Remedies For Shukra Graha : మీ జాతకంలో శుక్రుడు బలంగా లేడా? శుక్ర దోషంతో బాధపడుతున్నారా? అయితే, ఈ పవర్ ఫుల్ రెమిడీ ట్రై చేయండి.. అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మీ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి సకల శుభాలు అందిపుచ్చుకోవచ్చు. లవంగాలకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో లవంగాలకు అద్భుతమైన శక్తి ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే.. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు 2 లవంగాలు నోట్లో వేసుకుని వెళ్ళండి. మీ పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే, 2 లవంగాలు జేబులో పెట్టుకొని పని మీద బయటకు వెళ్ళటం ద్వారా కూడా అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది.
లవంగాలు అనేది నవగ్రహాలలో కుజగ్రహానికి సంకేతం.. కుజుడి విశేషమైనటువంటి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు. లవంగాల మీద శుక్రుడి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. శుక్రుడి విశేషమైన అనుగ్రహం పొందాలంటే.. లవంగాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. లవంగాలు రెండు మీ జేబులో ఉంచుకొని వెళ్లండి. అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం రోజు ఎవరైనా సరే 5 లవంగాలు తీసుకోండి. అలాగే 5 గవ్వలు తీసుకోండి. ఈ 5 లవంగాలు, 5 గవ్వలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మూటను మీ బీరువాలో దాచి పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. వృథా ఖర్చుల తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు.
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవికి పూజ చేసే వాళ్ళు ఎవరైనా గులాబీ పూలతో పూజ చేసుకోవాలి. 2 లవంగాలను గులాబీ పూలతో పాటు ఉంచి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ నామాలు చదువుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. శత్రుభాధల తీవ్రతను తగ్గించుకోవచ్చు. అష్టలక్ష్మి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపంలో 2 లవంగాలు వేసుకోవాలి. శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపులు కనుదిష్టి వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు.
Remedies For Shukra Graha : మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలంటే..
ఇంకా.. మీకు వీలైతే మంగళవారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో ఆవాల నూనె పోసి దీపం పెట్టాలి. ఆ దీపంలో 2 లవంగాలు వేయండి. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే తొందరగా శత్రు నాశనం జరుగుతుంది. అలాగే కనుదిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవాలంటే పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు 2 లవంగాలు ఇంట్లో కాల్చండి. 2 లవంగాలు కాల్చి ఆ తర్వాత మీరు నిద్రపోండి. దాంతో మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు.
జాతక దోషాలను నివారించుకోవడానికి లవంగాల దానం చేయొచ్చు. మీకు వీలైతే శనివారం రోజు 9 లవంగాలు మీ చేత్తో ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానం ఇవ్వటం వీలుకాకపోతే.. అంటే ఎవరూ కూడా లవంగాలను దానం తీసుకోకపోతే.. మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయ ప్రాంగణంలో శివలింగం దగ్గర ఆ లవంగాలు ఉంచి నమస్కారం చేసుకోండి. దాంతో గ్రహదోష తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఇలా లవంగాల శక్తివంతమైన పరిహారాలను తప్పకుండా పాటించి మీ జీవితంలోని అన్ని సమస్యల నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు.