Romance Risk Cancer : శృంగారం.. ఇది కూడా మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమే. దీనికి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొంత మంది మాత్రం వీలైనంత ఎక్కువగా శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, ఇలా దీర్ఘకాలికంగా ఎక్కువ సార్లు పాల్గొంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కొందరు తమ కామ కోర్కెలను తీర్చుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. మరి కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటారు. ఇలా చేయడం వల్ల అనేక ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. అనేక సుఖ వ్యాధులు సైతం సోకి ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. కొందరు తమ కోరికలను అదుపులో ఉంచుకుంటారు. మరి కొందరు కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకొందరు కంట్రోల్ చేసుకోలేరు. ఇలా అనేక మంది సెక్స్ కోరికతో ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే ఇలాంటి సమయాల్లో చాలా మంది అనేక రకాలైన ఇన్‌ఫెక్షన్లకు, సుఖ వ్యాధులకు గురవుతుంటారు. వాటిని పట్టించుకోకోవడం వల్ల అవి ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి. వాటిని మొదటి దశలోనే గుర్తిస్తే నివారించేందుకు అనేక పద్దతులను పాటిస్తూ చికిత్స తీసుకోవచ్చు. తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం మన దేశంలో 18.3 శాతం మంది మహిళలు సర్వికల్ క్యాన్సర్‌కు గురవుతున్నారు. ఇది సెక్స్ కణాల్లో వస్తుందని చెబుతున్నారు వైద్యులు. వాస్తవానికి ఈ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒక వేళ వచ్చినా వీలైనంత తొందరగానే దాన్ని పసిగడితే వైద్యం అందించడం ఈజీ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కామన్‌గా వచ్చే క్యాన్సర్లలో సర్వికల్‌ది నాల్గో స్థానం. భారత్‌లో సర్వికల్‌క్యాన్సర్ స్క్రీనింగ్‌టెస్టు గురించి అవగాహన తక్కువగా ఉంది. 30 నుంచి 49 ఏండ్ల మధ్య వయసున్న స్త్రీలలో కేవలం 30 శాతం మంది మాత్రమే స్క్రీనింగ్ చేయించుకుంటున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దీని గురించి తెలిసిన వారు చాలా తక్కువే. ఇలాంటి ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఇది సోకే విధానాలను, సోకితే కనిపించే లక్షణాలను తెలుసుకుందాం..

హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇంఫెక్షన్ అనేది సెక్స్ ద్వారా సోకుతుంది. బ్లీడింగ్‌లో తేడా ఉన్నా.. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత స్పాటింగ్ ఉన్నా.. మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ కనిపించినా.. యోని స్రావాలు వాసనతో ఉన్నా, కడుపులోనూ, వీపు కింద భాగంలోనూ అసౌకర్యంగా అనిపించిన వెంటనే డాక్టరును సంప్రదించాలి. స్మోకింగ్ చేసే స్త్రీలలో ఈ క్యాన్సర్ అటాక్ అయ్యే చాన్స్ ఎక్కవ. స్మోకింగ్ చేయడం వల్ల బాడీలోపల సర్వికల్ మ్యూకస్‌ను పొగ క్రియేట్ చేస్తుంది. దీని వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్ మనిషి బాడీలో ఇమ్యూనిటీ శక్తిని బలహీనం చేస్తుంది. రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉంటే క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తూ.. వాటి పెరుగుదలను అడ్డుకుంటుంది. బర్త్ కంటోల్ పిల్స్‌ను చాలా కాలంపాటు తీసుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కవ మందితో సెక్స్ చేసే మహిళల్లో ఈ క్యాన్సర్ సంభవించే చాన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొంటే వెజైనల్‌హెల్త్ దెబ్బతింటుంది.
పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఒక వేళ వచ్చినా.. కొద్ది రోజుల్లోనే దానిని గుర్తించి చికిత్స తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు. భారత దేశంలో ఇలాంటి టాపిక్స్ గురించి బహిరంగంగా మాట్లాడుకోరు. మాట్లాడుకున్నా డిస్కషన్ చేయడం చాలా తక్కువ. అందుకే ఈ విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. అవగాహనాలోపం, క్యాన్సర్ ఉందేమో అన్న భయంతో అనేక మంది టెస్టు చేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేయరు. ఇలా వెనకుడగు వేయడం, లేదా భయపడి టెస్టు చేయించుకోకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రమాదం కలిగించే చాన్స్ ఉంటుంది. కాబట్టి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ టెస్లు చేయించుకోవాలి. టెస్టు చేయించుకోకపోవడానికి పేదరికమూ ఒక కారణంగా చెప్పొచ్చు. స్క్రీనింగ్ టెస్టులు పెరిగి ఈ వ్యాధిని తర్వగా కనుక్కుంటే దాని నుంచి బయట పడటం చాలా ఈజీ. అందుకే ఏ చిన్న అనుమానం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచింది.
ఎలాంటి భయం లేకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలి లేదంటే వ్యాధి ముదిరితే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి దీనిపై అస్సలు అవగాహన లేదు. కాబట్టి వారు ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. ప్రస్తుతం కాలంలో చాలా మంది వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి అలాంటి పద్దతులను మానుకోవడమే ఉత్తమం. లేదంటే ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాం. పైన చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. వారి సలహాలు, సూచనలు పాటించాలి. దాని వల్ల శరీరంలో ఇబ్బంది కలిగించే వ్యాధి ఏంటి? ఏ వైరస్ దాడి చేసింది అనే విషయాలను తెలుసుకోవచ్చు.
Read Also : Homemade ayurvedic drink : ఈ ఆయుర్వేద మూలికలతో తీవ్రమైన గ్యాస్ సమస్యలు నయం..