Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్ తో రైస్ రోటి చపాతి ఎందులోకైనా ఎంతో రుచిగా ఉండే ఆలూ కర్రీ చేయడం. కోసం చిన్న సైజులో ఉండే బంగాళదుంపల్ని తీసుకొని పైన తొక్కలు తీసేయాలి. ఇవి లేనట్లయితే పెద్ద దుంపలు తీసుకునే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవడం. వాడుకోవచ్చు ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత మసాలా లోపల వరకు వెళ్లేలా ఫోర్క్ తో గాట్లు పెట్టుకుని నీళ్లలో బాగా కడిగి ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల ఆవాలు నూనె వేసి కాగిన తర్వాత ఈ దుంపల్ని వేసి ఇవి ఉడికిన తర్వాత చెప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక స్పూన్ ఉప్పు వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి.
ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే నూనె వేసుకోవచ్చు 80% వరకు ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో నాలుగు స్పూన్ల వరకు ఆవాల నూనె వేసి ఇలా పొగ వచ్చే వరకు నూనెను కాదనిచ్చి చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు, నాలుగు లవంగాలు రెండు ఎండుమిర్చి రెండు బిర్యానీ ఆకులు పావు స్పూను జీలకర్ర వేసి ఒకసారి కలిపి నాలుగు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత ఈ కూరకి మెయిన్ ఇంగ్రిడియంట్స్ అయినా వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఏమాత్రం వేగిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇవి మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు సరిగా వేగకపోతే కూర రుచి అంతగా బాగుండదు అని గుర్తుంచుకోవాలి .

ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూన్ పసుపు, తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం, అర స్పూను జీలకర్ర పొడి, రెండు స్పూన్ల ధనియాల, పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు వేగనిచ్చి.. రెండు టమాటాలని నీళ్లలో ఉడికించి గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే నీరంతా పోయేలా కాసేపు వేయించిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపల్ని నాలుగైదు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించి. గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. కూర ఉడికిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. కాబట్టి మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీ ని బట్టి నీళ్లు పోసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపి ఉప్పు కారం చెక్ చేసుకుని మూత పెట్టి మంటలు ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. పది నిమిషాల పాటు కూర ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వేడి వేడి అన్నం రోటి చపాతీ ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఫ్లేవర్ తో ఎంతో రుచిగా ఉండే వర్షాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే వెల్లుల్లి వేసి చేసిన ఈ కూర…