Walking For Health : నడక విషయంలో చాలా మంది భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అనేక అనుమానాలను సైతం కలిగి ఉంటారు. ప్రతి రోజూ ఎంత దూరం నడిస్తే ఆరోగ్యానికి మంచిదనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. మరి ఎంత దూరం నడవాలి? రోజుకు ఎన్ని అడుగులు వేస్తే మంచిది అనే విషయాలు తెలుసుకుందాం. మనం హెల్దీగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారం ఒక విధంగా మెయిన్ రోల్ పోషిస్తే, నడక సైతం అందుకు హెల్ప్ చేస్తుంది.
దానితో పాటు ఒత్తిడికి చాలా దూరంగా ఉండాలి. ఇందుకు తోడు నిద్ర, వ్యాయామం సైతం చాలా హెల్ప్ అవుతాయి. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ అధ్యయనంలో రోజుకు 10 వేల అడుగులు నడిస్తే చాలా మంచిదని తేలింది. అయితే ఈ స మాచారం ప్రకారం మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. రోజుకు తక్కువలో తక్కువ ప్రతి రోజూ 7వేల అడుగులు వేస్తే హెల్త్‌కు మంచిదని తెలుస్తోంది.

10 వేల అడుగుల కంటే ఎక్కువగా నడిచినా, వేగంగా నడిచినా పెద్దగా యూజ్ ఉండదని డాక్టర్స్ చెబుతున్నారు. 7వేల నుంచి 10 వేల మధ్య అడుగులు వేడయం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, దీని వల్ల మోర్టాలిటీ రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు. 10 వేల అడుగుల కంటే ఎక్కువ నడిచిన వారిలో ఎలాంటి యూజ్ కనిపించలేదు. అయితే 4 వేల అడుగుల నుంచి 5 వేల అడుగులు నడిచిన వారిలో కాస్త బెటర్ కనిపించింది. 5 వేల నుంచి 6 వేల అడుగులు నడిచే వారిలో ఇంక్రిమెంటల్ రిస్క్ రిడక్షన్ తగ్గుతుంది. ఇవి కేవలం అవగాహన కోసమ మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని విషయాల్లో డాకర్ల సలహాలు పాటించడం ఉత్తమం.