Horoscope 2024 : మిథున రాశి ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరం మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో సంవత్సరం లో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో తెలుసుకుందాం. మిధున రాశి వారికి సంవత్సరం లో మాస ఫలితాలు పరిశీలిస్తే.. ఈసంవత్సరం లో చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అద్భుతమైన రాణి ఉంటుంది. ఆదాయానికి లోటు అనేది ఉండదు ఉద్యోగరంగంలో ఉంటే ఉద్యోగ రంగ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంగంలో ఉంటే వ్యాపార అద్భుతంగా సాగుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలని తొలగిపోతాయి. అలాగే సోదరుల సహకారం లభిస్తుంది సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ధైర్యంతో పరాక్రమంతో ఉంటారు మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో దేనినైనా సాధించగలుగుతారు.
గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మిధున రాశి వాళ్ళు ఇల్లు కట్టుకునే ప్రయత్నాలకు సంవత్సరంలో బలం చాలా బాగుంది. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా బండి గానీ కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది నూతన వస్తు ప్రాప్తి నూతన వస్త్రప్రాప్తి ఇవన్నీ కూడా కలుగుతాయి. తీర్థయాత్ర ఫల ప్రాప్తి తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు పనులన్నింటిలో కూడా విజయం లభిస్తుంది. దానివల్ల మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉంటారు.

అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు కూడా బాగా కలిసొస్తాయి ఏదైనా శుభ కార్యక్రమం ఇంట్లో చేయాలనుకుంటే అది దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఉద్యోగ పరంగా మంచి ప్రమోషన్లు పొందే యోగం ఎక్కువగా ఉంది అలాగే సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి ఏ పని ప్రారంభించిన పనులు అఖండ విజయ ప్రాప్తిని సిద్ధింప చేసుకుంటారు. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆందోళనలు తొలగిపోతాయి.
భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన కూడా పెరుగుతుంది మొత్తం మీద పరిశీలిస్తే మిధున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం లాగా ఉంది. సమస్యలు ఏవి లేకుండా ముందుకు దూసుకు వెళ్లిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం మీకు కలిసొచ్చేటటువంటి తేదీలు 27, 14, 16, 17, 23, 24, 25, 29 ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు 4, 5, 9, 11, 19, 20, 21, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పని చేయండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలంటే ప్రతిరోజు సంఘటనాశక గణేశ స్తోత్రం చదవటం లేదా వింటం చేయండి. ఓం గమ్ గణపతయే నమః రోజు స్నానం చేశాక 20 సార్లు చదువుకోండి గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి ఇంకా అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు.
Read Also : Astrology Remedies : శనివారం నాడు ఈ రాశుల వారు ఇలా పూజిస్తే సకల శని దోషాలు తొలగిపోతాయి..!