Oral Diseases Cause Diabetes : మీ నోట్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే అది షుగర్ (Diabetes) వ్యాధి కావొచ్చు.. Type-2 డయాబెటిస్ ఒకసారి వస్తే జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఈ వ్యాధి ప్రబలుతోంది. ప్రస్తుత జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ తొందరగా వ్యాపిస్తోంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చినట్టు అనేక సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.
ఆ లక్షణాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు. సాధారణంగా డయాబెటిస్ రాబోయే ముందు ఆకలి అధికంగా వేయడం, తరచుగా మూత్రవిసర్జన చేయడం, అలసటగా అనిపించడం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు.. మీ నోటిలో ఈ మూడు రకాల లక్షణాలు కూడా కనిపిస్తాయి. నోటి ఆరోగ్యం చూసి కూడా వారికి షుగర్ వ్యాధి బారినపడినట్టు గుర్తించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే డయాబెటిస్ సోకినట్టు నిర్ధారించుకోవాలి.
Ayurvedic Remedies : వాసనను కోల్పోయారా ? ఈ ఆయుర్వేద చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి
నోరు పోడిగా ఉండటం :
టైప్-1, టైప్-2 డయాబెటిస్‌లో ప్రారంభ లక్షణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. మెడిషన్ ద్వారా ఈ సమస్యను కంట్రోల్ చేయొచ్చు. నాలుక పోడిబారడం, నోటిలో తేమ లేకపోవడం, చిగుళ్లలో పగుళ్లు ఏర్పడటం, పెదవులు పగలడం, నోటిలో పుండ్లు ఏర్పడటం, మింగేటప్పుడు, మాట్లాడే సమయంలో నమలేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది.
చిగుళ్ల వాపు :
దంతాల చిగుళ్లలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. శరీరంలో చక్కెర పరిమాణం పెరిగినప్పుడు.. నోటి వ్యాధులు వస్తాయి. నోట్లో సూక్ష్మ క్రిములు, కఫం తయారువుతుంది. తద్వారా చిగుళ్ళకు ఇన్ఫెక్షన్ సోకి వాపు వస్తుంది. దంత క్షయం, దంతాలు పుచ్చిపోవచ్చు.
తరచూ చిగుళ్ల వ్యాధితో బాధపడేవారిలో డయాబెటిస్ ఉండే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. చిగుళ్ళ వ్యాధి కారణంగా రక్తంలో అధికంగా ఉందని సూచిస్తుంది. చిగుళ్లలో ఎరుపు, వాపు, గొంతు లేదా రక్తస్రావం కావడం, నమలడంలో మార్పులు, దుర్వాసన, చెడు రుచి ఉంటాయి.
పళ్లు ఊడిపోవడం :
డయాబెటిస్ ఉన్నవారిలో రోగులలో చిగుళ్ళ వ్యాధి ఉంటుంది. చిగుళ్ళ చుట్టూ కఫం చేరడం దంతాలు వదులుగా మారుతాయి. ఫలితంగా దంతక్షయానికి కారణమవుతుంది. మధుమేహం బారినపడినవారిలో సగటున రెండింతలు దంతాలు ఊడిపోతాయని తేలింది.
Dangerous Zodiac Signs : ఈ రాశి మీదేనా? వీరికి హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తాయట.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి
వృద్ధాప్యంలో నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. వారిలో గొంతులోవాపు, చిగుళ్ళు వాపు, దంత నొప్పితో పాటు పలు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నోటి ఆరోగ్యం కోసం డయాబెటిక్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసుకోవాలి. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
ప్రస్తుత రోజుల్లో షుగర్ వచ్చిందో లేదో తెలుసుకోవడం కష్టమే. ఎందుకంటే.. వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది. మూడు పదుల వయస్సు దాటిందంటే అంతే.. షుగర్ మహమ్మారి కాటేస్తోంది. తమకు షుగర్ ఉందనే విషయం తెలియక ఏదో మందులు మింగేస్తుంటారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయినా షుగర్ రౌండప్ టెస్టు చేయించుకోవడం మంచిదని అంటున్నారు నిపుణులు. మీరు ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి.
