ప్రతి 15 రోజులకు ఒకసారి అయినా ఏదో ఒక పండుగ వ్రతం పూజ ఉంటుంది. ఈ మాసంలో ఆడవారు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకుంటారు. ఈ 2023వ సంవత్సరంలో ఆషాడమాసం ఎప్పటినుండేప్పటి వరకు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2023వ సంవత్సరంలో ఆషాడ మాసం జూన్ 19 సోమవారం శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమై జూలై 17 సోమవారం రాత్రి 12 గంటల ఒక నిమిషంతో అమావాస్యతో ముగుస్తుంది. ఈ ఆషాడంలో జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన అనగా బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి బోనాలు మొదలయ్యేది ఈ ఆషాడంలోనే. ఈ బోనాలు జూన్ 25 ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Ashada Masam 2023 Telugu : ఆషాడ మాసం ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?..
శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశి అంటారు. దీనినే శుద్ధ ఏకాదశి మహా ఏకాదశి అని ప్రథమేకాదశి అని కూడా అంటారు. ఈ 2023వ సంవత్సరంలో తొలి ఏకాదశి జూన్ 29 గురువారం రోజు వచ్చింది. ఈ మాసంలో గురువులను పెద్దలను పూజించే వ్యాస పూర్ణిమ.. దీన్నే గురుపూర్ణిమా అని కూడా అంటారు. ఈ 2023లో గురుపూర్ణిమ జులై 33 సోమవారం రోజు వచ్చింది. చంకటాలను విఘ్నాలను తొలగించేటువంటి వినాయకుడిని పూజించే సంకటహర చతుర్థి జూలై 6 గురువారం రోజు వచ్చింది. ఆషాడం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది.
వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రకృతికి కొత్త జీవం పోసి రైతులు వరి దాన్యం పండిస్తారు. ఆషాడ మాసం ప్రధాన విశిష్టత ఈ ఆషాడ మాసం అశుభకరమైన మాసం అని నమ్ముతారు. వివాహాలు గృహప్రవేశం వంటి పవిత్రమైన సందర్భాలు నిర్వహించరాదు. ఈ మాసంలో దానం, ధాన్యం రెండు ముఖ్య మైనవి. ఉప్పు రాగి కంచు మట్టి పాత్రలు, గోధుమలు, బెల్లం బియ్యం నువ్వులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాడం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలులతో జడివానలు కురిసే సమయం ఈ ఆషాడమే.
వ్యవసాయ ఆధారిత దేశం.. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసంలో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి, ఈ మాసం మొత్తం శూన్యమాసంగా పరిగణిస్తారు. మన పెద్దలు జగజ్జనని సకలజీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఈ ఆషాడంలోనే. ఈ మాసంలో శాఖ మరీ నవరాత్రులు కూడా చేస్తారు. ఈ మాసంలో ఇంద్రియని గ్రహంతో ఆహార విహారాలలో తగినన్న జాగ్రత్తలు తీసుకుంటూ జీవితాన్ని గడపడం కోసం పూజలు వ్రతాలతో నవ దంపతులకు ఆషాడ నియమం పాటించమని చెబుతారు. ఈ మాసంలో దంపతులు ఇద్దరు కలవకూడదని ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.