Yoga Health Benefits : ప్రస్తుతం చాలా మందికి వ్యాయామం, యోగా వలన కలిగే ఉపయోగాలు ఎంటని తెలిసివచ్చింది. ఒకప్పుడు ప్రతీ చిన్న అవస్థకు వైద్యులను సంప్రదించే ప్రజలు నేడు స్వయంగా యోగా వలన ఉపయోగాలు తెలుసుకుని సొంతగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే పనిలో ఉన్నారు. యోగ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం యాక్టివ్ గా ఉండటమే కాదు.. ఆరోగ్య పరంగా కూడా యోగా చాలా మేలు చేస్తుంది.
ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత కలుగుతుంది.అందుకే ఇటీవలి కాలంలో వైద్యులు కూడా తరచూ మెడిసిన్లు వాడటం తగ్గించి యోగాపై దృష్టి సారించాలని చెబుతున్నారు. అయితే, కొందరికి యోగా ఎలా చేయాలి. ఎవరికీ వారే చేసుకుంటే మంచిదా.. నిపుణులా సలహా తీసుకోవాలా..? యోగా అంటే వ్యాయామమేనా.. ఆసనాలు వేయడమే కదా.. ఇలా అనేక సందేహాలు ఉన్నాయి.
వాస్తవానికి యోగా అంటే ఆసనం కాదు.. :
చాలా మందికి యోగా ఆసనాలు వేయడం, భంగిమల్లో నిలబడటం అనుకుంటారు. నిజానికి యోగా అంటే ఆసనం మాత్రమే కాదు. అది యోగాలో ఒక ప్రక్రియ అంతే. యోగా మీన్స్ ఒక జీవన విధానం.. క్రమంగా యోగా చేస్తూ దానిపై పట్టుసాధించాలి. అది ఎలాగైనా కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మనకు ఎలా చేయాలో తెలియకపోతే నిపుణులను సంప్రదించొచ్చు. లేదా పుస్తకాలను చూసి తెలుసుకోవచ్చు. యోగాలో నిపుణులు కావాలనుకుంటే కోర్సులు కూడా ఉన్నాయి.
ఎవరు చేయవచ్చు.. :
యోగాను ఎవరైనా చేయవచ్చు. ఏజ్ లిమిట్స్ కూడా ఏమీ లేవు. కానీ ఆసనాలు వేయాలనుకునేవారు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. వారి పర్యవేక్షణలో వేస్తే ఇంకా మంచిది. శరీరం ధృడంగా ఉన్నవారు, అధిక బరువు కలిగి ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే చేయాలని నిబంధన ఏమీ లేదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండే చాన్స్ ఉంది. ఒకవేళ ఆరోగ్యంగా ఉండే వారు కూడా యోగాను చేస్తే అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. యోగా అనేది ఒంటరిగా చేసుకోవచ్చు. సమూహంగా కూడా కలిసి చేసుకోవచ్చు. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఒత్తిడి, డిప్రెషన్, మానసిక ఆందోళనలు కూడా తగ్గుతాయి.
Read Also : yoga poses for back pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు!