Adhik Maas Purnima 2023 : అధికమాసంలో వచ్చే పౌర్ణమితికి చాలా శక్తి ఉంది. అధిక శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమితి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటిస్తే.. చంద్రుడి బలాన్ని పెంచుకోవచ్చు. సకల శుభాలను పొందవచ్చు. సాధారణ మాసంలో చేసే జపాలు కన్నా హోమాల కన్నా దేవాలయ దర్శనాల కన్నా అధికమాసంలో చేసే జపాలు, హోమాలు, దేవాలయ దర్శనాలు చేస్తే ఎక్కువ రెట్లు ఫలితాలను పొందవచ్చు. పౌర్ణమితికి చాలా శక్తి ఉంటుంది. శ్రావణ పూర్ణిమ అంటే.. ఎంతో శక్తివంతమైన రోజుగా చెబుతారు. అధికమాసంలో వచ్చే శ్రావణ పూర్ణిమ చాలా శక్తివంతమైన రోజు కావడంతో చంద్రుడి బలాన్ని పెంచుకోవచ్చు. రాత్రి సమయంలో ప్రత్యేకమైన నైవేద్యాన్ని పున్నమి వెన్నెలలో ఉంచాలి. ఆ నైవేద్యం ఎలా ఉంచాలంటే.. అరటి ఆకులో వెండి గిన్నె ఉంచి అందులో పాయసం పోసి ఆరుబయట వెన్నెలలో 10 నిమిషాల పాటు ఉంచాలి.
అలా ఉంచినప్పుడు ‘సోం సోమాయ నమః’ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. వెన్నెలలో ఆ నైవేద్యాన్ని ఉంచాలి. ఆ తర్వాత కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. అధిక శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇలా చంద్రుడికి వెన్నెల్లో నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తే.. చంద్రబలం విపరీతంగా పెరుగుతుంది. మానసికంగా స్థిరత్వం ధృఢత్వం పెరుగుతుంది. మానసిక అశాంతి తొలగిపోతుంది. అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుతంగా రాణించాలని భావించే వాళ్ళు కూడా అధిక శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఈ ప్రత్యేకమైన నైవేద్యాన్ని పున్నమి వెన్నెల్లో చంద్రుడికి సమర్పించాలి. సకల శుభాలను పొందవచ్చు. మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయ దర్శనం చేయడం ద్వారా దుర్గా దేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మ దీపాలు వెలిగించడం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటిస్తూ వాహనాలు కొనుక్కోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి.
ఎప్పుడైనా వాహనాలు కొనాలంటే మంగళవారం రోజు కొనకూడదు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు వాహనం కొనకూడదు. కొన్ని నక్షత్రాల్లో వాహనం ఉంటే.. బైక్ గానీ కారు గాని కొంటె ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. భరణి నక్షత్రాన్ని యమధర్మరాజు నక్షత్రం అంటారు. భరణి నక్షత్రం ఉన్న రోజు వాహనాలు కొనుగోలు చేయకూడదు. అలాగే, మఖా నక్షత్రం, మూలా నక్షత్రము ఉన్న రోజుల్లో కూడా వాహనాలు కొనుగోలు చేయకూడదు. అలాగే, జేష్ఠ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజుల్లో కూడా వాహనం కొనుగోలు చేయకూడదు. కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అలాగే వాహనం మీద ఉండేటటువంటి నెంబర్ బట్టి కూడా మనకు అదృష్టం ఉంటుంది. ఎప్పుడైనా సరే వాహనం మీద ఉన్న నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ మొత్తం కలిపితే 4 గానీ 7 గానీ 8 గానీ రాకుండా చూసుకోవాలి.
4 నెంబర్ వస్తే ధన పరంగా అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. బండిమీద ఉన్నటువంటి నెంబర్ మొత్తం కలిపినప్పుడు 7 వస్తే.. దానివల్ల వృధాగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాకాకుండా బండి నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ మొత్తం కలిపినప్పుడు 8 వస్తే.. వాహనానికి ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే సమయంలో ఈ సూచనలు పాటించాలి. సహజంగా 1 గానీ 3 గానీ 5 గానీ 6 గాని వస్తే చాలా మంచిది. అలాగే వాహనం రంగును బట్టి కూడా అదృష్టం ఉంటుంది.
ఎప్పుడైనా సరే ఒక వాహనాన్ని కొనుక్కోవాలంటే నేవీ బ్లూ కలర్ వాహనాన్ని కొనుక్కుంటే.. ఏ జాతకులకైనా సరే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆకుపచ్చ రంగు వాహనం గాని తెలుపు రంగు వాహనంగానే పెద్దగా ప్రమాదాలను కలిగించదు. అయితే, ఎరుపు రంగు వాహనాలు ఉపయోగిస్తే ఎరుపు రంగు బండి గానీ ఎరుపు రంగు కారు గాని ఉపయోగించినట్లయితే.. దానివల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ ఎప్పుడూ మీ బండిలో కానీ కారులో గాని పెట్టుకోవాలి. వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సకల శుభాలను పొందవచ్చు. అయితే, మీ అదృష్ట సంఖ్యను బట్టి కూడా వాహనం తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
Adhik Maas Purnima 2023 : మీ అదృష్ట సంఖ్య ఇదేనా.. అన్ని శుభఫలితాలే..
మీ అదృష్ట సంఖ్య 4 లేదా 7 లేదా 8 ఉన్నవారైతే ఆ అంకెలు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. అదృష్ట సంఖ్య 4, 7, 8 రాని వాళ్ళు మాత్రం వాహన నెంబర్ ఇలా వచ్చినట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్తితి ఎదురవుతాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. మంత్ర శాస్త్రంలో శక్తివంతమైన మంత్రం ఉంది. అదే దుర్గా సంరక్షణ మంత్రం.. ‘ఓం దుర్గే రక్షిణి ఫట్’ అంటే.. మీకు వాహనం నెంబర్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నా ఈ దుర్గా సంరక్షణ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వాహనం మీద ప్రయాణం చేయాలి.
అప్పుడు దుర్గాదేవి అనుగ్రహం వల్ల వాహనం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. అలాగే, ఈరోజు అధిక శ్రావణ పౌర్ణమి. ఈరోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత చంద్రుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకుంటే చంద్రబలం విపరీతంగా పెరుగుతుంది. తల్లి వైపు నుంచి రావలసిన ఆస్తిపాస్తులు తొందరగా వస్తాయి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలు అన్ని తొలగిపోతాయి. అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే వాళ్లకు మనశ్శాంతి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవడానికి ఈ మంత్రం విశేషంగా పనిచేస్తుంది. ‘అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నో ప్రచోదయాత్’ ఈ మంత్రాన్ని చంద్ర గాయత్రి మంత్రం అంటారు. అధిక శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఈ చంద్ర గాయత్రి మంత్రం చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.