Mirapakaya Bajji : రోడ్ల పక్కన బండి మీద మిర్చి బజ్జి అమ్మడం చూస్తూనే ఉంటాం.. మిర్చి బజ్జిని చూడగానే ఎవరికైనా నోరూరిపోతుంది. ఎంతో రుచికరమైన మిర్చి బజ్జిని వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరబ్బా.. మిర్చి బజ్జిని బయట తినడం కన్నా చక్కగా ఇంట్లోనే తయారుచేసుకుంటే బాగుంటుంది కదా.. అచ్చం బయట బండ్ల మీద దొరికే మిర్చి బజ్జిలానే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇంతకీ ఇంట్లో మిర్చి బజ్జిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మిర్చి బజ్జికి కావలసిన పదార్థాలు.. :
శనగపిండి పావు కేజీ , వాము, తినే సోడా కొంచెం, రుచికి తగినంత ఉప్పు, బజ్జి మిర్చి, చింతపండు, బజ్జి తయారీ విధానం… ముందుగా ఒక బౌల్ లో పావు లీటర్ వాటర్ పోసి అందులో తినే సోడా, రుచికి తగినంత ఉప్పు, మూడు స్పూన్ల వాము, శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చింతపండు, ఉప్పు, వాము వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జి మిరపకాయలు గింజలు తీసివేయాలి చింతపండు పేస్ట్ ను అప్లై చేయాలి.
స్టవ్ వెలిగించి ఒక కళాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి శనగపిండిలో ముంచి బజ్జీలను వేయించుకోవాలి కొద్దిసేపు ఉంచి బజ్జీలను పక్కన పెట్టుకోవాలి బజ్జీలన్నీ చేయడం అయిన తర్వాత మళ్లీ ఆయిల్లో పక్కన పెట్టుకున్న బజ్జీలు మొత్తాన్ని వేసి దోరగా రెండు వైపులా వేయించుకోవాలి. అంతే వేడి వేడి మిర్చి బజ్జి రెడీ…
ఆలు బజ్జి తయారీ విధానం.. :
మిర్చి బజ్జీ లోకి తయారు చేసుకున్న పిండిలో రౌండ్ గా సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు ముంచి వేడిగా ఉన్న ఆయిల్ లో వేసి దోరగా వేయించుకోవాలి. అంతే వేడి వేడి ఆలు బజ్జి రెడీ… మిర్చి బజ్జి కి కలిపిన పిండితో ఆలు, క్యారెట్, తమలపాకు, క్యాలీఫ్లవర్, టమాటో, ఉల్లిపాయ ఎన్నో రకాల టేస్టీ బజ్జీలను తయారు చేసుకోవచ్చు.

పచ్చిశనగపప్పు గారెలు కావలసిన పదార్థాలు.. :
పచ్చిశనగపప్పు, బజ్జి మిరప గింజలు, కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట, రుచికి తగినంత ఉప్పు, డీప్ ఫ్రై సరిపడే నూనె, ఉల్లిపాయ రెండు, కరివేపాకు రెండు రెమ్మలు, తయారీ విధానం.. పచ్చిశనగపప్పును 6,7 గంటలు నానబెట్టుకోవాలి శనగపప్పును మిక్సీ జార్ లో వేసి అరకప్పు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ లోకి పిండి వేసుకొని అందులో పెద్ద సైజు కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిరప గింజలు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో శనగపిండి మూడు టేబుల్ స్పూన్ వేసి కలపాలి ఇలా చేస్తే చాలా క్రిస్పీగా, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయి.
పచ్చిశనగపప్పు గారెలు తయారీ విధానం.. :
స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత గార పిండి తీసుకొని చేతికి కొంచెం వాటర్ అడ్డుకుంటూ గా అరచేతిలో గారచేసి వేడి అయిన ఆయిల్ లో వేసి గారే దోరగా కాకముందే సగంలోని తీసివేసి పక్కన పెట్టుకోవాలి గారెలు మొత్తం అయిన తర్వాత మళ్లీ అన్ని గారెలు వేసి దోరగా వేయించుకోవాలి అలా చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. అంతే ఎంతో రుచికరమైన పచ్చిశనగపప్పు గారెలు రెడీ..
మిర్చి బజ్జి, ఆలు బజ్జీలపై పొడి ... :
ఆంచూర్ పౌడర్ ఒక స్పూన్, ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. మిర్చి బజ్జి పై ఆలు బజ్జి పై ఈ పొడిని చల్లుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది.