Mask during workouts : సాధారణంగా వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోరు. కానీ కొవిడ్ మహమ్మారి కారణంగా ఎక్కడకు వెళ్లినా మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కొందరు ఉదయం జాగింగ్ కు వెళ్లేటప్పుడు లేదా ఇంట్లో వ్యాయామం చేసేటపుడు మాస్క్ పెట్టుకుని ఉండటం గమనించే ఉంటాం. అయితే, మాస్క్ ధరించి వ్యాయామం చేస్తే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లేదా గుండె వేగం పెరగడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ వచ్చునని కొందరు అనుమానం వ్యక్తంచేస్తు్న్నారు. అలాంటి వారి సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

N-95 సర్జికల్ మాస్క్ ధరించి వ్యాయామం చేసినా, శరీరంలో టెంపరేచర్‌ని లేదా హార్ట్ బీట్‌ను పెంచదని తేలింది. 60 నిమిషాల పాటు వాకింగ్ లేదా జాగింగ్ చేయడం వలన బాడీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. వ్యాయామం అనంతరం బయట ఉండే హ్యూమిడిటీని, మాస్క్ లోపల ఉన్న హ్యూమిడిటీని కూడా పరిశీలించగా.. మాస్క్ ధరించి ఎక్సర్‌సైజ్ చేయడం వలన బ్రీతింగ్ తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది.అంతేకానీ బాడీలో వేడిశాతం ఏమాత్రం పెరగలేదు.దీని ప్రకారం మాస్కు ధరించి వ్యాయామం చేసినా పెద్దగా ఏమీ ఇబ్బందులు ఉండవని తేల్చారు నిపుణులు..
మాస్క్ ఎందుంకంటే కరోనా మహమ్మారి సోకి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, మాస్క్ అనేది ఎవరికోసమే కాకుండా మన సేఫ్టీ కోసం ధరించాలి. అది కూడా పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నాం.. అన్నట్టు కాకుండా పూర్తిగా నోరు, ముక్కు కవర్ అయ్యేలా ధరించాలి. చాలా మంది ముక్కు మొత్తం కవర్ కాకుండా మాస్క్ ధరిస్తున్నారు. అలా చేయడం వలన మీకే కాదు, మీ ఇంట్లోని వారికి కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టే.. అందుకంటే కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా వెళ్లలేదని గుర్తుంచుకోండి..
Read Also : Walking For Health : నడక మంచిది.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?