Kamanchi Plant : ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుత మెడిసిన్ మొక్కలు. ఇవి లేకపోతే ప్రాణకోటి కూడా లేదని చెప్పొచ్చు. ఈ మొక్కలు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అందుకే చాలా మంది మొక్కలను ప్రేమిస్తుంటారు. ప్రకృతిపై ప్రేమను పెంచుకుంటారు. ప్రకృతి మనకు ఇచ్చిన మొక్కలు మన ఆయుష్షును పెంచడమే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయి. అయితే, మనం కలుపు మొక్కలుగా భావించే వాటిలోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
సాధారణ వ్యక్తులు వాటిని గుర్తించలేరు. కానీ ఆయుర్వేద వైద్యులు, శాస్త్రవేత్తలు సులువుగా గుర్తిస్తుంటారు. పూర్వం సంప్రదాయం వైద్యంలో ఈ మొక్కల వేర్లు, కాండం, పువ్వులు, ఆకులూ ఇలా ప్రతీ భాగాన్ని వైద్యం కోసం ఉపయోగించేవారని చాలా మందికి తెలీదు. అయితే, పిచ్చి మొక్కల కనిపించే ‘కామంచి’లో అనేక ఔషధ గుణాలున్నాయి. కామంచి మొక్క టమోట జాతికి చెందినదని పిలుస్తుంటారు. చూసేందుకు మిరప చెట్టులా కనిపిస్తుంది. దీని పండ్లు నలుపు రంగులో చిన్నవిగా ఉంటాయి.

ఈ మొక్కను ‘క్యాన్సర్, కాలేయ’ వ్యాధుల చికిత్సకు మంచి ఔషధంగా పనిచేస్తాయని కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్లాంట్ పై పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారని తెలిసింది. ముఖ్యంగా కాలేయ వ్యాధుల నివారణకు ‘కామంచి’ఆకులు బాగా పనిచేస్తాయి. లివర్‌కు టానిక్ లాగా ఉపయోగపుడుతుంది. ఈ మొక్కల నుంచి తీసిన రసంలో కొద్దిగా జీలకర్ర పొడి, మిర్యాల పౌడర్ కలుపుకుని రోజూఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి.
ఇలా చేస్తే కాలేయంలోని వ్యర్ధాలు, మలినాలు తొలిగిపోయి ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్, మందు తాగడం వలన డ్యామేజ్ ఐన కాలేయాన్ని కూడా శుభ్రం చేస్తుంది. కామంచి ఆకుల రసం యాంటీసెప్టిక్‌గా పనిచేయడంతో ఇన్ ఫెక్లన్లను దూరం చేస్తుంది. సీజనల్ వ్యాధులకు కూడా మంచి ఔషధం. కీళ్లనొప్పులు, అల్సర్లు, అజీర్తి రోగాలను కూడా నివారిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తేలు కాటుకు కూడా కామంచి ఆకుల రసం మెడిసిన్ లా పనిచేస్తుంది. రే చీకటి సమస్యకు ఈ మొక్కలు మంచి ఔషధం.
Read Also : Pomelo Fruit : బోలు ఎముకల వ్యాధితో బాధ పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!