Diabetics Control Tips : ప్రస్తుత సమాజంలో చాలా మంది షుగర్ వ్యాధి (మధుమేహం)తో బాధపడుతున్నారు. క్రమంగా ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక రకాలైన కారణాలున్నాయి. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, సరిగా నిద్రలేకపోవడం, పని ఒత్తిడి, డిప్రెషన్, రాత్రంతా మేల్కొని పని చేయడం, విటమిన్లు, ప్రోటీన్లు లేని ఆహారం తీసుకోవడం వలన చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వైద్యులు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల, తీసుకునే ఆహారం పట్ల ఏమాత్రం అశ్రద్ధ కనిబరిచినా మీ సంపాదన మొత్తం హాస్పిటల్ బిల్స్‌కే సరిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మన ఇళ్లల్లో పెద్దలు, ముసలివాళ్లు డయాబెటీస్ వ్యాధితో బాధపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ శరీరంలో షుగర్ లెవల్స్ ఎంత మోతాదులో ఉన్నాయో తరచూ చెక్ చేసుకుంటుండాలి. లేనియెడల ఏ క్షణమైన ప్రమాదం ముంచుకురావొచ్చు. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగినా తగ్గినా ప్రమాదమే. అది కాస్త రక్తంలో కలిసిపోతే మన శరీరం మీద పట్టుకోల్పోతాము. ఎప్పుడూ కళ్లు తిరుగుతుంటాయి. ఇటువంటి వ్యక్తులు ఇన్సులిన్ తీసుకుంటుండాలి. టైంకు ఇన్సులిన్ తీసుకోకపోయినా, వైద్యులు సూచించిన మెడిసిన్ వాడకపోయినా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా ‘సోయాబీన్’ చాలా మంచి చేస్తుంది.
సోయాబీన్స్ తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. శరీరంలో అధిక ఇన్సులిన్ లోపం లేదా జీవక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. సోయా తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. మన బాడీలో ఫైబర్ కంటెంట్ తప్పకుండా ఉండాలి. 100 గ్రాముల సోయాబీన్ తింటే 9.3 గ్రాముల మేర ఫైబర్ శక్తినిస్తుంది. ఇది బ్రౌన్ రౌస్ కంటే మంచిదట.. గ్లైసెమిక్ సూచిక ప్రకారం సోయా, చిక్కుళ్లు తినడం వలన బాడీలో కార్బోహైడ్రేట్లు , డైటరీ వాటికి సాయం చేస్తుంది. సోయా బీన్స్ తినడం వలన మన బాడీకి అవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. కాలేయం, మూత్రపిండాలను రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
Read Also : Ayurveda Good for Heart : గుండె ఆరోగ్యానికి ఈ 5 ఆయుర్వేద మూలికలే సంజీవని..!