Shukra Graha Dosha Remedies : మీ జాతకంలో శుక్రంగా బలంగా ఉన్నాడా? లేదా బలహీనంగా ఉన్నాడా? ఒకవేళ శుక్రుడు (shukra graha remedies) బలంగా ఉంటే మాత్రం మీకు ఎదురు ఉండదు.. అన్నింట్లో విజయాలే.. ఆర్థికంగా ఎదుగుతారు.. అనుకున్న పనులన్నీ నేరవేరుతాయి. కోట్లు సంపాదిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృతి, ఉద్యోగం, వ్యాపార పరంగా అన్నింటా కలిసివస్తాయి.
అంతగా (Shukra Puja) అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు శుక్రడు. అదే మీ జాతకంలో శుక్రడు (weak shukra graha) గానీ బలహీనంగా ఉంటే మాత్రం.. ఎన్ని లాభాలు ఇచ్చాడో శుక్రుడు.. అంతకంటే దురదృష్టాన్ని కలిగిస్తాడు. మీ జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తాడు. ముఖ్యంగా డబ్బు పరంగా అనేక సమస్యలు వస్తాయి. మీ జీవితంతో పాటు కుటుంబంలో కూడా కలతలు వస్తాయి.
శుక్రుడు బలహీనపడితే మీ జీవితం ఒక్కసారిగా దుర్భరంగా మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడి (Planet Venus) మహార్దశ గురించి అనేక విషయాలను అందించారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే.. కలతలు లేకుండా జీవనం కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శుక్ర దశ బాగుంటే.. ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుంది. సొంత ఇల్లు కల నెరవేరుతుంది. ఆఫీసులో మీరే బాస్ అన్న స్థాయికి ఎదిగిపోతారు. ప్రమోషన్లు వస్తాయి. మంచి ఉన్నతస్థానానికి చేరుకుంటారు.

ఒక్కమాటలో చెప్పాలంటే మీరే రాజు.. మీరే మంత్రి అన్నట్టుగా ఉంటారు. మీ జాతక చక్రంలో ఏదైనా కారణం చేత శుక్ర గ్రహం బలహీనపడితే అనేక ఇబ్బందులు తప్పవని గమనించాలి. ప్రధానంగా కళ్ల సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మ సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయి. అలాంటి శుక్రుడు మీ జాతకంలో అసలు బలహీన పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.
ఇంతకీ శుక్రుడిని జాతకంలో ఎప్పుడూ బలంగా ఉండేలా చేసుకోలేమా? అంటే జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు ( Shukra Graha Dosha Remedies in telugu) ఉన్నాయి. ఈ పరిహారాలను ప్రతినిత్యం భక్తి శ్రద్ధాలతో పాటిస్తే కొద్దిరోజుల్లోనే మీ జాతకంలో శుక్రుడు బలంగా మారుతాడు. ఫలితంగా మీ జీవితం ఆర్థికంగా ఆనందంగా వర్ధిల్లుతుంది.
Shukra Graha Dosha Remedies : జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలంటే..
మీ జీవితాంతం శుక్రుడు బలంగా ఉండాలంటే.. మీరు చేయాల్సిందిల్లా.. ఒక్కటే.. ప్రతి శుక్రవారం రోజున రాత్రి పూట (Shukra Mantra Remedies) మంత్రాలను జపించాలి.. అదేంటి.. మంత్రాలను జపిస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడా? అంటే తప్పకుండా శుక్ర గ్రహం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు జపించాల్సిన రెండు మంత్రాలు ఇవే..
‘ఓం క్లీం శుక్రాయ నమః’
‘ఓం డ్రమ్ డ్రీం డ్రమ్ షా శుక్రాయ నమః’
ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఈ మంత్రాలను జపించాలి. కొన్ని శుక్రవారాలు క్రమం తప్పకుండా ఇలా మంత్రాలను జపిస్తుంటే.. క్రమంగా మీ జాతకంలో శుక్రుడు బలంగా మారుతాడట.. అంతేకాదు.. అనేక సత్ఫలితాలను కూడా పొందవచ్చు. శుక్రుని బలంగా ఉంటే జీవితంలో అంతా సక్సెస్ అన్నట్టుగా ఉంటుంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది.. శుక్రుడు బలంగా ఉండేందుకు ప్రతిరోజూ ఈ మంత్రాలను జపించడమే చేయాల్సి ఉంది. ఆ తర్వాత శుక్రుడు అనుగ్రహాన్ని పొందితే మీ జీవితంలో అంత మంచే జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Read Also : Death Person Clothes : చనిపోయిన వ్యక్తి బట్టలు మనం ధరించకూడదా? వారి వస్తువులు వాడితే ఏమవుతుందో తెలుసా?