Peepul Tree : సాధారణంగా కొందరికి మొక్కలు, చెట్లు అంటే చాలా ఇష్టం. వీరు పర్యావరణ ప్రేమికులు అయి ఉంటారు. అందుకే ఇంటి చుట్టుపక్కల, ఇంటి ముందు లేదా పెరట్లో తమకు నచ్చిన పూలు, పండ్ల మొక్కలను పెంచుతుంటారు.మరికొందరు మాత్రం ఆయుర్వేద మొక్కలను పెంచుతుంటారు. వీరికి ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త ఉండి ఉంటుంది. ఇంకొందరు మాత్రం ఇంట్లో దైవ స్వరూపమైన మొక్కలను పెంచుతుంటారు. వీరికి దైవం, దైవత్వం అంటే చాలా నమ్మకం కలిగి ఉంటారు. మన ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లోని వారు, చుట్టుపక్కల వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యం బారిన తక్కువ పడుతుంటారు. కారణం వీరి ఇంట్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది.
అయితే, కొందరు పూల మొక్కలు అంటే చాలా ఇష్డపడుతుంటారు. మంచి సువాసన కలిగే మొక్కలను ఇంటి చుట్టూ పెట్టుకుంటారు. మంచి సువాసన వచ్చే పూల చెట్లు పెట్టుకుంటే ఆరోగ్యంతో పాటు మైండ్ కూడా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తుంటాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు దరిచేరవు.కొందరు కేవలం పాజిటివ్ వైబ్రేషన్ కలిగించే మొక్కలను కూడా పరిసరాల్లో పెంచుకుంటున్నారు. మరికొంతమంది షో కేస్ చెట్లు కూడా ఇంట్లో ఉండేలా చూసుకుంటారు.
ఇకపోతే మనం దైవంగా కొలిచే తులసి, బిలపత్రి లాంటి మొక్కలను కూడా కొందరు పెంచుకుంటుంటారు. అయితే, ఆలయాల్లో ఉండే రావిని మాత్రం ఇంట్లో అస్సలు పెంచకూడదట.. ఇది భారీ ఆకారంలో పెరుగుతుంది. తద్వారా మన ఇంటిని మొత్తం కప్పేస్తుంది. లైటింగ్ ఇంట్లోకి రాదు. చీకటి వలన మానసిక రుగ్మతలు కలుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ కంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడూ గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని వేర్లు ఇంట్లోకి కూడా చొచ్చుకు వస్తాయి. దీంతో ఇల్లు డామేజ్ అవుతుంది. అందువల్లే రావి చెట్టును ఇంట్లో నాటకూడదు. ఒకవేళ పెరిగితే వేళ్లతో సహా పీకి వేరే చోట నాటుకోవాలి.
Read Also : Stevia Leaves Uses : షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ స్టీవియా ఆకుల అద్బుత ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే!