Tholi Ekadasi 2023 : ఈ ఏడాదిలో హిందువుల మొట్టమొదటి పండుగ అయినటువంటి తొలి ఏకాదశి వచ్చేసింది. అదే జూన్ 28న లేక జూన్ 29 వరకు ఉంటుంది. ఏకాదశి ఎప్పటినుండి ఎప్పటి వరకు ఉంటుంది. అలాగే తొలి ఏకాదశి విశిష్టత ఏంటి? ఈరోజు తప్పక సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి? హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ఈ పండుగ తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. దీన్ని చేనేకాదశి హరివాన రే ఏకాదశి అని అలాగే పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఆషాడమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు. 24వ తేదీన ఏకాదశి వస్తుంది.
వీటిలో ఆషాడశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో శేషతలపంపై 4 నెలల పాటు షెనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున ఆయన తిరిగి మేలుకొంటాడు. ఈ 4 నెలలని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామి వారు పాదాలలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాధ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

ఈ 2023వ సంవత్సరంలో ఆషాడమాసంలో వచ్చేటువంటి ఏకాదశి తిధి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2023వ సంవత్సరంలో ఆషాడమాసంలో వచ్చేటువంటి ఏకాదశి స్థితి జూన్ 28 బుధవారం రోజు రాత్రి 10 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై జూన్ 29 గురువారం రాత్రి 10 గంటల 43 నిమిషములకు ముగుస్తుంది సూర్యోదయానికి ఏ తేదీ అయితే ఉంటుందో ఆరోజు అతిథిగా పరిగణిస్తాం. ఈ 2023వ సంవత్సరంలో తొలి ఏకాదశి జూన్ 29 గురువారం రోజు జరుపుకొనున్నాం.
Tholi Ekadasi 2023 : ఈ నెల 29 నుంచి చాతుర్మాస్యం.. ఆ రోజుల్లో ఏం చేయాలంటే..?
ఉత్తరాయణం కంటే.. దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు అనేక రకాల పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే.. తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకు మేలు చేస్తుంది. తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాస జాగరణలు చాలా విశిష్టమైనవి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి.
తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ప్రారంభించిన వారు వరుసటి రోజు అయిన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపాస దీక్షను వివరించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు. తప్పక సమర్పించాల్సిన నైవేద్యం పేలాల పిండి. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. వేళాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవిసున్న తర్వాత వర్షాలతో ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈరోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది.