Ayurveda Tips to lose weight in with weeks : అధిక బరువు.. దీని వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో మనకు కనిపిస్తుంటారు. వీరిని చూసి కొందరు జాలిపడితే.. మరి కొందరు హేలన చేస్తుంటారు. దీని కోసం బరువును తగ్గించుకునేందుకు వారు చేయని కసరత్తులు ఉండవు. రన్నింగ్, జాకింగ్, వాకింగ్, జిమ్ ఇలాంటి వాటన్నిటిని ట్రై చేస్తుంటారు. చివరకు ఆహార విషయంలో సైతం కాంప్రమైజ్ కాక తప్పదు.
ఇక వెల్లుల్లి విషయానికి వస్తే.. ఇది తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రతి ఇంటికి, ముఖ్యంగా వంటగదికి దీనితో విడదీయలేని అనుబంధముంటుంది. ప్రతి ఇంట్లో ఇది కామన్. ఇది లేని వంటగది ఉండదంటే అతిశయోక్తి కాదు. టమాట కూర నుంచి వంకాయ మసాలా వరకు, ఆమ్లెట్ నుంచి కబాబ్ వరకు, ఇలా వెజ్, నాన్ వెజ్ అని తేడా లేకుండా అన్ని వంటకాల్లో దీనిని ఉపయోగిస్తారు.
వంటలో ఇది లేకుంటే రుచిలో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. ఎన్ని రకాల వంటకాలు చేసిన అందులో వెల్లల్లి వేయాల్సిందే. దీని వల్ల వంటకాలు సువాసనతో పాటు ఘాటైన వాసనను పొందుతాయి. ఇదేంటి.. బరువు తగ్గించడానికి చిట్కాలు అని చెప్పి నోరూరించే వంటకాల గురించి చెబుతున్నారేంటి అనుకుంటున్నారా… ఆగండి.. ఆగండి.. అక్కడికే వస్తున్నాం.. వెల్లుల్లిని ఉపయోగించి వంటల గురించి చెప్పింది.

దాని ప్రాధాన్యత ఎలా ఉంటుందో చెప్పడానికి.. అలాగని ఇది మీకు తెలియంది కాదనుకోండి. ఇక అసలు విషయానికి వస్తే వెల్లుల్లిని ఉపయోగించి ఇంట్లోనే బరువు తగ్గించుకుకోవచ్చు. అందుకు సంబంధించి కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి అవి ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? ఏయే అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
బరువు తగ్గాలంటే వెల్లుల్లి వాడాల్సిందే :
మన వంటగదిలో వెల్లుల్లి ఉండటం కామన్. వంటగదికి వెల్లుల్లికి విడదీయలేం. ఆయుర్వేదంలో, వంటల్లో దీనిని ఏండ్ల తరబడి వాడుతూనే ఉన్నాం. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. అందువల్ల కొందరికి ఇది నచ్చదు. కానీ దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ మామూలుగా ఉండవు. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విషయంల పలు అధ్యయనాల్లోనూ వెల్లడైంది. వెల్లుల్లిలో అనేక పోషకాలు ఉన్నాయి. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అనారోగ్య సమస్యల నుంచి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది.

తక్కువ బీపీ, జలుబు వంటి వాటితో బాధపడేవారికి ఇది ఉపశమనకారి. దీని వల్ల కొవ్వును సైతం కరిగించుకోవచ్చు. ఇందులో ఉంటే విటమన్లు, కాల్షియము, మాంగనీసు బరువును తగ్గించడానికి సహాయపడతాయి. వెల్లుల్లిలోని ప్రత్యేక గుణాలుండటం వల్ల స్ర్తీలు వెయిట్ లాస్ కావడానికి తోడ్పతుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వెల్లుల్లి ద్వారా బరువును ఎలా తగ్గించుకోవాలని తెలుసుకుందాం.
Yoga Belly Fat Fast : ఎంతటి బానపొట్టనైనా కరిగించే అద్భుతమైన యోగాసనాలు ఇవే!
మొదటగా 2 వెల్లుల్లి రేకులను తీసుకుని చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి. రాత్రుల్లు నిద్రపోయే సమయంలో గ్లాసువాటర్ లో వాటిని నానబెట్టాలి. మరుసటి రోజు పొద్దున ఆ గ్లాసులోని వెల్లుల్లి ముక్కల్ని తీసేసి కొంచెం బ్లాక్ పెప్పర్ పొడివేసి మిక్స్ చేయాలి. ఇలా ఆ మిశ్రమాన్ని ప్రతి రోజూ పొద్దున్నే పడిగడుపున తీసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది.
ఈ చిట్కా ట్రై చేసి చూడండి :
మరో చిట్కా ఏంటంటే.. 3 వెల్లుల్లి రెక్కలను బాగా దంచి చిన్నముద్దగా చేసి, ఒక గ్లాసులో వేడినీరు తీసుకుని అందులో వేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా నిమ్మకాయ రసం కలిపి.. దానికి ఉదయం పడిగడుపున తీసుకుంటే వెయిట్ తగ్గడం పక్కా. ఇక మరో చిట్కా ఏంటంటే.. 3 వెల్లుల్లి రెక్కల పొట్టుతీసి బాగా దంచి ముద్దలాగా చేయాలి. ఓ గిన్నె లో కొద్దిగా తేనె తీసుకుని అందులో వెల్లుల్లి ముద్దను వేసి కలపాలి. సుమారు 30 నిముషాల తర్వాత దానిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఇదేమాదిరిగా ఒక సారి చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
వెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో:
ఇది కాకుండా మరో చిట్కా చూద్దాం.. 3 వెల్లుల్లి రెక్కలను మెత్తగా దంచి ముద్దచేసుకోవాలి. ఓ గ్లాసులో వేడి నీటిని తీసుకుని దీనిని అందులో కలిపి పక్కనబెట్టాలి. కాసేపయ్యాక అందులో కొంచెం నిమ్మకాయ రసం కలిపి పొద్దన పడిగడుపుతో తీసుకుంటే వెయిల్ లాస్ కావొచ్చు. కానీ వీటిని తీసుకునేముందు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వెల్లుల్లి తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి ఎంత లాభం చేకూరుతుందో.. అధిక మొత్తంలో తీసుకుంటే అదే స్థాయిలో అనారోగ్యపరమైన సమస్యలకు దారితీసే అవకాశముంది. దీనిని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా వాడుతూనే ఉంటాం.
Wife Dispute Husband : భర్తతో గొడవలు రాకుండా ఉండాలంటే భార్య ఏం చేయాలి?
అయినప్పటికి బరువు తగ్గాలనుకునే వారి కోసం పైన చెప్పిన చిట్కాల్లో తెలిపిన మోతాదులోని వీటిని తీసుకోవాలని లేదంటే కొత్త సమస్యలు వస్తాయి. వీటిని ఎక్కువగా వాడితే కడుపు మంట, శరీరం నుంచి చెడువాసన, వాంతుల వంటివి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి రోజు కేవలం రెండో లేక మూడో వెల్లుల్లి రెక్కలను మాత్రమే తీసుకోవడం మంచిది.

ఈ మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఒకవేళ ఏమైనా ఇతరేతర అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం వెల్లుల్లిని తగిన పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో తిరిగి వైద్యులను ఆశ్రయించక తప్పదు.