Death Person Clothes : చనిపోయిన వారి బట్టలను ఎందుకు ధరించకూడదు? అసలు ఆచారాలు, సంప్రదాయాల్లో ఏముంది? ఒక మనిషి మరణానంతరం (Death Person Clothes) ఆచారాలు, సంప్రదాయాలను ఎందుకు పాటించాలి? ఇలాంటి అనేక ధర్మసందేహాలు చాలామందిలో ఉంటాయి. కానీ, వీటిని సరైన సమాధానం ఎవరో చెబితే కానీ తెలియకపోవచ్చు. కొంతమందిలో ఇలాంటి నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఉంటాయి. చనిపోయిన వారి బట్టలు (dead person clothes) ధరించకూడదని, అలాగే, వారి వస్తువులను వాడినా లేదా వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదని అంటారు. ఎందుకు ఇలా అంటున్నారు? చనిపోయిన వ్యక్తి బట్టలు (clothes of dead person), వస్తువులను ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది? ఇలాంటి సందేహాలకు సమాధానాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆత్మకు చావు లేదు.. కేవలం తనువుకు మాత్రమే చావు ఉందని విశ్వసిస్తుంటారు. ఒక మనిషి మరణించాక.. మళ్లీ ఏదో ఒక జన్మ ఎత్తుతారని అంటారు. చాలా మంది పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు. మరణించిన వ్యక్తి ఆత్మ మరో శరీరంలో పునర్జన్మ పొందుతుందని అంటారు. అందుకే చాలా విశ్వాసాల్లో ఎవరైనా మరణిస్తే.. అనేక ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తారు. మరికొంతమందికి అనేక నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదని అంటుంటారు. అంతేకాదు.. మరణించిన వారి వస్తువులను ఇంట్లో ఉంచకూడదని చెబుతుంటారు.
Death Person Clothes : ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమి విసిరేయాలి :
పూర్వకాలంలో మన పెద్దవాళ్లు అన్ని మంచికే చెప్పారు. మరణించిన వ్యక్తి వస్తువులను దానం చేయాలని అన్నారు. ఎందుకంటే.. చనిపోయిన వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని వదులుకోవాలని మనస్సుకు తెలియజేయడమేనట.. అసలు ఉద్దేశం ఏంటంటే.. చనిపోయిన వ్యక్తి లేకుండా జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వారితో మన జీవిత ప్రయాణం ఇప్పటితో ముగిసింది అనమాట.. మరణించిన వ్యక్తి ఆత్మ మనల్ని మరచిపోతుంది.. మరో పునర్జన్మకు వెళ్తుతుందని విశ్వసిస్తుంటారు. లేదంటే వారి ఆత్మకు శాంతి చేకూరదని, మనల్ని మరిచిపోరని మరికొంతమంది విశ్వసిస్తుంటారు.

అందుకే.. చనిపోయిన వ్యక్తి బట్టలను ధరించకూడదని అంటుంటారు. ఇందులో సైన్స పరంగా చూస్తే.. చనిపోయిన వ్యక్తి బట్టలను తరచూ ధరించడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. వారి బట్టలను ధరించినప్పుడల్లా ఎలా చనిపోయారు? వంటి అనేక ఘటనలు గుర్తుకు వస్తాయి. మరణించిన వారి బట్టలను ధరించకపోవడమే మంచిదని జ్యోతిష్యంలో ఇదే చెప్పడం జరిగింది. జ్యోతిష్యం ప్రకారం.. మరణించిన వ్యక్తి బట్టలను దానం చేయాలంటారు.
ఎందుకంటే ఇలా దుస్తులను దానం చేస్తే.. మరణించిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని విశ్వసిస్తుంటారు. దాతలకు చనిపోయిన వారి దీవెనలు కూడా అందుతాయట.. అమితంగా ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు.. వారి ధరించే బట్టలను ఇతరులకు దానం చేయడం అనేది వారిని గౌరవించినట్టే.. ఒక మంచి పనిచేసినట్టుగా జ్యోతిష్యం చెబుతోంది.