Hibiscus Mascara Benefits : ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతుంటారు. కానీ, అందులో ఏ మొక్క పెంచితే మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ (positive energy) ని తీసుకొస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. పెంచే మొక్కను బట్టి ఫలితం వేరేలా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని పువ్వు మొక్కలకు అద్భుతమైన శక్తి (mascara benefits for money) ఉంటుందట.. అందుకే ఇళ్ల ముందు కొన్ని ప్రత్యేకమైన చెట్లు, మొక్కలను పెంచాలని సూచిస్తుంటారు వాస్తు నిపుణులు. కొన్ని చెట్లను పెంచడం ద్వారా చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అందుకే చెట్లను పెంచే విషయంలో వాస్తు దోషాలు (Vastu Dosha in telugu) లేకుండా చూసుకోవాలని అంటున్నారు. ఏయే మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మందార పువ్వు మొక్క.. (Hibiscus Mascara Plant) ఈ మొక్క గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మందార పువ్వులతో కూడిన మొక్కను ఇంట్లో పెంచుకుంటే అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుందట.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వచ్చేలా చేస్తుంది. ఎర్రని రంగులో మెరిసే మందార పువ్వుల (Hibiscus Mascara Flowers)ను అందరిని ఆకర్షిస్తాయి. మీ ఇంటికి నరదృష్టి తగలకుండా ఈ మందార పువ్వులు అడ్డుకుంటాయి. ఎందుకంటే.. మీ ఇంటిపై కనుదిష్టి పడకుండా అందరూ ఈ మందార పువ్వులనే చూస్తుంటారు. ఫలితంగా ఈ చెడు ప్రభావం తక్కువగా ఉంటుంది అనమాట.. మందార పువ్వులు చూడటానికి ఎర్రగా చాలా అందగా మెరిసిపోతుంటాయి. ఈ మందార పువ్వులతో అనేక సమస్యలను నివారించుకోవచ్చు.
ఇంతకీ మందార పువ్వు మొక్కను ఏ దిశలో నాటాలో ముందుగా తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ అపసవ్య దిశలో మొక్కలను నాటరాదు.. అది వాస్తపరంగా అనేక దోషాలకు దారితీస్తుంది. మీ ఇంటి ఆవరణంలో తూర్పు దిశలో మాత్రమే మందార పూల మొక్కను నాటాలి. అప్పుడు మీకు అంతా సానుకూల ఫలితాలను అందిస్తుంది. మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. మందార పువ్వులను చూడగానే మనస్సులో తెలియని ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మంచి ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
మందార పువ్వుతో అనేక వాస్తు దోషాలను నివారించుకోవచ్చు. ఈ పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది.. అలాగే అంగారకుడు కూడా ఎర్ర రంగులోనే ఉంటాడు. అందుకే గ్రహ దోషాలు నివారించుకోవాలంటే.. ఇంట్లో తప్పనిసరిగా మందారం మొక్కను నాటాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరో మాటలో చెప్పాలంటే.. మీ ఇంటికి మంగళ దోషాన్ని నివారిస్తుంది. అంతేకాదు.. మీ కుటుంబంలో రాబోయే అనేక సమస్యలను రాకుండా నివారిస్తుంది.
Hibiscus Mascara Benefits : మీ ఇంట్లో మందార పువ్వు ఉంటే చాలు..
మందార పువ్వులో పుప్పొడి ఉంటుంది. దానికి అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. మందారపువ్వులో పుప్పొడిని సేకరించాలి. పుప్పొడి రేణువులను ఏదైనా డబ్బాలో ఉంచుకోవాలి. మందార పువ్వు పుప్పొడికి యాలకుల పొడిని కలుపుకోవాలి. మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక కాటుక మాదిరిగా చేసుకోవాలి. నుదుటిపై తిలకంలా పెట్టుకునేలా ఉండాలి. ఇందులో నీళ్లు అసలు పోయరాదు. కొంచెం నెయ్యి పోసుకోవచ్చు. ఇప్పుడు ఆ తిలకాన్ని పూజగదిలో ఉంచుకోవాలి. శుక్రుడు, మహాలక్ష్మిని స్మరించుకుంటూ దీపాన్ని వెలిగించాలి. నిత్యం ఈ కాటుకను మీ నుదిటిపై తిలకంలా ధరించాలి.
కొన్నిరోజులు ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సిరిసంపదలు పెరిగి అదృష్టం తాండవిస్తుంది. మందార పువ్వు పుప్పొడితో తయారుచేసిన ఈ కాటుక బ్లాక్ కలర్ ఉంటుంది. మీ నుదుటిపై ధరిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దురదృష్టం మీకు దూరంగా పారిపోతుంది. ఏమైనా రుణ బాధలు ఉంటే అన్ని తొలగిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. ఈ కాటుక తిలకాన్ని 48 రోజులు వినియోగించుకోవచ్చు. ఈ కాటును ధరించడం ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకోవచ్చునని వేద పండితులు చెబుతున్నారు.
అంతేకాదు.. సూర్యునికి మందార పువ్వు ఎంతో ఇష్టమైనది.. అందుకే సూర్యున్ని ఎప్పుడూ మందార పువ్వుతోనే పూజిస్తుంటారు. మందార పువ్వులు నీటిలో వేసి సూర్యునికి ప్రతిరోజూ అర్ఘ్యం సమర్పిస్తుండాలి. ఇలా చేయడం ద్వారా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంజనేయ స్వామికి కూడా ఎర్ర మందారాన్ని సమర్పించవచ్చు. ప్రతి మంగళవారం ఇలా మందార పువ్వును హనుమాన్‌కు సమర్పించడం ద్వారా అనేక శుభాలు కలుగుతాయని చాలా మంది విశ్వాసిస్తారు. అంతేకాదు.. శుక్రవారం రోజున లక్ష్మిదేవికి మందార పువ్వును సమర్పిస్తే.. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్న ఇట్టే తొలగిపోతాయట.. ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడేవారు ఈ మందార పువ్వుతో పూజిస్తే అన్నింట విజయాలను సొంతం చేసుకోవచ్చు.