Shanidev : శనివారం శని దోష నివారణకు అనుకూలమైన రోజు జ్యోతిష్య శాస్త్రపరంగా జాతక చక్రంలో 12 స్థానాలలో శని భగవానుడు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరిగింది ఒక్కొక్క స్థానంలో శని భగవాను ఉండటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని అందిపుచ్చుకోవచ్చు ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో మొత్తం 12 స్థానాలు ఉంటాయి. 12 గడులు ఉంటాయి. వాటిలో మొట్టమొదటి స్థానాన్ని లగ్నము అంటారు ఈ మొట్టమొదటి స్థానం మొట్టమొదటి గడి లగ్నంలో జాతకంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఆ జాతకులకి వివాహ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆ శని దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి విభేదాభిప్రాయాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్య నుంచి బయట పడాలంటే జాతక చక్రంలో లగ్నంలో శని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట గోమాతకి తెల్ల నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి ఇలా చేస్తే లగ్నములో శని ఉండటం వల్ల ఏర్పడే వివాహపరమైన దాంపత్య పరమైన సమస్యలు తొలగింప చేసుకోవచ్చు జాతకంలో లగ్నంలో శని ఉన్నప్పుడు వివాహం జరగటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల గొడవలు ఇవన్నీ తొలగింప చేసుకోవడానికి ఈ శక్తివంతమైన పరిహారం పాటించాలి.
అలాగే జాతక చక్రంలో మొట్టమొదటి స్థానం మొట్టమొదటి గడి లగ్నము నుంచి సవ్య దిశలో క్లాక్ వైస్ డైరెక్షన్లో లెక్కపెట్టినప్పుడొచ్చే రెండవ స్థానము రెండవ గడిలో శని ఉన్నప్పుడు పుట్టిన ప్రాంతానికి దూరంగా వెళ్లి జీవనాన్ని కొనసాగించవలసి వస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగింప చేసుకోవటానికి కుటుంబానికి దగ్గరగా ఉండటానికి జాతక చక్రంలో రెండవ స్థానములో రెండవ గడిలో శని ఉన్నవాళ్లు శనివారం పూట నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచిపెట్టాలి జాతక చక్రంలో లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు
రెండవ స్థానంలో రెండవ గడిలో శని ఉండ టం వల్ల ఏర్పడే ఘనపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు ఆ తర్వాత జాతక చక్రంలో లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు మూడవ స్థానంలో మూడవ గదిలో శని ఉన్నట్లయితే సోదరుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి అప్పుడు సోదరులతో అన్యోన్యత పెంపొందింప చేసుకోవటానికి శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్లి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి. అప్పుడు సోదరుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి.
అలాగే జాతక చక్రంలో లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు నాలుగవ స్థానం నాలుగవ గడిలో శని ఉన్నట్లయితే దీన్ని చతుర్ధ శని దోషం అనే పేరుతో పిలుస్తారు ఈ చతుర్ధ శని దోషం ఉన్నప్పుడు ఇల్లు కొనటం ఆలస్యం అవుతుంది. భూములు కొనటం ఆలస్యం అవుతుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. భూములపరంగా గృహాల పరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు తొలగింప చేసుకోవాలంటే శనివారం పూట జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదల నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.

అలాగే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో లగ్నం నుంచి సవ్య దిశలో క్లాక్ వైస్ డైరెక్షన్లో లెక్కపెట్టినప్పుడొచ్చే 5వ స్థానం ఐదవ గదిలో సేను ఉంటే దాన్ని సంతాన శని దోషం అంటారు ఇలా ఉన్నవాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతూ ఉంటుంది ఆ దోషాన్ని పోగొట్టుకోవాలంటే శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి శనివారం పూట విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం అక్కడ తులసి దళాలతో అర్చన చేయించుకోవడం చేయాలి ఇలా ఎనిమి శనివారాలు చేస్తే పంచమ శని దోషం తొలగింప చేసుకోవచ్చు
జాతక చక్రంలో లగ్నం నుంచి చూసినప్పుడు ఆరవ స్థానంలో ఆరవ గడిలో శని ఉంటే మాత్రం శత్రువుల మీద విజయం సాధిస్తారు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు దైర్య సాహసాలతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే జాతక చక్రంలో లగ్నము నుంచి లెక్కపెట్టినప్పుడు ఏడవ స్థానంలో ఏడవ గదిలో శని ఉన్నట్లయితే సప్తమ శని దోషం అంటారుఈ సప్తమ శని దోషమున్నవాళ్ళకి పెళ్లిళ్లు ఆలస్యం అవుతూ 35 సంవత్సరాలు 36 సంవత్సరాల వరకు వివాహం జరగకపోవడానికి కారణం జాతక చక్రంలో లగ్నం నుంచే లెక్కపెట్టినప్పుడు ఏడవ స్థానంలో శని ఉండటమే సప్తమ శని దోషం ఉండమే ఈ సప్తమ శని దోషం ఉన్నవాళ్లు ఏడు శనివారాల వ్రతం చేసుకోండి ఆ సప్తమ శని దోషం తొలగిపోయి త్వరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు
అలాగే జాతకంలో లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు ఎనిమిదవ స్థానంలో 8వ గడిలో శని ఉంటే అష్టమ శని దోషం అంటారు జాతక చక్రంలో ఉంటం వల్ల చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా ఏవో ఒక ఇబ్బందులు ఉంటాయి జీవితంలో పైకి ఎదుగుతున్న సమయంలో ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది ఈ అష్టమ శని దోషం తొలగింప చేసుకోవాలంటే పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ దర్శనం శనివారం పూట చేయాలి.. ఉంటం వల్ల చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా ఏవో ఒక ఇబ్బందులు ఉంటాయి జీవితంలో పైకి ఎదుగుతున్న సమయంలో ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది ఈ అష్టమ శని దోషం తొలగింప చేసుకోవాలంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం శనివారం పూట చేయాలి.
