Money Remedies : అన్ని సమస్యలు అధిగమించటానికి సకల శుభాలు కలగడటానికి ధనప్రాప్తిని పొందడానికి పసుపుకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. అలాగే, గురువారానికి అధిపతి నవగ్రహాలకు గురువు పెద్దది. బృహస్పతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. గురువుకు ప్రియమైన పసుపు. అందుకే, గురువారం రోజు పసుపుకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఆటంకాలు ఉన్న అధిగమించవచ్చు. అనేకమార్గాల్లో ధన ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అసలు గురువారం రోజు ఎవరైనా సరే పసుపు నీళ్లలో కలిపి లేదా గంగాజలంలో కలిపి ఆ పసుపుని బొట్టు లాగా పెట్టుకుంటే.. జాతకంలో గురు బలం పెరుగుతుంది. నుదుటన బొట్టు లాగా పెట్టుకోవడం వీలుకాదని భావించే వాళ్ళు కుడి చేతి మణికట్టు దగ్గరైన సరే ఆ పసుపు బొట్టు లాగా పెట్టుకోండి. పసుపు నీళ్లలో తడిపి బొట్టులాగా పెట్టుకుంటే విశేషంగా గురుబలం పెరిగి ఈ పరిహారం వల్ల అనేక మార్గాల ధనాదాయం పెరుగుతుంది.
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా, గురువారం రోజు ఎవ్వరైనా సరే పసుపు గంగాజలంలో కానీ లేదా రోజు వాటర్‌లో గాని కలిపి ఆ పసుపుతో మీ ఇంటి మెయిన్ డోర్ మీద 4 గీతలు గీయండి. మీ ఇంటి మెయిన్ డోర్ బయటి వైపు 4 గీతలు గీయండి. అలా బయట వైపు గీతలు గీయటం సాధ్యం కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి ప్రధాన ద్వారం మెయిన్ డోర్‌కి లోపల వైపు కింద అయినా సరే ఆ గంగాజలం లేదా రోజు వాటర్ కలిపినటువంటి పసుపుతో 4 గీతలు గీయండి. అది శుభానికి సంకేతం. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది.
అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతుంది. అసలు గురువారం రోజు ఎవరైనా సరే ఇంట్లో ఈశాన్యంలో ఉన్న గోడల మీద పసుపుతో బొట్లు పెట్టారనుకోండి. విశేషమైనటువంటి గురుబలం కలుగుతుంది. గురువుకు ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు.. అందుకే ప్రతి గురువారం కూడా స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంట్లో ఆడవాళ్లు ఇంట్లో ఈశాన్యంలో ఉన్న గోడలకి పసుపు కొద్దిగా గంగా వాటర్‌లో గాని రోజు వాటర్‌లో గాని కలిపి అపసప్త బొట్లు పెట్టండి. అలాగే గురువారం రోజు ఒక తెల్ల కాగితం మీద పసుపుతో కొన్ని అంకెలు వేసి.. ఆ తెల్ల కాగితాన్ని మడిచి ఇంట్లో పూజా మందిరంలో దేవుడి ఫొటోల దగ్గర గాని లేదా బీరువాలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం రాజయోగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు.
Money Remedies : అన్ని రాశుల వారికి జాతక ఫలితాలు, జ్యోతిష్య పరిహారాలివే..
అందుకే, మీరు గురువారం ఏం చేయాలంటే.. ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి. ఆ తర్వాత పసుపు కొద్దిగా తీసుకొని ఆ పసుపుని గంగాజలంలో గాని రోజు వాటర్ లో గాని కలపండి. ఆ పసుపుతో ఈ తెల్ల కాగితం మీద పెద్ద చతురస్రంలా గీయండి. పసుపు తోనే గీయాలి. తెల్ల కాగితం మీద పెద్ద చతురస్రం లాగా గీయాలి. అలా గీసిన తర్వాత ఆ పెద్ద చతురస్రంలో 9 చిన్న చతురస్రాలు వచ్చేలాగా తడి పసుపుతో గీయండి. అలా గీసిన తర్వాత ఆ పసుపుతోనే ఈ 9 చిన్న చతురస్రాల్లో కొన్ని అంకెలు వేయండి. నిలువుగా వేయాలి. అడ్డంగా వెయ్యద్దు. వేయాల్సిన అంకెలు ఏంటంటే.. 10 ,11, 6, 5, 9, 13, 12, 7, 8 అనే అంకెల గురించి మనకు మంత్ర శాస్త్రంలో చెప్పారు. ఆ పెద్ద చతురస్రాన్ని 9 చిన్న చతురస్రాలు లాగా గీసి ఆ 9 చిన్న చతురస్రాలుగా నిలువుగా పసుపుతో ఈ అంకెలు రాయాలి. అలా రాసిన తర్వాత ఈ కాగితం మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. పసుపు రంగులో ఉన్న పసుపు కొమ్ము ఉంచాలి. అలా ఉంచి ఆ కాగితాన్ని మడత పెట్టి ఆ కాగితానికి పసుపు రంగు దారాన్నే చుట్టాలి. పసుపు రంగు దారంతో కట్టాలి.
పసుపు రంగు దారం లేకపోతే.. దారాన్ని పసుపులో తడిపి ఆధారమైన సరే చుట్టూ ఇప్పుడు అలా మడిచినటువంటి కాగితాన్ని పసుపు రంగు దారం చుట్టిన కాగితాన్ని మీ ఇంట్లో దేవుడి ఫోటోల దగ్గర ఉంచి ధూపం వేసి ఒక మంత్రం చదువుకోవాలి. ‘ఓం గం గణపతయే నమః‘ ఈ మంత్రాన్ని 21 నిమిషాల పాటు చదవాలి. 21 నిమిషాలు ఈ మంత్రం చదివిన తర్వాత జాగ్రత్తగా మీరు ఏర్పాటు చేసుకునేటువంటి ఆ పసుపుతో రాసినటువంటి అంకెలున్న కాగితాన్ని పసుపు కొమ్ముతో కట్టినటువంటి ఆ కాగితాన్ని మడిచినటువంటి ఆ కాగితాన్ని దేవుడి ఫొటోల వెనక ఉంచండి. ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోండి.
ఇలా చేసుకుంటే.. విశేషంగా గురుబలం పెరుగుతుంది. ధనయోగం రాజయోగం కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి పరిహారాన్ని గురువారం తప్పకుండా ఆచరించండి. కాబట్టి పసుపుతో ఈ అద్భుతమైన పరిహారం పాటించేటప్పుడు అందరూ కూడా తడి పసుపుతో తెల్ల కాగితం మీద పెద్ద చతురస్రం గీయాలి. మంత్ర శాస్త్ర పరంగా.. పసుపుతో ఇలా ఇస్తే.. రానురాను ఖర్చులు తగ్గిపోతాయి. పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్న వాళ్లకి తొందరగా పెళ్లిళ్లు అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. నర పీడ పోతుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలను పొందవచ్చు.