Padmini Ekadashi 2023 : అధికమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి స్థితిని పద్మినీ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. సాధారణ నెలల్లో వచ్చే ఏకాదశి కన్నా అధికమాసంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే.. అధికమాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. శ్రీమన్నారాయణ మూర్తికి చాలా ప్రీతిపాత్రమైంది. అధికమాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే, ఈ పద్మినీ ఏకాదశి గొప్పతనం గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో కథను పరిశీలించినట్లయితే.. ఒక సమయంలో కార్తవీర్యార్జునుడు అనే పేరు కలిగిన మహారాజు రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుని బంధిస్తాడు.
అప్పుడు, పులస్య మహర్షి కార్తవీర్యార్జునుడి దగ్గరకు వెళ్లి ప్రాధేయపడి రావణాసురుని చర నుంచి విడిపిస్తాడు. అప్పుడు నారద మహర్షి ఎంతో ఆశ్చర్యంతో రావణాసురుడు నవగ్రహాలని శాసించగలడు. ముల్లోకాలను భయపెట్టగలడు. అలాంటి రావణాసురుని కార్తవీర్యార్జునుడు యుద్ధంలో ఓడించటమేంటి, రావణాసురుని బంధించటమేంటి అని నారద మహర్షి ఆశ్చర్యంగా పులస్య మహర్షిని అడుగుతాడు. అప్పుడు పులస్య మహర్షి నారద మహర్షితో ఈ కార్తవీర్యార్జునుడికి సంబంధించి చెబుతాడు. ఈ కార్తవీర్యార్జునుడి తండ్రి పేరు కృతవీర్యాడు. ఆ కృతవీరుడికి వందమంది భార్యలున్నారు. అయినా కూడా సంతానం కలగక పెద్దపెద్ద యజ్ఞాలు చేశాడు.
Padmini Ekadashi 2023 : పద్మిని ఏకాదశి వ్రతం విధానం ఎలా..
అప్పటికి సంతానం కలగకపోవడంతో తన భార్యతో పాటు గంధమాదన పర్వతానికి వెళ్లి 10వేల సంవత్సరాల పాటు తపస్సు ఆచరిస్తాడు. ఈ కృతవీరుడు భార్య పేరు ప్రమాద హరిశ్చంద్రుడి కుమార్తె తన భర్త 10వేల సంవత్సరాల పాటు గంధమాదన పర్వతం మీద తపస్సు ఆచరించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవటంతో కృతవీరుడి భార్య అయిన హరిశ్చంద్రుడి కుమార్తె అయిన ప్రమద సతీ అనసూయ దగ్గరకు వెళ్లి ఏదైనా తరుణో పాయం సెలవు ఇవ్వమని ప్రార్థిస్తుంది. అప్పుడు, సతీ అనసూయ బాగా ఆలోచించి రాబోతున్నది అధికమాసం.. అధికమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పద్మినీ ఏకాదశి అంటారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రతిపాత్రమైనది. ఆరోజు నువ్వు ఏకాదశి వ్రతం చేయాలని చెబుతుంది. దాని వల్ల మీ మనోభీష్ట నెరవేరుతుందని కృతవీరుడి భార్య అయిన ప్రమదతో సతీ అనసూయ చెబుతుంది.

అప్పుడు ప్రమద ఈ అధికమాసంలో పద్మిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తుంది. అంటే.. పగలు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఆ ఏకాదశి వ్రత ఫలితాన్ని మొత్తం కూడా 10 వేల సంవత్సరాలుగా సంతానం కోసం తపస్సు చేస్తున్నటువంటి భర్త అయిన కృతవీరుడికి ఇస్తుంది. అప్పుడు, విష్ణుమూర్తి ప్రత్యక్షమై కృతవీరుడితో ముల్లోకాలను శాసించగలిగే విష్ణుమూర్తితో సమానమైన శక్తి కలిగిన పుత్రుణ్ణి నీకు ప్రసాదిస్తున్నానని అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించడం వల్ల కృతవీరుడికి కార్తవీర్యార్జునుడు అనే శక్తివంతమైన పుత్రుడు జన్మించాడని పులస్య మహర్షి నారద మహర్షికి చెప్తాడు. అంటే.. విష్ణువుతో సమానమైనటువంటి శక్తి కలిగిన పుత్రుడిని విష్ణుమూర్తి అనుగ్రహించాడంటే పద్మిని ఏకాదశి రోజు ఏకాదశి వర్ధన్ చేయటమేనని ఈ కథలో అంతరార్థాన్ని గుర్తించాలి. పద్మినీ ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వర్ధంతి చేస్తారో వాళ్ళకి సంతానం కలగటం మాత్రమే కాదు.
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన సంతానం అమేయ పరాక్రమాలు కలిగిన సంతానం గొప్ప రాజయోగం కలిగేటటువంటి సంతానాన్ని పొందుతారని ఈ పురాణ కథ మనకు తెలియజేస్తోంది. పద్మిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయండి. విష్ణు అనుగ్రహం పొందండి. పద్మిని ఏకాదశి సందర్భంగా రెండు శక్తివంతమైన మంత్రాలను ఇంట్లో దీపారాధన చేశాక 21సార్లు చదువుకోవాలి. ఆ శక్తివంతమైన మంత్రాలు ఏంటో చూద్దాం. మొదటి మంత్రం ‘ఓం పురుషోత్తమాయ నమః’ పురుషోత్తమ మాసం కాబట్టి పురుషోత్తమ నామాన్ని జపించుకోవాలి. రెండవ మంత్రం ద్వాదశరి మంత్రం.. ‘ఓం హ్రీం శ్రీం శ్రీమన్నారాయణ నమః ఈ ద్వాదశాక్షరి మంత్రం కూడా చాలా శక్తివంతమైంది. పద్మినీ ఏకాదశి రోజు ఈ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి.