Ayurveda Good for Heart : మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం ఏది అని అడగగానే ప్రతీ ఒక్కరు చెప్పే సమాధానం ‘గుండె’. హ్యూమన్ బాడీలోని మిగతా పార్ట్స్ అన్నిటికీ ఆక్సిజన్, ఇతర పోషకాలను అందిస్తూ బ్లడ్ సప్లై చేసే ‘హార్ట్’ హెల్దీగా ఉంటేనే మనిషి జీవించగలడు. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యం కోసం ప్రతీ ఒక్కరు జాగ్రత్త వహించాల్సిన అవసరముంటుందని పెద్దలు చెప్తున్నారు. హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే గుండె సమర్థవంతంగా పని చేయాల్సి ఉంటుంది. అలా గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకుగాను ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఈ వనమూలికలను తీసుకున్నట్లయితే ప్రతీ ఒక్కరి గుండె చాలా యాక్టివ్‌గా పని చేస్తుంది. హార్ట్ హెల్దీనెస్ కాపాడటంలో అర్జున బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బెరడు పొడి హార్ట్‌కు చాలా మేలు చేస్తుంది. హార్ట్‌కు ఈ పొడి టానిక్‌గా వర్క్ చేయడంతో పాటు హార్ట్ కండరాలను బలపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్ లెవల్స్ సమతుల్యం చేయడంలోనూ సాయపడుతుంది. ప్రతీ రోజు అర్జున పొడిని మార్నింగ్, ఈవినింగ్ సరైన మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే హార్ట్‌కు చాలా మంచిది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడే మరో వనమూలిక ఉసిరి.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, అనాల్జెసిక్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ లక్షణాలు ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉసిరి పొడిని ప్రతీ రోజు కొంచెం తీసుకున్నా చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. మునగాకు కూడా గుండె ఆరోగ్యానికి హితకారిణి. మునగ ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మునగాకుల రసాన్ని ప్రతీ రోజు ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే హార్ట్ చాలా హెల్దీగా ఉంటుంది. అవిసె గింజలు, పసుపు కూడా హార్ట్‌కు చాలా మంచివి.
Read Also : Papaya Seeds : బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలా? తప్పక తెలుసుకోండి..!