Healthy Summer Drink Recipes : ఎండాకాలం ఆరోగ్యానికి చలవనిచ్చే ఫాస్ట్ డ్రింక్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… అద్భుతమైన మీ ఆరోగ్యానికి మంచిమైనా సమ్మర్ డ్రింక్స్.. సమ్మర్ లో హెల్తీ.. అద్భుతమైన నాలుగు డ్రింక్స్.. కీర దోసకాయ తింటే ఎంతో మంచిది అని అందరికీ తెలుసు.. కీర దోసకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఎన్ని వాటర్ తాగినా గాని చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది మజిల్స్ ని స్కిన్, రక్తనాళాలను, హైడ్రేట్ గా ఉంచుతుంది. కీర దోసకాయ ముక్కలు చాలా కష్టంగా తింటారు. చిన్నపిల్లలు అసలే తినరు కాబట్టి కీర దోసకాయతో జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
కీర దోసకాయ జ్యూస్..
ఒక్క కీర దోసకాయ తో నాలుగు గ్లాసుల జ్యూస్ తయారు చేసుకోవచ్చు… ఒక్క గ్లాస్ చూసి నాలుగు వంతు కీర దోసకాయని పొట్టు తీయకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్క, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వాము, రెండు పుదీనా ఆకులు, చిటికెడు ఉప్పు, ఒక టీ స్పూన్ పంచదార లేదా కండ చక్కెర పట్టిక బెల్లం తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్‌లో ఒక క్లాత్ తీసుకొని లేదా జల్లెడ తో వడకట్టాలి. కొంచెం నిమ్మరసం, రెండు ఐస్ క్యూబ్ వేసి కలపాలి.. కీర దోసకాయ జ్యూస్ ఎక్కువ జ్యూస్ చేసుకోవాలంటే వేసుకునే పదార్థాలు ఎక్కువ వేసుకొని తయారు చేసుకోండి. అంతే అండి ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన కీర దోసకాయ జ్యూస్ రెడీ…
బట్టర్ మిల్క్ జ్యూస్..
బట్టర్ మిల్క్ జ్యూస్ తయారీ విధానం.. ఒక గ్లాస్ బట్టర్ మిల్క్ కి ఒక స్పూన్ పెరుగు మిక్సీ జార్ లో వెయ్యాలి చిన్న అల్లం ముక్క, చిన్న ముక్క పచ్చిమిరపకాయ, చిన్న ఉల్లిపాయ ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, రుచికి తగినంత ఉప్పు, ఒక పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర, ఒక గ్లాస్ వాటర్ పోసి గ్రైండ్ చేయాలి.. చాలా పల్చగా చేసుకోవాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతే ఎంతో రుచికరమైన బట్టర్ మిల్క్ డ్రింక్ రెడీ…
బెల్లం డ్రింక్ తయారు చేసుకునే విధానం..
ఒక గ్లాస్ జ్యూస్ కు ఒక మిక్సీ జార్ లో 250 ఎం.ఎల్ వాటర్ తీసుకుని 20 గ్రామ్స్ బెల్లం నిమ్మకాయ సైజు అంత కరగనివ్వాలి బెల్లాన్ని, కొంచెం మిరియాల పొడి, సొంటి పొడి, యాలకుల పొడి, కొంచెం పచ్చ కర్పూరం, చిటికెడు ఉప్పు రుచికి తగినంత కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేయాలి . ఒక గ్లాసులో పోసి రెండు ఐస్ క్యూబ్ లు ఒక స్పూన్ సబ్జా గింజలు..2,3 చుక్కల నిమ్మరసం వేసి కలపాలి అంతే ఎంతో రుచికరమైన బెల్లం డ్రింక్ రెడీ..
పుదీనా జ్యూస్ తయారీ విధానం..
మిక్సీ జార్ లో కొంచెం పుదీనా తీసుకోవాలి అందులో కొంచెం అల్లం, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, చాలా చిన్న ముక్క పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు, ఒక ఆకు తులసి తీసుకొని.. కొన్ని వాటర్ పోసుకొని పుదీనా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసులో పుదీనా జ్యూస్ పోసి అందులో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ తేనె, కొంచెం నిమ్మరసం, టు ఐస్ క్యూబ్స్ వేసి కలపాలి.. అంతే ఎంతో రుచికరమైన పుదీనా డ్రింక్ రెడీ..
గమనిక.. ఏ జ్యూస్‌లో అయినా ఉప్పు కంటే బ్లాక్ సాల్ట్ (Black Salt) వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. పంచదార కంటే పట్టిక బెల్లాన్ని కండ చక్కెర అంటారు. ఇది వాడితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అలాగే సమ్మర్ లో సబ్జా గింజలు ఎక్కువగా తీసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది.. నిమ్మరసంలో సబ్జా గింజలను కలుపుకుని తాగితే ఎండకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా గింజల వాటర్ తాగిన తర్వాత శరీరంలో డీహైడ్రేషన్ అయినప్పుడు.. ఉబ్బిన సబ్జా గింజల నుంచి నీటిని శరీరం గ్రహిస్తుంది. తద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. ఫలితంగా ఎలాంటి వడదెబ్బ తగలకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
Read Also : Jonna Laddu : ఈ జొన్న లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు.. మీ ఆరోగ్యం మీ గుప్పెట్లో ఉన్నట్లే..