షుగర్ వ్యాధికి నోటి అనారోగ్యమే కారణం :
వాస్తవానికి డయాబెటిస్ రావడానికి నోటీ అనారోగ్యమే కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నోటి ఆరోగ్యం విషయంలో చేసే తప్పులే క్రమంగా డయాబెటిస్ కు దారితీస్తాయని సూచిస్తున్నాయి. అలానే నిర్లక్ష్యంగా వదిలిస్తే చిగుళ్ల వ్యాధి రావొచ్చు.. క్రమంగా పళ్లు వదలై త్వరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు షుగర్ కారణంగా పళ్లు పుచ్చిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. మీ పళ్ల ఆరోగ్యంలో ఏమైనా తేడాలను గమనిస్తే మీకు అర్థమవుతుంది. మీకు షుగర్ వచ్చిందనడానికి ఇవే లక్షణాలుగా చెప్పవచ్చు.
నోటి లాలాజాలాన్ని బయటకు ఉమ్మిన సమయంలో అక్కడ ఏమైనా చీమలు రావడం గమనించండి. అలాగానీ చీమలు లాలాజలం పడిన ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు కనిపిస్తే కూడా మీకు షుగర్ ఎటాక్ అయిందనే గుర్తించవచ్చు.
First Night Milk Secret : ఫస్ట్‌నైట్ రోజు పాలే ఎందుకు తాగాలి.. అందులో ఉన్న సీక్రెట్ ఏంటి?
నోటిలో చిగుళ్ల వ్యాధితో బాధపడేవారు తప్పనిసరిగా షుగర్ టెస్టు చేయించుకోవడం ఎంతో అవసరం. వారికి తెలియకుండానే షుగర్ వ్యాధి వచ్చి ఉండొచ్చు. మీలో నోటి దంతాల సమస్యలు అధికంగా ఉంటే మాత్రం ఈ లక్షణాల విషయంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం వహించరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు నోటిపూత కూడా షుగర్ వ్యాధికి కారకంగా మారుతుందని అంటున్నాురు.
షుగర్ టెస్టు చేయించుకున్నారా? :
షుగర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. దాన్ని తెలుసుకోవాలంటే కొన్నిరకాల పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వచ్చినట్టు నిర్ధారణ కావాలంటే ఫాస్టింగ్ లేదా ఆహారం తీసుకున్నాక రెండు సార్లు టెస్టు చేయించుకోవాలి. ఉదయం పూట ఫాస్టింగ్ సమయంలో డయాబెటిస్ టెస్టు చేయించుకోవడం ద్వారా మీకు తినడానికి ముందు ఎంత స్థాయిలో షుగర్ లెవల్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే తిన్నాక కూడా మీకు ఎంత స్థాయిలో గ్లూకోజు ఉందో కూడా తెలుసుకోవచ్చు.
అప్పుడు మీకు షుగర్ వచ్చేసిందా? లేదా దగ్గరలో ఉందో అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. లేదంటే మూడు నెలల కాలంలో మొత్తానికి డయాబెటిస్ టెస్టు ఉంటుంది. అది కూడా చేయించుకున్నా మీకు ఎప్పుడు షుగర్ ఎటాక్ అయిందో నిర్ధారణకు రావొచ్చు. షుగర్ లెవల్స్ ఎప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
శరీరంలో గ్లూకోజు స్థాయిలో ఎప్పుడైతే నియంత్రణలో ఉంటుందో అప్పుడే మీ శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని గుర్తించాలి. అంతేకాదు.. టైప్-2 డయాబెటిస్, ఏ రకం షుగర్ వచ్చిందో కూాడా కచ్చితంగా నిర్ధారించుకోవాలి. దానికి తగినట్టుగా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. అలాగే ఏయే పదార్థాలను తీసుకోవాలో కూడా ఒక ఆహారపు పట్టికను సిద్ధం చేసుకోవాలి.
Ayurveda Diet Tips : అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!