Jackfruit Benefits : మధుమేహం (డయాబెటిస్) ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధుమేహం వలన చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థే స్వయంగా వెల్లడించింది. మధు మేహం అనేది 21వ శతాబ్దపు అత్యంత దీర్ఘకాలిక వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఇలా మధుమేహం వచ్చిన వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయం గురించి అనేక మంది అనేక విధాలుగా సలహాలు ఇస్తున్నారు. అసలు ఏం ఆహారాలు తీసుకోవాలనే విషయం గురించి ఒక్క సారి చూస్తే..
మనకు విరివిగా లభించే జాక్ ఫ్రూట్ (పనస పండు) ను తీసుకోవడం వలన మధుమేహం కంట్రోల్ లోకి వస్తుందని చాలా మంది వైద్యులు చెబుతున్నారు. పనసపండును పచ్చిగా ఉన్నపుడు మాత్రమే కాకుండా పండుగా మారిన తర్వాత కూడా తింటారు. ఇక ఈ పండులో ఏం ఉంటాయనే విషయాలను ఒక్క సారి మనం గమనిస్తే..
జాక్ ఫ్రూట్ లో మనకు ఎన్నో విటమిన్లు, స్టెరాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మనకు అస్థిర ఆమ్లాలు కూడా లభిస్తాయి. ఫ్లేవనియిడ్లు, స్టెరాల్స్, కెరోటినాయిడ్స్, టానిన్లు వంటివి ఇందులో మనకు లభిస్తాయి. ఈ జాక్ ఫ్రూట్ లో ఇతర ఫినోలిక్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇందులో నీరు (73.5 గ్రా), శక్తి (397 కిలోలు), ప్రోటీన్ (1.72 గ్రా), ఫైబర్ (1.5 గ్రా), కాల్షియం (24 మి. గ్రా), మెగ్నీషియం (29) వంటి పోషకాలు ఉంటాయి.
ఇవే కాకుండా ఇతర పోషకాలు కూడా విరివిగా ఉంటాయి. జాక్ ఫ్రూట్ ను తినడం వలన మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ల వలన రోగ నిరోధక శక్తి అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగా పెరుగుతుంది.
Read Also : Food Diet For Romance : రొమాన్స్‌లో రెచ్చిపోవాలంటే ఈ ఫుడ్ తప్పనిసరిగా తినాల్సిందే!