Shani Dev Puja : శనివారానికి అధిపతి శనీశ్వరుడు. జ్యోతిష్య శాస్త్ర పరంగా గ్రహానికి ఎవరు అధిష్టాన దేవతలు ఉంటారో ఆ అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. అధిష్టాన దేవతలకు సంబంధించిన అర్చన చేయడం ద్వారా ఆయా గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. శనివారానికి అధిపతి అయిన శనేశ్వరుడికి ముగ్గురు అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆంజనేయస్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ ముగ్గురు కూడా శని భగవానుడికి అధిష్టాన దైవాలు. శనివారం సందర్భంగా ఈ అధిష్టానదైవాలకు సంబంధించిన అర్చన చేయడం ద్వారా జాతక శని దోషాలు, రాశిలో శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా ఎవరైనా వివాహపరమైన సమస్యలు, దాంపత్య పరమైన సమస్యలు అపమృత్యు దోషాలు ఎదుర్కొంటున్న వాళ్లు వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు.
శని దోషాలను తొలగించుకోవడానికి ఆంజనేయస్వామిని ఈరోజు తమలపాకులతో పూజించాలి. 108 తమలపాకులతో ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ, చిత్రపటానికి పూజ చేస్తూ.. హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఈ మంత్రం చదువుకుంటూ తమలపాకులతో పూజ చేస్తే జాతక శని దోషాలు, గోచార శని దోషాలు తొలగిపోయి ప్రధానంగా వివాహ దాంపత్య సమస్యలను అధిగమించవచ్చు. అపమృత్యు దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి శని బాధల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే.. అటువంటి వాళ్లు ఆర్థికపరమైన సమస్యలు అధిగమించటానికి వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించండి. ఇంట్లో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర పిండి దీపాన్ని వెలిగించండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాలని సమర్పించండి.
శని దోషాల నుంచి బయటపడాలంటే? :
తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోండి. వెంకటేశ్వర ఆలయంలో కూర్చొని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోండి. అలా చేస్తే జాతక శని దోషాలు రాశి, శని దోషాల వల్ల ఏర్పడే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. వివాహ దాంపత్య సమస్యలు అపమృత్యు దోషాలు పోవాలంటే.. ఈరోజు ఆంజనేయుని పూజించాలి. శని బాధల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంటే.. వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే, కుటుంబ కలహాలు దృష్టి దోషాలు, శత్రుభాధలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నవాళ్లు ఈరోజు శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన పాలతో అభిషేకం చేయండి.

నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగం ఇంట్లో లేని వాళ్ళు ఈశ్వరుడి చిత్రపటానికి నల్ల నువ్వులతో పూజ చేసి ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే, శివాలయ ప్రాంగణంలో కూర్చొని పరమేశ్వరుడికి సంబంధించిన శివ పంచాక్షరి స్తోత్రం చదువుకోండి. ఇలా వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయస్వామిని, పరమేశ్వరుని శనివారం సందర్భంగా మీ సమస్యను బట్టి అర్చన చేయడం ద్వారా గ్రహచార, గోచార శని దోషాలు తొలగింప చేసుకొని శని భగవానుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు.
Shani Dev Puja : గ్రహ దోషాలు, జాతక దోషాలను తొలగించుకోవాలంటే..
అలాగే, శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజున కాళికాదేవి అర్చన కూడా విశేషంగా సహకరిస్తుంది. కాళికా అమ్మవారి ఆలయం మీకు దగ్గరలో ఉన్నట్లయితే.. ఆలయానికి వెళ్లి నిమ్మకాయల దండ, కాళికా అమ్మవారికి సమర్పించడం, కాళికా అమ్మవారి ఆలయంలో దీపాన్ని వెలిగించడం, కాళికాదేవి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ చేయలేకపోయినా దక్షిణ కాళికా స్తోత్రం అనే శక్తివంతమైన స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా కూడా గ్రహచార, గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని స్తోత్రం ప్రియుడు.. శనిని ప్రసన్నం చేసుకోవడానికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ఆలయంలో కూర్చొని దశరథ శని స్తోత్రాన్ని చదవటం చేయండి. అలా చేసిన తీవ్రమైన శని దోషాలను బయటపడవచ్చు.
శని దేవుని శక్తివంతమైన రెండు నామాలు ఇవే :
అయితే, ఈ ప్రత్యేకమైనటువంటి అర్చనలు చేయలేని వాళ్లు స్తోత్ర పారాయణులు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శని భగవానుడికి సంబంధించిన రెండు శక్తివంతమైన నామాలను ఇంట్లో దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21సార్లు చదువుకోండి. ఆ శక్తివంతమైన నామాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మొట్టమొదటి నామం “ఓం శనీశ్వరాయ నమః” రెండవ నామం “ఓం నీలాంబర విభూషాయ నమః” ఈ 2 నామాలు శనివారం ఇంట్లో దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21సార్లు చదువుకోండి. అధిష్టానదైవాలకు సంబంధించిన అర్చన చేయడం ద్వారా భయంకరమైన శని దోషాలు శని పీడల వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే, అధిష్టానదైవాల అర్చన చేయడం సాధ్యం కాని వాళ్ళకి స్తోత్రాలు చదవటానికి సమయం లేని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏ 2 శని నామాలైనా వీలైనన్ని సార్లు చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఓం శనీశ్వరాయ నమః, ఓం నీలాంబర విభూషాయ నమః శనికి సంబంధించిన ఈ నామాలు జపించుకోండి. సకల శుభాలను పొందండి.
Read Also : Shani Dev Puja : శనివారం ఈ పనులు చేస్తే.. ఈ దోషాలు పోయి బోలెడు లాభాలు..