ఎనిమి శనివారాలు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించుకుంటే జాతకంలో ఎనిమిదవ స్థానంలో శని ఉండటం వల్ల ఏర్పడే ఇబ్బందులని తొలగిపోతాయి అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో లగ్నము నుంచి సవ్య దిశలో లెక్కపెట్టినప్పుడొచ్చే తొమ్మిదవ స్థానం తొమ్మిదవ గడిలో శని ఉన్నట్లయితే అదృష్టాన్ని అందిపుచ్చుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది అదృష్టం తృటిలో జారిపోతూ ఉంటుంది అటువంటి అప్పుడు ఆ దోషాన్ని తొలగింప చేసుకోవాలంటే శనివారం శివాలయ దర్శనం చేయాలి.
శనివారం పూట శివుడికి నల్ల నువ్వులతో పూజ చేసి ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించా ఇలా ఎనిమి శనివారాలు చేస్తే తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో శని ఉండటం వల్ల ఏర్పడే దోషం తొలగిపోయి అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అలాగే జాతక చక్రంలో లగ్నము నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే పదవ స్థానంలో పదవ గడిలో శని ఉన్నట్లయితే వాళ్ళు జీవితంలో ఆలస్యంగా అభివృద్ధి సాధిస్తారు కానీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే జాతక చక్రంలో 11వ స్థానంలో 11వ గడిలో శని ఉన్నట్లయితే జీవితంలో అనూహ్య స్థాయిలో విజయాలను సాధిస్తారు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఇక చివరగా జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో లగ్నము నుంచి లెక్కపెట్టినప్పుడొచ్చే 12వ స్థానం 12వ గడిలో శని ఉన్నట్లయితే శారీరక మానసిక అనారోగ్య సమస్యలు వృధా ఖర్చులు శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి.
అవన్నీ పోగొట్టుకోవాలంటే శనివారం పూట దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ ఎనిమిది నల్లటి గాజులు కొద్దిగా ఇంగువ ఉంచాలి ఇలా ఎనిమి శనివారాలు చేస్తే ఈ వ్యయ శని దోషం తొలగిపోతుంది 12వ స్థానంలి లో చేనున్న దోషం తొలగిపోతుంది ఇలా జాతక చక్రంలో ఒక్కొక్క స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితం వస్తుంది. చెడు స్థానాలలో శని భగవానులు ఉండటం వల్ల ఏర్పడే ఫలితాలు తొలగింప చేసుకోవడానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి అలాగే జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నా సరే అద్భుతంగా యోగించాలంటే శనివారం పూట ఆంజనేయస్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 108 సార్లు చదువుకోవాలి లేదా దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి అక్కడ మంత్రాన్ని 108 సార్లు చదువుకున్న మీ జాతక చక్రంలో ఉన్న శని దోషాలని తొలగిపోతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం హరి మర్కట మర్కటాయ స్వాహా ఇది మంత్రం శక్తివంతమైనటువంటి జాతకంలో ఉన్నటువంటి శని దోషాలని పోగొట్టే ఆంజనేయ మంత్రం ఇంకొక్కసారి చూద్దాం మరి ఓం హ్రీం హరి మర్కట మర్కటాయ స్వాహా ఇంట్లో గాని ఆంజనేయస్వామి దేవాల యంలో గాని ఈ మంత్రం చదువుకోండి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింప చేసుకోండి.
Read Also : Shani Dev Puja : దృష్టి దోషం, జాతక దోషాలు ఏమైనా తొలగాలంటే శని దేవున్ని ఇలా పూజిస్తే చాలు.. అన్ని శుభాలే..!




