Weight Loss : ప్రస్తుత రోజుల్లో అనేక మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. తమ శరీర బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నారు. అయినా కానీ బరువు తగ్గక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంత మందైతే ఏకంగా బరువు పెరుగుతున్నామని నూనెలు, మరియు నెయ్యి వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గిస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదెలాగంటే.. మన శరీరానికి కొవ్వులు, నూనెతో కూడిన పదార్థాలు చాలా అవసరం. కానీ కొంత మంది బరువు పెరుగుతన్నామనే కారణంతో వాటిని తీసుకోవడం మానేస్తున్నారు.
కానీ అది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే నెయ్యి వంటి పదార్థాలు తీసుకోకకపోవడం వలన మన నాడీ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతే కాకుండా కొవ్వులు లేకపోవడం వల్ల మొమొరీ పవర్ తగ్గుతుందట. అలాగే శరీరం కూడా బలహీనంగా తయారవుతుంది. మన బాడీలో మానసిక కల్లోలం వస్తుంది. కాబట్టి నూనెలు, కొవ్వులు వంటి పదార్థాలు తగినంత మోతాదులో తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వంటి పదార్థాలను తీసుకోకవపోవడం వలన గుండె జబ్బులు ఉన్న వారికి మరింత ప్రమాదం.

కాబట్టి గుండె జబ్బులతో బాధపడే వారు తప్పకుండా నెయ్యి, ఆలివ్ ఆయిల్, ఆవాల నూనె వంటి పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి. మెదడు, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు కొవ్వులు చాలా ముఖ్యం. జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి కానీ కొవ్వులు, నూనె పదార్థాలు తినకుండా ఉండకూడదని వైద్యులు తెలుపుతున్నారు. ఇలా మనం కొవ్వులు తీసుకోవడం తగ్గిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మన జీర్ణ వ్యవస్థ కూడా కొవ్వులు లేకపోతే సక్రమంగా పని చేయదని సూచిస్తున్నారు.
Read Also : Kamanchi Plant : కాలేయ సమస్యలకు ఈ మొక్కతో చెక్.. మీ ఊళ్లో కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చిపెట్టుకోండి..!