First Night Milk Secret : పెండ్లి.. రెండు మనుషులను, రెండు మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వేదిక. చాలా మంది పెద్దలు కుదిర్చిన పెండ్లిని చేసుకుంటారు. మన భాగస్వామి మనతో ఎలా ఉంటారో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. వారితో క్లోజ్‌గా మాట్లాడటానికి కొంచెం సిగ్గుపడటం, కొంచెం భయపడటం మామూలే. గతంలోనైనే పెండ్లి అయ్యే వరకు జీవిత భాగస్వామితో మాట్లాడటమే కుదిరేది కాదు.
ప్రస్తుతం ప్రేమ వివాహాలు పెరిగిపోయాయి. ఇక పెద్దలు కుదిర్చిన వివాహం విషయానికి వస్తే పెండ్లి చూపులు అయ్యాక ఒకరికొకరు నచ్చితే చాలు.. ఇక ఫోన్ పట్టుకుని గంటల తరబడి ముచ్చట్లే.. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకుంటారు. ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తపరుస్తారు. తర్వాత పెండ్లి చేసుకుని జీవితాన్ని హ్యాపీగా జీవించాలనుకుంటారు.
Ayurveda Diet Tips : అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!
సుమారు ఏడాదిన్నర పాటు కరోనా ప్రభావం వల్ల చాలా వరకు పెండ్లిడ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు కాస్త సద్దుమనగడంతో తక్కువ మంది బంధువులు, స్నేహితుల మధ్య వివాహం చేసుకుంటున్నారు. ఇక పెండ్లి తరువాత జరిగే కార్యం గూర్చి సపరేట్ చెప్పవల్సిన అవసరం లేదు. అదేనండి… ఫస్ట్ నైట్ గురించి.. రూం మొత్తం పూలతో డెకరేట్ చేసి ఫ్రూట్స్, స్వీట్స్‌తో ఏర్పాట్లు ఘనంగా చేస్తారు.
ఇక కార్యం సమయంలో నవ వధువు పాల గ్లాస్‌తో ఎంట్రీ ఇస్తుంది. ఈ సమయంలో చాలా మంది మదిలే ఓ ప్రశ్న మెదులుతుంది. శోభనం గదిలోకి నవ వధువు పాల గ్లాసుతోనే ఎందుకు వస్తుంది అని.. దీని గురించి మనలో చాలా మందికి తెలియదు. కేవలం సాంప్రదాయమేనని అనుకుంటారు.. కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట.. మరి వాటిని తెలుసుకుందామా!
పాల నుంచి హ్యాపీ హార్మోన్స్ :
ఫస్ట్ నైట్ రోజున వధూవరులు ఇద్దరు శోభనం గదిలో కొంచెం ఇబ్బందిని, బిడియాన్ని ఎదురుకొంటారు. వారిద్దరి మధ్యలో అలాంటివి దరిచేరనివ్వకుండా మిల్క్ ఎంతగానో ఉపయోగపడుతుందట. వధువు పాలు తీసుకొచ్చాక సగం సగం తాగుతారు ఎందుకంటే దీని వల్ల వారిరువురి బంధం స్ట్రాంగ్ అవుతుంది. పాలు ఎనర్జీ డ్రింకులాగా ఉపయోగపడతాయి. దీని వల్ల శృంగారానికి సంబంధించి ప్రేరేపణలు ఏర్పడటంతో వారిరువురు ఒకటైపోతారు. పాల నుంచి హ్యాపీ హర్మోన్స్ విడుదలవుతాయి. ఇవి మనసును రిలాక్స్ చేస్తాయి. అంతే కాకుండా మిల్క్‌లో ఎమినో యాసిడ్ ఉంటుంది.
Best Yoga Poses : అధిక బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు బాగా పనిచేస్తాయి ? ఏ సమయంలో మంచిదంటే?
