Horoscope 2023 : కుంభరాశి ఫలాలు నవంబర్ 2023

Horoscope 2023 : నవంబర్ నెలలో మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నేల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి కుంభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో గ్రహాల సంచారం మొత్తం అనుకూలంగా ఉంది అందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార రంగంలో ఉంటే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి.

వ్యాపారం మూడు పువ్వుల ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ ఉంటుంది కావలసిన స్కూళ్లల్లో కావలసిన కాలేజీలో ర్యాంకులు ఇచ్చే యోగం నవంబర్ నెలలో కనిపిస్తోంది అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేకమార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు నవంబర్ నెలలో కుంభరాశి వాళ్లకు అనుకూలిస్తాయి ఆరోగ్య సహకారం ఆరోగ్య లాభం ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలని తగ్గిపోతాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది

సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తే కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతే కుటుంబంలో సభ్యులందరూ అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు

Kumbha Rasi Phalalu November Month Horoscope 2023 in telugu
Kumbha Rasi Phalalu November Month Horoscope 2023 in telugu

సంఘంలో పేరు ప్రతిష్టలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్లు అధికారులను కలుసుకుంటారు వాళ్ల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుక్కునే యోగం కూడా ఉంది ఉద్యోగులు అయితే ఇల్లు గాని ప్లాట్లు గాని కొనుక్కునే యోగం కూడా ఉంది భార్యాభర్తల మధ్య పూర్తి అవగాహన ఉంటుంది జీవన సౌఖ్యం ఉంటుంది ప్రయాణాలపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూర్తాయి ఎప్పుడు ధనలాభం కలుగుతూనే ఉంటుంది

మొత్తం మీద పరిశీలిస్తే కుంభ రాశి వారికి నవంబర్ నెల మొత్తం పట్టిందల్లా బంగారలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు నాలుగు, ఆరు పద్నాలుగు 16 17 21 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి ఈ నెల మీకు కలిసి రాని తేదీలు 2 9 11 19 23 27 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి అలాగే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఈ ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింప చేసుకోవడానికి ఈ నెలలో వీలైనప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయస్వామి ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళుతూ ఉండండి ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా హనుమాన్ల స్తోత్రాన్ని వినటం లేదా చదవటం ద్వారా కుంభరాశి వాళ్లు నవంబర్ నెలలో ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింప చేసుకోవచ్చుఅఖండ రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు

Read Also : Lord Shiva Pooja : ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయొచ్చా? ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Leave a Comment