Yoga Health Benefits : ఇటీవల కాలంలో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, మందులు వాడినా ఫలితం ఉండటం లేదు. దీంతో చాలా మంది ఈ దీర్ఘకాలికవ్యాధుల నుంచి ఎలా బయటపడాలో తెలీక సతమతమవుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత వచ్చే రోగాలు, ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల వయస్సులో వారికే వస్తున్నాయి. అందుకు ప్రస్తుత ఆహార అలవాట్లు, సరిగా నిద్రలేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి కారణంగా తెలుస్తోంది.
వయస్సు మీద పడ్డాక రావాల్సిన కీళ్ల నొప్పులు ప్రస్తుతం 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వారికి కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు గుండె జబ్బులు,హైబీపీ, డయాబెటిస్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల వస్తున్నాయి. అయితే, ప్రతీసారి ఆస్పత్రులకు తిరిగే కంటే కొన్ని యోగాసనాల ద్వారా ఈ దీర్ఘకాలిక జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చని తెలుస్తోంది. అవెంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా యోగాలో చాలా ఆసనాలు, వ్యాయామాలు ఉంటాయి. వీటి వలన శరీరంలోని ఒక్కో అవయవానికి మేలు జరుగుతుంది. కొందరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు యోగాసనాలు వేస్తుంటారు. యోగాను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి తగ్గుడమే కాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది.లాఫింగ్ థెరపీ వలన ఒత్తిడిని కల్గించే హార్మోన్లు తగ్గుముఖం పట్టి రోగనిరోధక కణాలు పెరుగుతాయి. అంతేకాకుండా లింఫోసైట్స్ కూడా శరీరంలో అధికంగా ఉత్పన్నమవుతాయి. రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అయి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి పోరాడుతుంది.
అంతేకాకుండా మాససిక ప్రశాంతత కలుగుంది. డిప్రెషన్ తగ్గుతుంది. ఎల్లప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. గుండె జబ్బులు, బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి. అయితే, ఒకప్పుడు జనాలు యోగాకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకున్నా, ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు తమ జీవితంలో యోగాను భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా అధిక బరువు, థైరాయిడ్, గుండెజబ్జులతో బాధపడేవారు వాకింగ్, యోగాను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది
Read Also : Yoga Benefits in Telugu : ఈ యోగాసనాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెంచుకోవచ్చు తెలుసా?