Ashadha Varahi Gupt Navratri 2023 : వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు.. అమ్మవారి 9 రోజుల అలంకారాలు, పూజా విధానము, ఏ రోజు ఏ శ్లోకాలు పఠించాలి? అనే పూర్తి పూజా విధానాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆషాడశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. 4 ముఖ్యమైన నవరాత్రులలో ఆషాడంలో వచ్చే వారాహినవరాత్రి ఒకటి. వారాహి అమ్మవారు అంటే.. భూదేవి.. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్లినప్పుడు.. శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువలనే ఈమె వరాహ స్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కనిపిస్తుంది.
వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు.. సర్వసంపదలను ఇచ్చే శ్రీమహాలక్ష్మి. అందుకే ఈ శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధూమ్రా అని కనిపిస్తుంది. ఈ అమ్మవారిని పూజిస్తే.. వరాహ స్వామిని అలాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను పరిష్కరిస్తుంది. వారాహి అమ్మవారు స్వరూపాన్ని గమని ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్రహల ముసల అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. మహా వారాహి స్వరూపం ఇంకా లఘువరాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఆవిడ హలము ముసలము ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే.. రోకలిని ధాన్యం దంచడానికి వాడుతారు. దీని బట్టి అమ్మవారు సస్య దేవత అని గ్రహించాలి. అంటే.. పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీవరాహి మాత అందుకే అమ్మవారిని ఆషాడ మాసంలో పూజ పూజించమన్నారు. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే.. వారాహి అంటే ఎవరో కాదు.. సాక్షాత్తు భూమాత. ఆషాడ నవరాత్రి ప్రతిరోజు సప్తమాతృక్క దేవతలను అష్ట మాతృక దేవతలను పూజించాలి. 8వ రోజు వారాహి దేవిని పూజించడం వలన సంపన్నమైన జీవితం లభిస్తుంది.
Ashadha Varahi Gupt Navratri 2023 : ఈ 9 రోజులు అమ్మవారిని ఏ రోజు ఎలా అలంకరించాలంటే?
మొదటి రోజు ఆషాడ శుద్ధ పాడ్యమి ఉన్నత వారాహి పూజ జరుపుకుంటారు. అమ్మవారిని రెండవ రోజు బృహద్వారాహి పూజను చేస్తారు. మూడవరోజు అమ్మవారిని స్వప్న వారాహి పూజ చేస్తారు. నాలుగవ రోజు అనగా.. చవితి ఈరోజు అమ్మవారిని కిరాతవారాహి పూజ చేస్తారు. ఐదవ రోజు ఎంతో విశిష్టత అయిన రోజు అనగా పంచమి తిథి నాడు అమ్మవారిని శ్వేత వారాహి పూజ చేస్తారు. ఏడవ రోజు అమ్మవారిని సప్తమితి రోజు మహా వారాహి పూజ చేస్తారు. ఎనిమిదవ రోజు వార్తాలు పూజ చేస్తారు. ఎనిమిదో రోజు అనగా అష్టమి రోజు 9వ రోజు అమ్మవారిని దండిని వారాహి పూజ చేస్తారు.
పదవరోజు గాను ఆదివారాహి మహా పూజ, ఉద్యాపన చేస్తారు. ఈ వారాహి అమ్మవారిని ఈ దేవికి నిత్య పూజతో పాటు వారాహి అష్టోత్తరం, వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలైనప్పుడు వారాహి అమ్మవారి స్తోత్రాలు, హృదయం కవచం, సహస్రనామాలు, సహస్రనామము మొదలగు వాటిని పారాయణం చేసుకొనవచ్చు. తప్పకుండా వారాహి సుదర్శనామాలు స్తోత్రం పఠించడం వల్ల అమ్మవారు మనకు ఎంతో శక్తిని ఇస్తుంది. ఈ నవరాత్రి పూజలో భాగంగా అష్టోత్తరాలతో కుంకుమార్చనలు చేస్తారు.
సహస్రనామాలు, స్తోత్రాలు, దేవి భాగవతం, దుర్గ సప్తశతి, దేవి మహత్యం లాంటివి పారాయణం చేయడం శుభాలను కలిగిస్తుందని భావిస్తారు. వారాహి అమ్మవారిని ఈ 12 నామాలతో పూజిస్తే ఏ సమస్యలుయినా మటుమాయం.. వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. పంచమి, సమయ సంకేత, దండనాథా, వారాహీ, సంకేతా, పోత్రిణి, శివా, మహాసేన, వార్తాళి, అరిఘ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే 12 నామాలుగా పిలుస్తారు. ఈ 12 నామాలను ప్రతిరోజూ 11 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.