Deepam Visistatha in telugu : దీపం సకలదేవతలకూ సాక్షీభూతమని చెబుతారు. దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే పూజలో భాగంగా దీపాన్నీ పూజిస్తారు. పూలూ అక్షతలూ జల్లుతారు, నైవేద్యం పెడతారు.
కామాక్షి దీపం … కామాక్షి దీపం ఒక ప్లేట్లో 6 తమలపాకులు పెట్టి మధ్యలో తమలపాకు వేసి దానిమీద కామాక్షి దీపాన్ని మూడు వత్తులు వేసి ఒక ఒత్తిగా చేసి వెలిగించాలి. కామాక్షి దీపం ముందు 5 తమలపాకులు పెట్టి ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క దీపం పెట్టుకోవాలి. ఆవు నెయ్యి వేసి కొమ్మత్తులు పెట్టి దీపాలను వెలిగించుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం పంచ దీపాలు వెలిగించడం వలన ఇంట్లో సిరిసంపదలతో వెళ్లి విరుస్తుంది సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది..
కుబేర దీపం.. ప్రతినిత్యం చేసే పూజలో భాగంగా లో శుక్రవారం..(కుబేర లక్ష్మి) ఫోటో ముందు యంత్రం ముందు కుబేరుడు దీపాన్ని గంధం కుంకుమలతో పూలతో అలంకరించి కుబేర దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి ఆకు పచ్చని ఒత్తితో పెట్టి దీపాన్ని వెలిగించాలి. నమ్మకంతో పూజ చేసుకోవాలి. దీపం ముందు పండు లేదా నైవేద్యం హారతి ఇవ్వాలి. (కుబేరుడు కి ఆకుపచ్చని కుంకుమ అంటే చాలా ప్రీతి..) ధనాధిపతి మెచ్చే దీపం.. సకల దరిద్రాలు పోతాయి.. అష్టైశ్వర్యాలు కలిగి ఉంటారు.
ఉప్పు దీపం.. శుక్రవారం రోజు లక్ష్మి దేవి ఫోటో ముందు ఒక ప్లేట్ లో మట్టి ప్రమిదలు మూడు తీసుకొని ఒక పెద్ద ప్రమిదను పసుపు కుంకుమతో అలంకరించి రాళ్ల ఉప్పు పోసుకోవాలి దానిమీద చిన్న ప్రమిద పెట్టి దాన్ని కూడా పసుపు కుంకుమతో అలంకరించి ఒక ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపాన్ని వెలిగించాలి పూలతో అలంకరించి ధూప నైవేద్యం హారతి ఇచ్చి.. మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఇలా ఉప్పు దీపం ప్రతి శుక్రవారం పెట్టుకోవడం వలన లక్ష్మీ కటాక్షం.. సకల శుభాలు కలుగుతాయి అనుకున్న కోరికలు జరుగుతాయని నమ్మకం. మరుసటి రోజు ఈ ఉప్పుని తీసి నీళ్లలో కలిపి చెట్టు మొదల్లో ఎవరు తొక్కని ప్లేస్ లో వెయ్యాలి.
Deepam Visistatha : దీపం విశిష్టత….
పిండి దీపం.. ఏడి శనివారాల వ్రతం చేసేవారు పిండి దీపాలను వెలిగిస్తారు. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఎంతో ప్రీతికరం.. ప్రతినిత్యం పూజలో భాగంగా సోడోపచారాలు తో పూజ చేసిన తర్వాత శనివారం వెంకటేశ్వర ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఒక ప్లేట్లో తమలపాకు వేసి పిండి ప్రమిదలు పెట్టి వెలిగించుకోవాలి.. బియ్యం పిండి, బెల్లం, కొన్ని పాలు పోసి ప్రమిదల తయారు చేసుకుని గంధం కుంకుమలతో ప్రమిదకు మూడు నామాలు అలంకరించుకోవాలి. ఈ పిండి దీపంలో నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె, ఆవు నెయ్యితో ఏడు వత్తులు వేసి చేస్తారు. రెండు ప్రమిదలు దీపం ప్రమిదలో ఏడు వత్తులు లేదా కొమ్ము ఒత్తులు ఏడు దీపాలు పెట్టి వెలిగిస్తారు. ప్రమిద చుట్టూ పూలతో అలంకరించి స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పక కలుపుతుంది. ధనాభివృద్ధి, సిరి సంపదలు కలిగి ఉంటారు.
రావి ఆకులపై దీపం… ప్రతిరోజు నిత్య దీపరాధన చేస్తూ ఉంటాం..సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం రోజులలో ఒక ప్లేట్లో మచ్చలు లేని రావి ఆకు దీపం వెలిగించేటప్పుడు రావి ఆకు కాడ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఆకు కొనభాగం దేవుడు వైపు ఉండాలి. గంధం కుంకుమతో అలంకరించి రావి ఆకులపై ( 2)మట్టి ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాన్ని రెండు వత్తులు తీసుకొని ఒక వత్తిగా చేసి వెలిగించి కుంకుమ గంధం పూలతో అలంకరించి నమస్కరించుకోవాలి. ఇంట్లో పూజ గదిలో ఎవరైతే రావి దీపాన్ని పెడతారో చిన్నపిల్లలు మాట వినకపోయినా గ్రహదోష ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.. ఆ ఇంట్లో సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు.