Walking Heart Lungs Health : మీకు రోజూ నడిచే అలవాటు ఉందా? లేదంటే అలవాటు చేసుకోండి.. నడక ద్వారా అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండెజబ్బులకు నడకతో చెక్ పెట్టేయొచ్చు. మానసిక ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు. ఒక అరగంట సేపు వాకింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చునని చెబుతున్నారు నిపుణులు. రెగ్యులర్ గా వాకింగ్ చేసేందుకు సమయాన్ని కేటాయించాలని సూచిస్తున్నారు. నడవడం ద్వారా పని తీరు మెరుగుపడుతుంది. అలాగే కంటి చూపు కూడా బాగా కనిపిస్తుంది. మరిన్నిప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం..
రోజూ 45 నిమిషాల వాకింగ్ :
రెగ్యులర్‌గా అరగంట వాకింగ్ చేస్తే కేలరీలు కరిగిపోతాయి. హార్ట్ రేట్ పెరుగుతుంది.. తద్వారా బరువు తొందరగా తగ్గిపోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వారానికి 150 నిమిషాలు వాకింగ్ చేయాలంట..అలాగే రోజుకు 45నిమిషాలు పాటు వాకింగ్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. కార్డియో వాస్క్యులర్ సమస్యలు, కాన్సర్, టైప్-2 డయాబెటిస్ దరిచేరవు. కదలకుండా కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. అప్పుడు రక్తపోటు బాగా పెరిగిపోతుంది.

అనవసరమైన కొలెస్ట్రాల్ శరీరంలో నిండిపోతుంది. అదేపనిగా వాకింగ్ చేయాల్సిన పనిలేదు. మధ్యలో గ్యాప్ ఇస్తూ వాకింగ్ చేసినా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంట్లో ఏదైనా కూర్చొని పనిచేస్తున్నారు అనుకోండి.. లేచి అరగంట సేపు అటు ఇటూ నడవండి.. ఒక చోట నుంచి మరోచోటుకు నడవండి.. బాల్కనీలో వాకింగ్ చేయొచ్చు. మేడ మీద కూడా వాకింగ్ చేసుకోవచ్చు.. ఎలా చేసినా ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి.
ఇలా ప్రతిరోజూ వాకింగ్ చేస్తుంటే ఎంతో ఫిట్ గా ఉంటారని చెబుతున్నారు. ఫిట్ నెస్ నిపుణులు. ప్రతిరోజూ నడవడం వల్ల ఫ్యాట్ కరిగిపోతుంది. ఫిట్‌నెస్ లెవెల్స్ బాగా పెంచుకోవచ్చు. ప్రతిరోజూ వాకింగ్ చేస్తే కీళ్లు బాగా పనిచేస్తాయి. త్వరగా అరిగిపోకుండా ఉంటాయి. వాకింగ్ చేస్తే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. ఫ్రాక్చర్, కీళ్ళ నొప్పులు సమస్యలు దరిచేరవు.
Walking Heart Lungs Health : నడక మంచిదే.. రోజుకు ఎన్ని నిమిషాలంటే?
బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందిపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. నడుముపై ఒత్తిడి తగ్గాలంటే వాకింగ్ చేయాల్సిందే.. రక్త సరఫరా మెరుగై పూర్తిగా నడుంనొప్పి తగ్గుతుంది. వాకింగ్ చేస్తే శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. తద్వారా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ సమస్యలు తగ్గిపోతాయి.
లంగ్స్ డిసీజ్ దరిచేరవు :
రెగ్యులర్ నడవడం ద్వారా మన శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా పనిచేస్తాయి. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
మెరుగైన జీర్ణక్రియ :
ప్రతిరోజూ నడిచే అలవాటు ఉన్నవారిలో జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. కడుపులో పేగులు బాగా కదులుతాయి. అప్పుడు మలబద్ధకం వంటి అనేక అనారోగ్య సమస్యలు రావు. ప్రాణాంతక కాన్సర్ వంటి వ్యాధులు కూడా దరిచేరవు.
గుండెజబ్బులు రావు :
ప్రతిరోజు నడవడం అలవాటు చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె నొప్పి వంటి ఇతర గుండె అనారోగ్య సమస్యలు దరిచేరవు. నడవడం వల్ల రక్తం సరఫరా అవుతుంది. అప్పుడు శరీరంలోని రక్తం గుండెకు బాగా అందుతుంది. ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల కొలెస్టాల్ వంటి పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
ఆఫీసుల్లో ఉండేవారంతా ఎక్కువ సమయం కుర్చీకి అతుక్కుపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత అరగంట సేపు అయినా వాకింగ్ చేయాలంటున్నారు నిపుణులు. ఫిజికల్ యాక్టివిటీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
Read Also : Remedies For Grey Hair : తెల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాలు ట్రై చేయాల్సిందే!