Somvati Amavasya : అమావాస్య సోమవారంతో కలిసి వస్తే సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైన రోజుగా చెబుతారు పండితులు. సోమవతి అమావాస్య రోజు శివాభిషేకం చేసినా, శివాలయంలో ప్రదక్షిణలు చేసినా శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు.. సోమవతి అమావాస్య గురించి పురాణాలలో చెప్పారు. నవగ్రహాలలో చంద్రుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒంటినిండా దెబ్బలతో తీవ్రమైన అనారోగ్యంతో చంద్రుడు బాధపడుతుండగా.. సోమవతి అమావాస్య రోజు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకున్నాడు.
దానివల్ల తనకు ఉన్నటువంటి గాయాలు దెబ్బల నుంచి బయటపడ్డాడని ఆరోగ్య ప్రాప్తిని పొందాడని పురాణాలలో ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవతి అమావాస్య సందర్భంగా శివా భిషేకం చేసుకోవాలి. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఈ సోమవతి అమావాస్య విశిష్టతను పరిశీలిస్తే.. సోమవతి అమావాస్య రోజు రెండు కాకులు తెలియకుండా శివుడి చుట్టూ తిరగటం వల్ల తర్వాతి జన్మలో ప్రమత గణాలలో స్థానాన్ని సంపాదించాయట. ఒక నల్ల చీమ తెలియకుండా సోమవతి అమావాస్య రోజు శివలింగం పైన చుట్టూ తిరగటం వల్ల తర్వాతి జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించింది.
అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంది. శివాలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే.. విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. దేవీ భాగవతంలో శివుడు పార్వతికి ఏం చెప్పాడంటే.. సోమవతి అమావాస్య నాకెంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆరోజు విష్ణువుని పూజిస్తే.. నేను ఎంతో ఆనందిస్తానని పరమేశ్వరుడి స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు.
విష్ణుమూర్తి రావి చెట్టు రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. రావి చెట్టు దగ్గరకు వెళ్లి పూజ చేసినా.. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసిన శ్రీమన్నారాయణ అనుగ్రహంతో పాటుగా శివానుగ్రహాన్ని పొందవచ్చు. సోమవతి అమావాస్య సందర్భంగా నందీశ్వరుడు మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకమైన వ్రతం చేశాడు. దాన్నే అమాసోమవార వ్రతం అంటారు. అమ్మా సోమవారం వ్రతం అంటే.. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం అని అర్థం. ఎవరైనా సరే మహిళా దీర్ఘసుమంగళీ తత్వం కలగాలంటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలంటే.. రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయాలి.
Somvati Amavasya : సోమవతి అమావాస్య విశిష్టత ఏంటి?
ఒక్కొక్క ప్రదక్షిణ చేసే సమయంలో ఒక్కొక్క ఎండు ఖర్జూరాన్ని రావి చెట్టు దగ్గర ఉంచాలి. 108 ప్రదక్షిణలు పూర్తికాగానే ఆ ఎండు ఖర్జూరాలు ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా చేయడం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను పొందవచ్చు. అమావాస్య సందర్భంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకోవాలి. ‘అశ్వద్ధాయ వారే న్యాయ సర్వైస్వర్య ప్రదాయిని అంతతః శివరూపాయ వృక్షరాజాయతే నమః’ ఈ శ్లోకం చదువుకుంటూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి.
ఎవరైతే రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తారో వాళ్లకి సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి వస్తుంది. వాళ్ల కుటుంబాల్లో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత పావురాలకు గింజలను ఆహారంగా వేయటం ద్వారా సూర్యుని ధ్యానం చేసుకోవడం ద్వారా సంతానం లేని వాళ్ళకి సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చు. అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్య ఉంది. సోమవతి అమావాస్య సందర్భంగా శివాభిషేకం చేసుకొని అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవచ్చు. శివుని ఆలయంలో ప్రదక్షిణలు చేసి తర్వాతి జన్మలో అద్భుతమైన జన్మను పొందవచ్చు. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.