Before Marriage : ప్రస్తుత రోజుల్లో చాలా మంది పెళ్లి మాటెత్తితే చాలు తెగ భయపడిపోతున్నారు.అది అమ్మాయి కావొచ్చు.. అబ్బాయి కావొచ్చు.. కారణం ప్రస్తుత పరిస్థితులే అని చెప్పుకోవాలి. నేటి యువత పెళ్లికి ముందు ఎంత స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నారో.. పెళ్లయ్యాక కూడా అంతే ఇండిపెండెంట్, ఫ్రీడమ్‌గా జీవించాలని కోరుకుంటున్నారు. అయితే, కొందరు ప్రేమ వివాహం చేసుకుని ఇలాంటి లైఫ్‌ను లీడ్ చేస్తుంటే మరికొందరు మాత్రం లవ్ మ్యారేజ్‌లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెళ్లైన కొన్నాళ్లలోనే ఇద్దరిలో మనస్పర్ధలు పెరిగి విడాకులకు అప్లై చేసుకుంటున్నారు. ఇకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా ఎక్కువ కాలం నిలబడటం లేదు. తమ కూతురు జీవితం సంతోషంగా ఉండాలని లక్షలకు లక్షలకు కట్నం పోస్తున్నారు. అబ్బాయి గురించి ముందు వెనుక ఎంక్వైరీ చేయడం లేదు. దీంతో వివాహం జరిగాక అసలు విషయాలు బయటకు వస్తున్నాయి.

దీంతో అమ్మాయి జీవితం బుగ్గిపాలు కావాల్సి వస్తోంది. అలాగే కొందరు అబ్బాయిల జీవితాలు కూడా పెళ్లిపీటల వరకే సంతోషంగా ఉంటున్నాయి. ఆ తర్వాత వైఫ్ టార్చర్ భరించలేక కొందరు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. అయితే, ఒకప్పుడు మన తల్లిదండ్రుల టైంలో భార్యభర్తలు ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా కలిసే ఉండేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ జాబ్ చేస్తుండటం వలన పంతాలకు పోతున్నారు. ఒకరిపై ఒకరు డామినేట్ చేసుకుంటున్నారు. నువ్వేంత అంటే నువ్వేంత అనేవరకు వెళ్లి మధ్యలోనే వివాహా బంధానికి ముగింపు పలుకుతున్నారు. వీటికి అనేక కారణాలున్నాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నేడు అమ్మాయిల్లో, అబ్బాయిల్లో.. నాదే నడవాలి అనే డామినేషన్ నేచర్ ఉంటుంది. దీని వలన ఎన్నడూ దంపతులు కలిసి ఉండలేదు. అనుమానం, అసూయ, అతిప్రేమ (నాతో తప్పా ఎవరితో మాట్లాడొద్దు అనే గుణం), ఇన్ సెక్యూరిటీ ( భార్య లేదా భర్త.. బయటకు వెళ్లినా, ఎవరితో అయినా ఫోన్ మాట్లాడినా అతిగా భయపడిపోవడం) ఒంటరి జీవితం ( తల్లిదండ్రులు మనతో ఉండొద్దు అనుకోవడం) లగ్జరీ లైఫ్ కావాలనుకోవడం.. అమ్మాయి అయినా, అబ్బాయి ఐనా.. ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం లేకపోవడం, చిన్న దానికే విపరీతంగా కోపం తెచ్చుకోవడం.. ఎక్కడికెళ్లినా నా పక్కనే ఉండాలని కోరుకోవడం (భర్త లేదా భార్య), స్నేహితులు, బంధువులకు దూరంగా ఉండాలని కండిషన్స్ పెట్టడం..
ఈగోలకు పోవడం, మారుతున్న టెస్టులు, ప్రవర్తనా.. పబ్ కల్చర్, రాత్రి జీవితం, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, గౌరవం ఇచ్చుకోకపోవడం.. ఇలాంటి అనేక విషయాల వలన దంపతులు కాంప్రమైజ్ కాలేక విడిపోతున్నారు. నేటి తరం భార్యభర్తలో సర్దుకు పోయే గుణం కేవలం చాలా తక్కువ మందిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే పెళ్లి అంటే చాలా మంది భయపడుతున్నారు.