Food At Wrong Time : ఆహారం తినేటప్పుడు మీరు చేస్తున్న తప్పులివే!

Food At Wrong Time : ఆరోగ్యమే మహాభాగ్యమంటారు.. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లుఎక్కువగా దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. కానీ, చాలామంది జంక్ ఫుడ్ ఎక్కువగా లాగిస్తుంటారు. జంక్ ఫుడ్ తినడం మానేయాలి. అది కూడా ఎప్పుడూ పడితే అప్పుడు తినకూడదు.

సరైన సమయానికి ఆహారం తినే అలవాటు చేసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. మీరు తినే ఆహారంలో అనేక పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. వేళకు భోజనం చేయని వారిలో జీర్ణసంబంధిత సమస్యలు అధికంగా వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఆహారాన్ని సరైన సమయానికి తినడం ద్వారా శరీరం దానికి అనుగుణంగా రెడీ అవుతుంది. ప్రతిరోజు అదే వేళకు ఆహారం తినేవారిలో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఫలితంగా జీర్ణసంబంధిత సమస్యలు అధికంగా వస్తున్నాయి. అసిడిటీ, గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరం వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఆహారం తినే సమయంలో చాలామంది అనేక పొరపాట్లు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ తప్పులు చేయొద్దని పోషక నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం.

ఇవి అసలే చేయొద్దు :
చాలామంది వేళకు తిండి తినరు. ఫలితంగా అసిడిటీ ఫామ్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువసేపు తినకుండా ఉంటారు. ఏమి తినకుండా ఖాళీ కడుపుతో
మాత్రం ఉండద్దని నిపుణులు సూచిస్తున్నారు. టైంకు తినాలి. ప్రతిరోజు ఒకేసమాయంలో ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ మంది మీల్స్ స్కిప్ చేయడం చేస్తుంటారు. ఈ విషయంలో అసలే తప్పు చేయొద్దని సూచిస్తున్నారు.

తియ్యనైనా శీతల పానియాలు తాగొద్దు :
ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తియ్యగా ఉండే కూల్ డ్రింక్స్ జోలికి పోకపోవడమే ఉత్తమం. ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం ద్వారా శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే సమస్య ఉందని
నిపుణులు చెబుతున్నారు.

ప్రోటీన్ తీసుకుంటుండాలి:
ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లతో కూడిన అల్ఫాహరారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో జీవించవచ్చు. ప్రోటీన్ అల్పాహారం తీసుకోనేవారిలో ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అందుకే
అల్పాహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉండేలా చేసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎక్కువగా కూరగాయాలనే తినాలి.

స్పీడ్‌గా ఆహారం తినొద్దు :
వేగంగా ఆహారాన్ని తీసుకోవద్దు. అలా తొందరగా ఆహారం తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని గుర్తించాలి. జంక్ ఫుడ్స్, అప్పటికప్పడూ తయారుచేసుకుని ఫుడ్స్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఏదైనా
తినేటప్పుడు ఆహారాన్ని నెమ్మదిగా నములుతూ తినాలి వేగంగా తినడం అనేది మంచి ప్రక్రయ కాదని తేలింది. నిత్యం 6నుంచి 8 గ్లాసుల మంచి నీళ్లు తాగాలి. అప్పుడే శరీరానికి తగినంత నీరు అందుతుంది.
ఎప్పడూ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి.
Mouth Ulcers Remedy : నోటి అల్సర్లతో తస్మాత్ జాగ్రత్త.. ఈ చిట్కాలతో క్షణాల్లో తగ్గించుకోవచ్చు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Leave a Comment