Eating Gaggery : భారతీయ వంటకాల్లో బెల్లంకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైన.. పండగైన పబ్బమైన బెల్లంతో చేసిన తీపి పదార్థాలు వండాల్సిందే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాక ప్రతి ఇంటి వంటగదిలో బెల్లం తప్పక ఉండాల్సిందే. బెల్లంతో అనేక రకాల పిండివంటలు చేస్తారు. సంక్రాంతి, ఉగాది, దసరా ఇలా ప్రతి పండగ రోజు బెల్లంతోనే వంటలు చేస్తారు.
ఆయుర్వేద వైద్యశాస్త్రంలోనూ బెల్లంకు ప్రత్యేక స్థానం ఉంది. బెల్లాన్ని అనేక రకాల మందులలో వినియోగిస్తారు. ఇక మనం రోజు వాడే చెక్కెర కంటే బెల్లంతోనే ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతుంటారు. దీంతో ఇటీవల చెక్కెర కంటే బెల్లం వినియోగం పెరిగింది. అయితే ఏదైనా అధికంగా వాడితే ఆరోగ్యానికి కీడు చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది బెల్లానికి కూడా వర్తిస్తుంది.

బెల్లాన్ని అధికంగా వినియోగిస్తే.. ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ప్రధానంగా బెల్లం అధికంగా వినియోగిస్తే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో గ్లూకోజ్, ప్రక్టోజ్, కొవ్వులు, ప్రొటీన్లు ఉంటాయి. అయితే బెల్లాన్ని పరిమితంగానే తింటే మంచింది. కానీ, ఎక్కువ మొత్తంలో తీసుకుంటే బరువు పెరిగి మధుమేహానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
షుగర్ వ్యాధి ఉన్నవారు చెక్కెరకు బదులు బెల్లాన్ని తీసుకోవాలని వైద్యులు సాధారణంగా సూచిస్తుంటారు. అయితే బెల్లాన్ని అధికంగా తింటే మాత్రం రక్తంలో షుగర్ లెవల్స్ భారీగా పెరుగుతాయని దీంతో మొదటికే మోసం జరుగుతుందని అంటున్నారు నిపుణులు. దీన్ని బట్టి ఏ పదార్థానైనా అతిగా తింటే అనారోగ్యం…మితంగా తింటే ఆరోగ్యం అన్న విషయం అవగతమవుతోంది.
Read Also : Romance Risk Cancer : ఎక్కువసార్లు శృంగారం చేస్తే క్యాన్సర్ వస్తుందా…? ఇందులో నిజమెంత?