Mint Leaves : మనలో చాలా మందికి పుదీనకు సంబంధించిన ఉపయోగాల గురించి తెలియవు. కేవలం రుచి కోసం కూరల్లో దీని వాడుతుంటారు. కానీ పలు ప్రాల్లమ్స్‌కు పుదీనతో ఎంతో ఉపయోగపడుతుంది. కాస్త నీరసం అనిపించినప్పుడు, లేదా జలుబుతో బాధపడుతున్నప్పుడు దీనిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి పుదీనతో కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం..
పుదీన మనకు అన్ని సీజన్లలో దొరుకుతుంది. దీనిని ఉపయోగించి పలు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కావున దీనిని ఎప్పుడైనా వాడొచ్చు. గొంతునొప్పి, జలుబుతో బాధపడుతున్న వారికి ఇలా చాలా ఉపయోగపడుతుంది. వర్షకాలంలో పుదీనతో చాయ్ చేసుకొని వేడిగా తాగితే రిలీఫ్‌గా అనిపిస్తుంది. వేసవిలో పుదీనతో మోజిటో చేసుకున్నట్టయితే చాలా రెఫ్రెషింగ్‌గా ఉండొచ్చు. ఇలా పుదీనతో మనకు నచ్చిన వాటిని చేసుకుని పలు రకాల సమస్యలకు సులువుగా చెక్ పెట్టొచ్చు. పుదీనలో చాలా ఎక్కువగా ఉంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్‌లమేటరీ గుణాలు చాలా సమస్యలను తగ్గించేందుకు దోహదపడతాయి. గ్యాస్ , బ్లోటింగ్, తదితర ప్రాల్లమ్స్‌ను పుదీన తగ్గిస్తుంది. దీనితో పాటు జీర్ణక్రియ మెరుగ్గా జరిగేందుకు ఉపయోగపడుతుంది. తలనొప్పితో బాధపడుతున్న వారు దీనిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
చెడుశ్వాసతో బాధపడే వారు పుదీన ఆకులను నమిలితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వచ్చే సమస్యలనూ దీనితో పూర్తిగా తగ్గించుకోవచ్చు. వికారంగా అనిపించినప్పుడు పుదీన తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆస్తమాను తగ్గించడంలోనూ పుదీన సహాయపడుతుంది. దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు పుదీనతో దానికి చెక్ పెట్టొచ్చు. పుదీనాలో మెంథాల్ ఉంటుంది. ఇది కూలింగ్ ఎఫెక్టును ఇస్తుంది. గొంతు సమస్యతో బాధపడేవారికి ఇది చక్కని రిలీఫ్‌ను ఇస్తుంది. జ్వరంను తగ్గించడంలో సైతం పుదీన ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల కొవ్వున సైతం కరిగించుకోవచ్చు. చర్మానికి సంబంధించిన సమస్యలు, దురద వంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారు దీనిని ఉపయోగించి వాటి నుంచి బయటపడొచ్చు.
గ్లాసు నీటిలో 7 నుంచి 10 పుదీనా ఆకులు వేసి… 5 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని తాగితే శరీరంలోని పలు వ్యాధులను నివారించవచ్చు. ఉదయాన్నే దీనిని తీసుకున్నట్టయితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే రెగ్యులర్‌గా ఈ పద్ధతులు పాటించడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. పుదీనాను తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే పలు సమస్యలను ఎదుర్కొవచ్చని ఆయుర్వేద నిపుణలు చెబుతున్నారు. పుదీన తినడం వల్ల శరీరానికి విటమిన్-ఏ కూడా అందుతుంది.
దీనివల్ల కంటి చూపు సమస్యలను తగ్గించేందుకు పుదీన సహాయపడుతుంది. పుదీనలో ఉంటే ముఖ్యలక్షణం శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడం. అందుకే వంటకాల్లో పుదీన ఆకులను వేస్తారు. పుదీన తింటే అలెర్జీ సమస్యల నుంచి బయటపడొచ్చు. మన దేశంలో వంటకాల్లో పుదీనను ఎక్కువగా ఉపయోగిస్తారు. కడుపునొప్పితో బాధపడేవారు పుదీన ఆకులను తినడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వారు పుదీనతో వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. పలు రకాలైన ఫుడ్ తీసుకునే వారిలో అలెర్జీ సమస్య తలెత్తుతుంది. వారు పుదీనను తరచూ తింటే ఈ సమస్య తగ్గుతుంది.
పుదీన తరచుగా తింటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. పుదీనను చాలా వరకు కాస్మొటిక్స్ కంపెనీస్ ఉపయోగిస్తాయి. పుదీన ఆకుల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటంతో పాటు కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయని నిపుణుల అభిప్రాయం. క్రమం తప్పకుండా పుదీనను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. అలాగని పుదీనను ఎక్కువగా తీసుకుంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వాయు మార్గాలలో మంటగా అనిపించే అవకాశముంది. తలనొప్పితో బాధపడే వారు పుదీనతో దానికి చెక్ పెట్టొచ్చు. పుదీననను సుగంధ ద్రవ్యాలు తయారు చేయడంలోనూ వాడతారు. చర్మం మీద ఉన్న మొటిమలను పుదీన ద్వారా నివారించొచ్చు. దీనితో పాటు చర్మం ప్రకాశమంతంగా మారుతుంది. పుదీనను నమిలటం వలన నోటితో పాటు పళ్లు(దంతాలు) సైతం ఆరోగ్యంగా, పటిష్టంగా మారుతాయి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు బరువును సైతం తగ్గించడంలో సహాయపడుతుంది.
జలుబు వల్ల గాలి పీలచ్చుకునే సమయంలో ఏర్పడే ఇబ్బందులను నివారించేందుకు పుదీన సహాయపడుతుంది. జలుబు వల్ల ముక్కు కారితే 3 నుంచి 4 చుక్కల పుదీన ఆకు రసం ముక్కులో వేసుకుంటే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. గర్భిణులు పుదీన ఆకులు తినడం, వాసన చూడటం వంటివి చేయడం వల్ల ఉపయోగం కలుగుతుంది. పుదీనతో కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారుగా.. వంటకాల్లో వేసిన పుదీన ఆకులను తినేందుకు కొందరు ఇష్టపడరు. వాటిని అందులోంచి తీసేసి పక్కనబెడుతుంటారు. మరి ఈ ఉపయోగాలు తెలిశాక వారు వాటిని పక్కనపెట్టే చాన్సే ఉండదు. మీకు సైతం పుదీన తినే అలావాటు లేకుంటే దాని ఉపయోగాలు తెలుసుకున్నాక తినకుండా ఉండలేరు. ప్రతి రోజు దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మరిన్ని ఆరోగ్య పరంగా ఎంతో మేలైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే మీకు చెప్పినవి. ఇలాంటి చేసేముందు వైద్యులను ఒక సారి సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Read Also : Romance Risk Cancer : ఎక్కువసార్లు శృంగారం చేస్తే క్యాన్సర్ వస్తుందా…? ఇందులో నిజమెంత?