పాలలో కలిపేది ఇవే :
ఇది పురుషుడిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. రాత్రి సమయంలో పురుషులు పాలు తాగడం వల్ల స్పర్మ్ కౌంట్ సైతం పెరుగుతుంది. పాలల్లో ఉంటే ప్రోటీన్స్.. హార్మోన్స్‌ను పెంచుతాయి. పాలను తాగితే నైట్ అంతా శృంగారంలో చురుకుగా పాల్గొనేందుకు అవి ప్రేరేపిస్తాయి. ఫస్ట్‌నైట్ పాలలో బాదం, మిరియాల పొడి, సాప్రాన్ కలిపి తయారు చేస్తారు కాబట్టి ఇవి తాగితే బాడీలో లిబిడో స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ అందుతాయి. పాలలో ఉంటే డీ విటమిన్ వల్ల ఒత్తిడి, అలసట దూరమవుతుంది. శృంగారం చేసుకునే టైంలో బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. దీనిని తగ్గించడానికి పాలు యూజ్ అవుతాయి.
శృంగారం సమయంలో శక్తి, సామర్థ్యం పెంచుకునేందుకు అప్పట్లో పాలు తాగేవారని కామసూత్రం చెబుతుంది. శోభనం గదిలో వరుడి కండ్లలోకి చూస్తూ వధులు పాలు తాగిపిస్తే ప్రేమ పెరుగుతుందని కామసూత్రంలో ఉంది. అప్పట్లో ఫస్ట్ నైట్ కు ముందు వధూవరులు పసుపు, చక్కెర, హనీ, మిరియాలు, సోపు కలిపిన పాలను తాగేవారట. అదే సాంప్రదాయాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నా.. పాలలో కొన్ని పదార్థాలను కలపడం మానేశారు.
Yoga Belly Fat Fast : ఎంతటి బానపొట్టనైనా కరిగించే అద్భుతమైన యోగాసనాలు ఇవే!
వాస్తవానికి పాలలో మిరియాల పొడి కలిపితే అవి రక్త నాళాలను ఉత్తేజం చేస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి ఉత్సాహంగా శృగారంలో పాల్గొంటారు. ఇలాంటి పాలు తాగడం కేవలం ఫస్ట్ నైట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి రోజూ తాగితే ఇక శృంగారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవట. లైంగిక సామర్థ్యం సైతం పెరిగి ఉత్సాహంగా శృగారంలో పాల్గొంటారట.
నేటి జంటలు పాటిస్తున్నాయా? :
కేవలం శృంగారం కోసమే కాకపోయిన శరీరానికి కావలసిన శక్తులు పాలు తాగడం వల్ల లభిస్తాయి. గతంలో పాలలో అనేక పదార్థాలు వేసి ఫస్ట్ నైట్ పాలను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం వాటి గురించి తెలియకనో.. లేక అవసరం లేదనుకునో.. చాలా మంది వాటిని కలపడం లేదు. కేవలం పాలు పంచదారతో తతంగాన్ని పూర్తి చేస్తున్నారు. గతంలో లాగా ఫస్ట్ నైట్ పాలలో చక్కెర, తేనే, సోపు, మిరియాలు కలిపి తాగడం వల్ల కలిగి ఉపయోగాలు తెలిస్తే ప్రస్తుతం కాలం నాటి జంటలు అదే పద్దతిని పాటిస్తాయి. అప్పట్లో ఇలా శరీరానికి ఉపయోగపడే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరిగి పిల్లలు త్వరగా, ఎక్కువ సంఖ్యలో పుట్టేవారు.
కానీ ప్రస్తుతం మారిన పరిస్థితులు, పని ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల చాలా మందికి పెండ్లయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు సైతం సంతానం కలగడం లేదు. దీని వల్ల సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. మందులు వాటి సంతానాన్ని పొందుతున్నారు. అలా కాకుండా సహజ సిద్ధంగా, ఎలాంటి మందులు వాడకుండా పిల్లలకు జన్మనివ్వాలంటే పూర్వపు ఆచారాలు పాటించాక తప్పదు మరి.
Wife Dispute Husband : భర్తతో గొడవలు రాకుండా ఉండాలంటే భార్య ఏం చేయాలి?