Pomegranate Benefits : నేటి రోజుల్లో అనేక మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా అనేక రకాలుగా అనారోగ్యం పాలు కావడానికి మన జీవన విధానమే కారణమని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది వ్యక్తులు తమ జీవన విధానాన్ని మార్చుకునేందుకు ప్రయత్నించినా కానీ మార్చుకోలేకపోతున్నారు. ఇలా మనం ఎప్పుడైనా సరే జబ్బు పడ్డపుడు తప్పకుండా పండ్లను తింటాం. ఇలా పండ్లను తీసుకునే సమయంలో దానిమ్మను తప్పనిసరిగా తీసుకోవాలట.
ఎందుకంటే దానిమ్మ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. పలు రకాల ఇతర పోషక విలువలు కలిగిన పండ్లతో పోల్చి చూస్తే.. దానిమ్మ పండులో పోషక విలువలు అధింగా ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు. ఈ పండులో 7 గ్రాములు ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 30 శాతం సీ విటమిన్, 16 శాతం ఫోలేట్, 12 శాతం పొటాషియం ఉంటాయి. కావున ఈ పండును తప్పకుండా తినాలని సూచిస్తున్నారు. కప్పు పరిమాణంలో దానిమ్మ పండు గింజలను తీసి.. వాటిని ప్రతిరోజూ తినడం ద్వారా 24 గ్రాముల వరకు చక్కెర, 144 కేలరీల వరకు శక్తిని పొందవచ్చు. దానిమ్మ పండు గింజలను తినడం ద్వారా అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ కారణం వలన మనకు మధుమేహం ఊబకాయం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ , అల్జీమర్స్ వంటి ప్రాణాంతక వ్యాధులతో కూడా పోరాటం చేసే సామర్థ్యాన్ని మనలో దానిమ్మ గింజలు పెంపొందిస్తాయి. చలికాలంలో దానిమ్మ పండును తీసుకోవడం వలన చాలా మంచిది. ఇది మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దానిమ్మలో ఏ, ఈ, సీ విటమిన్లు అధికంగా ఉంటాయి.
కావున ఇవి అర్థరైటిస్ సమస్య మనకు ఉత్పన్నం కాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు మన రక్తనాళాల్లో కొవ్వును పేరుకుపోకుండా చేస్తాయి. ఇలా చేయడం వలన మనకు అధిక జ్ఞాపక శక్తి వస్తుంది. సర్జరీ అయిన రోగులకు దానిమ్మ పళ్లను ఇవ్వడం చాలా మంచిది.
Read Also : Peepul Tree : ఇంట్లో రావి చెట్టును అస్సలు పెంచకూడదట.. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!